Monday, December 9, 2024

Editorial – వ‌ర్షాల‌తో పాటే రోగాలు .. జాగ్ర‌త్త‌లే వ‌రాలు

కుండపోత వానల నుంచి ఉపశమనం అను కుంటే… వెన్నంటే వరదలు… ఆవెంటే బురద… ఇవి చాలవన్నట్లు రోగాలు… ఇది అంటు వ్యాధుల సమయం. వానలు వరదల ఉప్రదవం కన్నా మరింత తీవ్రమైన ఉపద్రవమిది. వర్షాకాలంతో పాటే జ్వరాలు, విషజ్వరాలు సర్వసాధారణమవుతు న్నాయి. పూర్వ కాలంలోవిష జ్వరాలు రాకుండా మన పెద్దలు జాగ్రత్తలు తీసుకునే వారు, మిరి యాలు,తులసి ఆకు నీళ్ళను మరిగించి కషా యం తాగితే విషజ్వరాలు రావని నమ్మకం. దానిని దివ్యౌ షధంగా పరిగ ణించేవారు. కాస్త తుమ్ము, తగ్గు వస్తే ఆవిరి పట్టేవారు. ఇప్పుడు అలాంటి పద్దతులన్నింటినీ నాటు వైద్యం, మోటు వైద్యంగా పరిగణించి వైద్యుల వద్దకు పరిగెత్తడం అలవాటుగా మారింది. అప్పట్లో వైద్యుల్లో కూడా ముఖంచూసి, నాడి చూసి, కళ్లు, గొంత చూసి వ్యాధులను ఇట్టే చెప్పేసేవారు.ఇప్పుడు అన్నింటికీ టెస్టులు చేయించుకోవాలని ఫలానా వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు వెళ్ళమని ఆదేశిస్తు న్నారు.దీంతో వ్యాధుల బారిన పడిన వారు తిరిగి కోలుకోవడానికి ఎంతో సమయం పట్టడం, జేబులో డబ్బు ఖాళీ అవడం జరుగుతోంది . ఇదే ఆధునిక జీవన విధానంగా చెలామణి అవుతున్నది.

ఆంగ్ల వైద్యంలోనే ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దాన్‌ క్యూర్‌ అనే సామెత ఉంది.రోగం వచ్చిన తర్వాత హడావుడి చేయడం కన్నా, ముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.వర్షంలో తడిస్తే పూర్తిగా తల తుడుచుకోవాలి. వీలైతే సాంబ్రాణి పొగ వేసుకోవాలి. ఇది అలనాటి సంప్రదాయక చికిత్స.. ఇంటి చికిత్స. కరోనా వెళ్ళినా, దాని తాలూకు వ్యాధుల ప్రభావం ఇంకా చాలా చోట్ల వెంటాడుతూనే ఉంది. దేశ రాజ ధాని ఢిల్లిd సహా అన్ని ప్రధాన నగరాలు,పట్టణాల్లో వైద్య సౌకర్యాలు బాగా విస్తరించినా, వైద్యులున్న ఆస్ప త్రుల్లో మందులుండవన్న నానుడి స్థిరపడిపో యింది. ఆరోగ్య సంరక్షణ అనేది ప్రభుత్వం బాధ్యత అనేది వేదికలపై నాయకుల ఉపన్యాసాలకే పరిమితం .వైద్య,ఆరోగ్య శాఖ లు ఉమ్మడి జాబితాలోనివి. వాటి కోసం అటు కేంద్రం,ఇటు రాష్ట్రాలు వార్షిక బడ్జెట్‌లలో వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నా,పేదల ఆరోగ్యా నికి భరోసా లేదు.బ్రిటిష్‌ వారి సమయంలోనే వైద్య,ఆరోగ్య శాఖలు ఎంతో జవాబుదారీగా, నమ్మకంగా ఉండేవన్న మాటల్లోఅసత్యం లేదు. వర్షా ల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు అతలా కుతలం అయ్యాయి.

నీరు పేరుకుని పోవడం వల్ల కుళా యిల్లో వచ్చే నీరు స్వచ్ఛమైనదన్న నమ్మకం లేదు. మంచినీరు,మురికి నీరు కలిసి పోతున్నాయి. వీధి కుళాయిల వద్ద గోతులు తవ్వి బిందెలు వాటిలో పెట్టి నీరు పట్టుకోవడం గ్రామాల్లోనే కాదు, పట్టణాలు, నగరాల్లో కనిపించే దృశ్యం.ఇలాంటి నీటిని పట్టుకుని అవే మంచినీరు అనుకుని తాగేస్తున్నారు జనం. వాటిని కాచుకునేందుకు కూడా వెసులుబాటు లేని వర్గాలను మనం నిత్యం చూస్తున్నాం. మంచినీరు, విద్యుత్‌,రహదారులు పురపాలక,నగరపాలక సం స్థల దే బాధ్యత. వీటి నిర్వహణ తలకు మించిన భారంగా అవి భావిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని మనం కాపా డుకోవడం కన్నా ఉత్తమమైన మార్గం వేరే లేదు. వర్షా కాలంలో నీరు నిల్వఉండటం వల్ల దోమలు వ్యాపించి రోగ కారకాలు అవుతున్నాయి. దోమల వల్ల ఫైలేరి యా,.మలేరియా వంటి రోగాలే కాకుండా, మనిషి ఆయువును పీల్చి పిప్పి చేసే వ్యాధులు అనేకం వ్యాపిస్తున్నాయి. హైదరాబాద్‌,సికిందరాబాద్‌ వం టి మహానగరాల్లో శివారు ప్రాంతాల్లో ,మౌలిక సదు పాయాలు లేని కొత్త కాలనీల్లో మురికి నీ టి నిల్వవల్ల రోడ్లపై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటమే కాదు, దోమల తోపాటు రోగాలు వ్యాపి స్తున్నాయి. మురుగునీరు, మరుగుదొడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారడంతో డయేరియా వంటి వ్యా ధులు వ్యాపి స్తున్నాయి.సూక్ష్మ క్రిముల వల్ల వ్యాపించే జ్వరాలకు వైరల్‌ ఫీవర్‌ అనే పదాన్ని ఉపయో గిస్తున్నారు.

ఏ రోగమైనా మంచాన పడితే తిరిగి కోలు కోవడానికి కనీసం వారం పదిరోజులు పడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాల బారిన పడిన వారిని మంచంపై ఆస్పత్రులకు తీసుకుని వెళ్ళే దృశ్యాలు సాధారణ మయ్యాయి. ఏజెన్సీలో వైద్యశాలలు, వైద్యుల కొరత ఈ ప్రభుత్వాలు ఏర్పడిననాటి నుంచి సాధార ణమయ్యాయి. వర్షాకాల సీజన్‌లో రోగాల బారిన పడకుండా చూసుకోవడమే పౌరుల కర్తవ్యం. వీధి కూడళ్ళల్లో తోపుడు బండ్లపై తయారు చేసే పదా ర్ధాలను తినడం, మంచి నీరు పేరిట ఏ నీరు పడితే అది తాగడం మంచిది కాదు.వాటి వల్ల రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. నిల్వ ఉంచిన ఆహార పదార్ధా లను,ముఖ్యంగా ఈగలు వాలినవి తినరాదు. రోగకారకమైన వాతావరణానికి దూరంగా ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమేd మనకు శ్రీరామరక్ష.

Advertisement

తాజా వార్తలు

Advertisement