Monday, April 29, 2024

ఎడిటోరియ‌ల్ – పార్టీలు ….జాతీయ హోదా..

రాజకీయ పార్టీలు ప్రజల మద్దతుతోనే కొనసాగుతా యి. వాటికి గుర్తింపు వచ్చేది ప్రజల ఆదరణ వల్లే.ప్రజల ఆదరణ లేకపోతే అవి మనుగడ సాగించలేవు. స్వాతం త్య్రానికి ముందు, ఆ తర్వాత ఎన్నో పార్టీలు వచ్చాయి. వాటిల్లో మిగిలినవి కొన్నే. అంతమాత్రాన మిగిలిన పార్టీలు ప్రజల ఆదరణకు నోచుకోలేదని అనుకోరాదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఆచార్య ఎన్‌జీ రంగా కృషి కార్‌ లోక్‌పార్టీని, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ప్రజా పార్టీని నెలకొల్పారు. రాష్ట్రాల వారీగా ఇలాంటి పార్టీలు ఎన్నో మనుగడలోకి వచ్చాయి. అవి ఓట్లు-సీట్ల రాజకీ యాల్లో నిలవలేకపోయినా ప్రజల అభిమానాన్ని పొందాయి. జాతీయ పార్టీగా దశాబ్దాలుగా గుర్తింపును పొందిన కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ హోదాని కోల్పోవడంపై విమర్శలు, వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజల్లో ఉండే పార్టీ ఎన్నిక ల రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఆ పార్టీ ప్రజా సమస్యలపై ఉద్యమాలను నిర్వహిస్తూ ఉంటుంది. ధర లు పెరిగినప్పుడల్లా ఎర్రజెండాలు అన్ని చోట్లా రెపరెప లాడుతూ ఉంటాయి.

అలాగే, ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకున్నప్పుడు సీపీఐ రంగం లో దిగుతూ ఉంటుంది. సీపీఐకి వందేళ్ళచరిత్ర ఉంది. సిపిఐ అనుబంధ సంస్థ ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఎఐటియుసి) పేరిట కార్మిక సంఘంఉంది. అదే మాదిరిగా సిపిఎం సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ (సీఐటీయూ)నీ, కాంగ్రెస్‌ ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌టియుసీ)ని బీజేపీ బీఎంఎస్‌ని కలిగి ఉన్నాయి. ఇవికాక హెచ్‌ఎంఎస్‌ వంటి ట్రేడ్‌ యూనియన్లు కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఆయా పార్టీ లకు మద్దతుగా ఈ ట్రేడ్‌ యూనియన్లు ప్రచారం చేస్తున్న మాట నిజమే. ట్రేడ్‌ యూనియన్‌ నాయకుల్లో చాలా మంది పార్లమెంటులోతమ వాణిని ఇప్పటికీ వినిపిస్తు న్నారు. ఇవి జాతీయ హోదా కోసం కాకుండా ప్రజలు ముఖ్యంగా, కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోఉన్న సంస్థలను ప్రైవేటు పరం చేయ డం అనేది పూర్వపు యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ జరిగింది. అప్పుడు ప్రైవేటు పరం అయిన ప్రభుత్వ సంస్థలు కొన్ని మాత్రమే. నష్టాలు వస్తున్న సంస్థలను మాత్రమే ప్రైవేటు పరం చేస్తున్నామని యూపీఏ ప్రభు త్వం కారణం చెప్పేది. ఇప్పుడు లాభాలు వస్తున్న సంస్థ లను కూడా ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోంది. దీనికి వ్యతిరేకం గా వామపక్షాలు ఉద్యమాలను నిర్వహి స్తున్నాయి.

గుర్తింపు ఉన్నా, లేకపోయినా వామపక్షాలు ప్రజల కోసం, ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటా యి. తాజాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే అంశంపై సిపిఐ ఆందోళనకు పిలుపు ఇచ్చింది. ఆ రోజు ల్లో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వాలు ప్రాణప్రదం గా కాపాడుకునేవి. ఇప్పుడు అడిగేవారు లేరనే ధోరణిలో ఎడాపెడా ప్రైవేటు పరం చేసేస్తున్నాయి. గుర్తింపు పొంది న పార్టీలు పోరాడితేనే ప్రభుత్వాలు లెక్క చేయని పరిస్థి తుల్లో గుర్తింపు రద్దయిన పార్టీలు పోరాడితే ఇక లెక్క చేస్తాయా అన్న ప్రశ్న జనంలో కలగడం అత్యంత సహ జం. అసలు ప్రజలలో అలాంటి నిర్లిప్తతా భావం ఏర్పడా లన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం పోరాడే సంస్థలు, సంఘాల ను నీరుగారుస్తోందనే అభిప్రాయం మేధావుల్లో ఏర్పడు తోంది. రాజకీయ పార్టీల గుర్తింపు అంశం ప్రభుత్వ పరిధి లోనిది కాకపోయినా ప్రభుత్వ పరోక్ష అజమాయిషీలో పని చేసే ఎన్నికల సంఘానిది.ఎన్నికల సంఘం ప్రధానా ధికారి నియామకం విషయంలోసుప్రీంకోర్టు ఆ మధ్య కీలకమైన తీర్పు ఇచ్చింది. ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా గల కొలిజియం వంటి కమిటీ సిఫార్సు మేరకే ప్రధాన ఎన్నిక ల కమిషనర్‌ని నియమించాలని సిఫార్సు చేసింది.

ఎన్నిక ల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడెెందుకు ఇదొక్కటే పరిష్కారం, రాజకీయ పార్టీల గుర్తింపు విషయం లో కేంద్ర ఎన్నికల సంఘం విశేషమైన అధికారాలను విని యోగిస్తోందన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. ఓట్లు, సీట్లు ప్రాతిపదికగా పార్టీలకు గుర్తింపు మంజూరు చేయ డం, లేదా రద్దు చేయడం సరైన పద్దతి కాదని మేధావులు వాదిస్తున్నారు.ఎన్నికల్లో పోటీ చేయడానికి మేధావులు నిరాకరిస్తున్న ప్రస్తుత తరుణంలో మేధావులు ప్రాతిని ధ్యం వహించే పార్టీలకు గుర్తింపు లేకుండా చేస్తే వారి సల హాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనట్టే అవుతుం ది. కనుక ఈసీ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం పునరా లోచన చేయాలి.ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కోర్టుకు వెళ్తామని సీపీఐ ఇప్పటికే ప్రకటించింది. అలాగే,పశ్చిమ బెంగాల్‌లో త ృణమూల్‌ కూడా కోర్టుకు వెళ్ళేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల్లో ఎలాగోఅలాగ గెలుపొం దేందుకు ప్రయత్నించే పార్టీలకు మాత్రమే ఇక గుర్తింపు లభిస్తుందన్న మాట!.ఎన్నికల్లో గెలుపొందేందుకు అడ్డదారులు తొక్కే పార్టీల సంఖ్య పెరిగిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement