Thursday, September 21, 2023

Editorial – నోరు జారుతున్న స‌చివులు …

సనాతన ధర్మం గురించి డీఎంకె యువ నాయకుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించవద్దంటూ తమ పార్టీ నాయకులు, కార్యకర్తల ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెచ్చరించినప్పటికీ, బీజేపీ నాయకులు ఇప్పటికీ అవాంఛనీయమైన వ్యాఖ్య లు చేస్తూనే ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు అపరిపక్వమైనవని భావించి వాటిని వదిలి వేయాలని ప్రధానమంత్రి తమ పార్టీ వారికే కాకుండా ప్రజలకు హితవొసెగారు. మతాన్నీ, మత ధర్మాలను కించపర్చే వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే. వివిధ మతాలు, కులాలు, వర్గాలతో కూడిన భారతీయ సమాజంలో భిన్నత్వంలో ఏకత్వం తరతరాలుగా కొనసాగుతోంది. అదే భారతీయ సంస్కృతి విశిష్టత, దానిని కాపాడుకోవల్సిన బాధ్యత దేశ పౌరులందరిపైనా ఉంది. జాతిపిత మహాత్మాగాంధీ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం స్పష్టం చేశారు. సర్వ మానవ సౌభ్రాతృత్వ, సమాదరణతో కూడిన భారతీయ ధర్మంలో అన్ని మతాలకూ, వర్గాలకూ చోటుందని గాంధీజీ అనేవారు. అటువంటి మహోన్నతమైన సంస్కృతికి వారసులమైన మనం అదే మార్గాన పయ నించడం మన ధర్మం. ఢిల్లిdలో రెండు రోజుల పాటు జరిగిన జి-20 సమావేశాల సందర్భంగా మోడీ ప్రసం గం అంతా భారత సంస్కృతి, సంప్రదాయాల చుట్టూనే సాగింది. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర మంత్రి గజానన్‌ షెకావత్‌ సనాతన ధర్మాన్ని విమర్శించిన వారి నాలుక కోసేయాలి, కను గుడ్లు పీకేయాలంటూ ఇచ్చిన పిలుపు ఆయన వయసూ, హుందాకూ తగినట్టుగా లేవు.

- Advertisement -
   

కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన నాయకుడు స్థిరత్వాన్ని కోల్పోయి దారుణంగా మాట్లా డటాన్ని సభ్యసమాజం హర్షించ దు. రాజస్థాన్‌ అసెంబ్లిdకి త్వరలో జరగనున్న ఎన్నికలకు ప్రచారం నిమిత్తం ఏర్పాటైన సభలో ఆయన చేసింది ముమ్మాటికీ రాజకీ య ప్రసంగమే. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచార సభల్లో విజ్ఞత కోల్పోయి, ఆవేశకావేశాలకు లోనయి ప్రసంగాలు చేయడం సర్వసాధారణమే అయినా, సున్ని తమైన విషయాలను ప్రస్తావించేటప్పుడు సంయమనా న్ని ప్రదర్శించాలి. ఉదయనిధి స్టాలిన్‌ చేసింది కూడా రాజకీయ ప్రసంగమే. వయసు రీత్యా ఉడుకు రక్తం కావడం వల్ల ఆయన ఉద్రేక పడి మాట్లాడి ఉండవచ్చు. కానీ, వయసు, అనుభవం కలిగిన షెకావత్‌ ఈ రీ తిలో పిలుపు ఇవ్వడం ఏ రకంగా చూసినా సమర్ధనీయం కాదు. బీజేపీ నాయకులు గతంలో కూడా ఇలాంటి ప్రకట నలే చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవారు ఈ దేశంలో ఉండటానికి అర్హులు కాదని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు.

అదీ అభ్యంత రకరమైనదే అయినప్పటికీ కొంతలో కొంత సరిపెట్టుకో వచ్చు. నాలుక కోసేయాలి, గుడ్లు పీకేయాలనే పదాలను ఉపయోగించడం అనాగరికం, అమానుషం. మోడీ తొలి కేబినెట్‌లో మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మోడీని వ్యతిరే కించే వారికి ఈ దేశంలో స్థానం లేదనీ, వారంతా పాక్‌ వెళ్ళిపోవాలంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరిక చేశారు. అప్పుడు మోడీ ఆయనను పిలిచి గట్టిగా మందలించా రు. అలాగే, బీజేపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన ఉమా భారతి, సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌వంటి వారు కూడా సమయ సందర్భాలను విస్మరించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినందు కు మోడీ మందలించారు. ఇప్పుడు కూడా మంత్రి గజేంద్ర షెకావత్‌ని పిలిచి ప్రధాని మందలించవచ్చు. నోరు అదుపులో పెట్టుకోని వారు ఇప్పుడే కాదు, గతంలోనూ ఉన్నారు. గోరక్షకులపై దాడులకు పురి కొల్పి న వారిని కూడా మోడీ సహించలేదు. బీజేపీ నాయకుల్లో సీనియర్‌లు ఇంకా కొందరు సంయమనాన్ని పాటించని వారున్నప్పటికీ, మోడీ అందరినీ కలుపుకుని పోయే రీతిలో పార్టీని నడిపిస్తున్నారు. సున్నితమైన అంశాలను, సామాజిక న్యాయదృక్పథంతో పరిశీలించి వాటికి పరిష్కారాలను కనుగొంటున్నారు.

త్రిపుల్‌ తలాక్‌ వంటి సమస్యలకు మోడీ చాలా చాకచక్యంతో పరిష్కారాలను సూచిస్తున్నారు. భారతీయ సంప్రదాయాల కోణంలో ప్రతి సమస్యకూ పరిష్కారాలను కనుగొనాలన్న ఆయన సూచన ఇప్పటికే చాలామంది హర్షామోదాలను పొందింది. గజేంద్ర షెకావత్‌ నోరు జారడం ఇది కొత్త కాదు.అయితే, ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు మతానికి సంబంధించినవి కావు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఆయన తెలుగురాష్ట్రాల మధ్య సామ రస్యం కోసం కృషి చేయడానికి బదులు ఇరురాష్ట్రాల మధ్యచిచ్చు పెట్టే రీతిలో మాట్లాడారు. అప్పుడు ఆయన ను ప్రధానిమందలించారు. అలాంటి విషయాల్లో సర్దుకుని పోవచ్చు కానీ, మతం, సంస్కృతి సంప్రదా యాల విషయంలో ఆచి తూచి మాట్లాడాలనే విషయం సీనియర్‌ నాయకుడైన షెకావత్‌కి తెలియదని అనుకోగ లమా? ఎన్నికల సభ కనుక ఆయన అత్యుత్సాహాన్ని ప్రదర్శించవచ్చు. ఇలాంటి విషయాలను తేలికగా తీసుకోవడం అన్ని వర్గాలకు శ్రేయస్కరం. ఆయన ఉపయోగించిన భాష మాత్రం అభ్యంతరకరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement