Tuesday, April 30, 2024

సెంట్రింగ్ సీట్స్ చోరీ కేసులో నలుగురు అరెస్టు..

తిరుపతి సిటీ ఏప్రిల్ 12 ( ప్రభ న్యూస్): భవన నిర్మాణాలకు ఉపయోగించు సెంట్రింగ్ సీట్స్ దొంగతనం చేసిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు క్రైమ్ అదనపు ఎస్పీ విమల కుమారి తెలిపారు. బుధవారం ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ… తిరుపతి రూరల్ మండలం పేరూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన సునీల్ (29), అవిలాల ఆంధ్ర బ్యాంక్ కాలనీ చెందిన గణేష్ (20), అదే పంచాయతీకి చెందిన వెంకటకృష్ణ అలియాస్ వెంకీ (19), అలాగే చట్టంతో సంఘర్షణ పడ్డ బాలుడిని అరెస్టు చేసినట్లు వివరించారు. జిల్లాలో 7 నెలల నుండి కొత్తగా భవన నిర్మాణాలు వద్ద ఉపయోగించే సెంట్రింగ్ సీడ్స్, పిల్లర్ బాక్సులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేస్తున్నార‌ని జిల్లా ఎస్పీ పరమేష్ రెడ్డికి ఫిర్యాదులు అందింది. దీంతో దీనిపై ప్రత్యేక నిఘా ఉంచారు పోలీసులు. ఇందులో భాగంగా ఈస్ట్ సీఐ బీ.వి.శివ ప్రసాద్ రెడ్డి, ఎస్ఐ నాగేంద్రబాబు సిబ్బంది కలిసి వాళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1,50,000 విలువ కలిగిన సెంట్రింగ్ సీడ్స్, పిల్లర్ బాక్సులు, జాకీ రాడ్స్ స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పి మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ సీఐ, ఈస్ట్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు మునిరాజా, రవి, కానిస్టేబుళ్లు జ్యోతినాథ్, ప్రభాకర్, చిరంజీవిలకు ఎస్పీ అభినందనలు తెలియజేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement