Sunday, May 5, 2024

అగ్గి రాజేసిన అగ్నిపథ్‌!

త్రివిధ దళాల్లో నియామకాలను పర్యవేక్షించేందుకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బ్రిటిష్‌ వారి కాలం నుంచి పనిచేస్తోంది. వలస పాలకులు ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించే రీతిలో నిర్ణయాలు తీసుకునె వారు. బ్రిటిష్‌ వారి కాలంలో జరిగిన నిర్మాణాలు ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులు, నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే వారు స్థానికంగా అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చేపట్టిన పథకాలూ, ప్రాజెక్టులే. స్వాతంత్య్రా నంతరం తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా అదే రీతిలో రాజకీయ పార్టీలనూ, తన మంత్రి వర్గంలోనూ అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకునే వారు. ఆ నిర్ణయాలు సకల జన ఆమోదాన్ని పొందేవి. అంతవరకూ ఎందుకు? కాంగ్రెస్‌ ఏకపార్టీ పాలనను అంతం చేసి కేంద్రంలో తొలి సంకీర్ణ ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసిన బీజేపీ అగ్రనాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి కూడా సంకీర్ణ భాగస్వాములతో సంప్రదింపు ల తర్వాతే నిర్ణయాలు తీసుకునే వారు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ఎటువంటి విమర్శలు లేకుండా, కొనసాగడానికి ఆయన సమష్టిగా తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతుండం వల్లనే పాలకులు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమ వుతున్నాయి.

రాజకీయ వైరుధ్యాలున్నప్పటికీ పూర్వపు పాలకులు మంచి పథకాలను ప్రవేశపెడితే వాటిని కొనసాగించడం ఉత్తమ పాలకుల లక్షణం. స్వాతంత్య్రా నంతరం బ్రిటిష్‌ వారి పథకాలలో మంచి వాటిని గ్రహించి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వాటిని కొనసాగించా యి. అలా కొనసాగించిన వాటిలో రైల్వేలు, తంతి, తపాలా, రక్షణ, నౌకా, వైమానిక శాఖలు కూడా ఉన్నా యి. ఆనాటి పాలకులు ఇచ్చిన ప్రాధాన్యం, ప్రాముఖ్యా న్ని బట్టి అవి బలోపేతమైన సంస్థలుగా రూపుదిద్దు కున్నాయి. ఉదాహరణకు భారతీయ రైల్వేలు ఆసియా లోనే అతిపెద్ద రవాణావ్యవస్థగా పేరొందింది.భారతీయ సైన్యం తన సత్తాను సందర్భం వచ్చినప్పుడల్లా చాటుతూనే ఉంది. రక్షణ రంగానికి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో దాదాపు రెండుశాతాన్ని కేటాయించింది. ఏటేటా ఈరంగానికి కేంద్రం కేటాయింపులు పెంచుతోంది. ప్రపంచంలో రక్షణ శాఖకు ఎక్కువ కేటాయింపులు జరుపుతున్న దేశాల్లో మన దేశం మూడవది.అటువంటి ప్రాముఖ్యం ఉన్నందునే ఈ శాఖకు నిధుల కేటాయింపు నకే అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే మాదిరిగా నియామకాలు, విధివిధానాలకు కూడా అంతే ప్రాము ఖ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ, కేంద్రం వ్యయకర్తనం (పొదుపు) పేరిట ఈ శాఖ వ్యయాన్ని తగ్గించడం కోసం అగ్నిపథ్‌ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం పేేరుకు తగినట్టే అగ్నిని చిమ్ముతోంది. ఈ పథకం ప్రకటనకే సంబంధిత వర్గాల నుంచి ముఖ్యంగా, యువకులు, ఉద్యోగార్ధుల నుంచి నిరసనలు, ఆందోళన లు వ్యక్తం అవుతున్నాయి.

ఇందుకు కారణం ఈ పథకం ఉద్యోగార్ధులకు మేలు చేకూరుస్తుందని కేంద్ర మంత్రులు ఇప్పుడు ఇంత ఉద్రిక్తత చోటు చేసుకున్న తర్వాత తాపీగా ప్రకటనలు చేస్తున్నారు. ముందే అన్ని పార్టీల నాయకుల ను సమావేశపర్చి ఈ పథ కం మంచి సెబ్బరల గురించి వివరించి ఉంటే అనుమానాలు, అపోహలు వ్యాపించి ఉండేవి కాదు. ముఖ్యంగా, ఈ పథకం కింద తీసుకునే ఉద్యోగులను యూజ్‌ అండ్‌ థ్రో మాదిరిగా నాల్గేళ్ళ పరిమితి పూర్తి అయిన తర్వాత నిరాధారంగా వదిలివేస్తా రన్న భయాందోళనలు ఉద్యోగార్ధుల్లో ఏర్పడ్డాయి. పెన్షన్లు ఉండవు,గ్రాట్యుటీ, తదితర రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఏమీ ఉండవని చెప్పడం వల్ల ఈ పథకం పట్ల ఉద్యోగార్ధు ల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్మీలో పనిచేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగా ల్లో ప్రాధాన్యం లభించేది. ఇప్పుడు ఈ పథకం కింద నియమితులయ్యేవారికి అలాంటి హామీ ఉన్నట్టు లేదు. ప్రభుత్వం కొన్ని శాఖల్లో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగుల ను నియమించుకుంటోంది. కేంద్రంలోనూ, రాష్ట్రాలలో నూ కాంట్రాక్టు ఉద్యోగులు చాలామందే ఉన్నారు. ఆర్మీ లో కూడా కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాన్ని ప్రవేశ పెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.ఇది చాలా ప్రమాదకర ఆలోచన. అందునా రక్షణ శాఖలో ఈ ఆలోచన అమలులోకి వస్తే దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ప్రమాదంలో పడతాయన్నభయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాంకులు సహా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభు త్వం ఆలోచనలు చేస్తోంది.వీటిలో కొన్నింటిని అప్పుడే అమలులో పెట్టింది. రక్షణ రంగంలో కూడా ప్రైవేటీకర ణకు ద్వారాలు తెరిచింది. వ్యవసాయ చట్టాల మాదిరిగా ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement