Wednesday, April 17, 2024

ప్ర‌జాసామ్యా మూల స్తంభాల‌ను కూల్చేస్తున్నారు – బిజెపిపై సోనియా ఆగ్ర‌హం..

న్యూఢిల్లి: ప్రధాని నరేంద్ర మోడీ వైఖరులు, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షు రాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య మూ ల స్తంభాలను కేంద్ర ప్రభుత్వం కూలదోస్తోందని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. మౌనం దేశ సమస్యలను పరిష్కరించదు అనే సందేశంతో ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో మోడీ సర్కార్‌పై ఆమె విరుచుకు పడ్డారు. పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లిd ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, తమపార్టీ సందేశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్తామని నొక్కి చెప్పారు. భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలతో కలసి సాగుతామని స్పష్టంచేశారు. ప్రధాని మోడీ, అతని ప్రభుత్వం శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలను క్రమ బద్ధంగా కూల్చివేస్తున్నదని ఆరోపించారు, వారి చర్యలు ప్రజా స్వామ్యంపై లోతైన పాతుకుపోయిన ధిక్కారాన్ని ప్రదర్శిస్తున్నాయి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల అండతో పెరుగుతున్న ద్వేషం, #హంసను ప్రధాని విస్మరిస్తున్నారంటూ సోనియా ఆగ్రహించారు.

శాంతి, సామరస్యానికి ముప్పు..
మతపరమైన పండుగలు ఇతరులను భయపెట్టడానికి, బెదిరించేం దుకు సందర్భాలుగా కనిపిస్తున్నాయి. మోడీ పాలనలో పండగలు ఆనందానికి, వేడుకలకు చాలా దూరంగా ఉన్నాయి. సంతోషాలకు బదులుగా, మతం, ఆహారం, కులం, లింగం లేదా భాష పేరులతో వివక్ష చెలరేగుతోంది. మోడీ ప్రకటనలు అత్యంత ముఖ్యమైన సమస్యలను విస్మరించాయి. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ-ఆరెస్సెస్‌ వికృత క్రీడకు తెరలేపాయి. ఎంతగా అణచివేసినప్పటికీ, ఇకెంతమాత్రం దేశ ప్రజలు మౌనంగా ఉండలేరు.. రాబోయే కొద్ది నెలలు భారత ప్రజాస్వామ్యానికి కీలకమైన పరీక్ష. మోడీ ప్రభుత్వం ప్రతి అధికారాన్ని దుర్వినియోగం చేయడం, అనేక కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున దేశం కూడలిలో ఉంది అని సోనియా గాంధీ పేర్కొన్నారు.

రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటాం..
భారత్‌ జోడో యాత్రలో చేసినట్లుగానే కాంగ్రెస్‌ పార్టీ తన సందేశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. భారత రాజ్యాంగాన్ని, దాని ఆదర్శాలను రక్షించడానికి భావసారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్‌ చేతులు కలుపుతుందని స్పష్టంచేశారు. ప్రజల గొంతును కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌ పోరాటం చేస్తున్నదని, ప్రధాన ప్రతిపక్షంగా తమ గంభీరమైన కర్తవ్యాన్ని అర్థంచేసుకుంటామని చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తమ పార్టీ భావసారూప్యత కలిగిన అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకునే విషయానికి వస్తే, ప్రధాని చేతల కంటే మాటలే బిగ్గరగా ఉంటున్నాయని ప్రజలు తెలుసుకున్నారు. ప్రతిపక్షంపై ఆగ్ర#హం వ్యక్తంచేయడం లేదా నేటి దుష్పరిణామాలకు గత నాయకులను నిందించడం ద్వారా అత్యంత ముఖ్యమైన సమస్యలను విస్మరిస్తున్నారు. వాటినుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. మోడీ చర్యలు, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్దేశాలు ఊహకందని రీతిలో వక్రమార్గంలో ఉంటున్నాయని సోని ధ్వజమెత్తారు.

ప్రజాస్వామ్య పిల్లర్ల కూల్చేవేత..
పార్లమెంటులో ఇటీవలి పరిణామాలను ప్రస్తావిస్తూ, గత సెషన్‌లో పార్లమెంటరీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి బీజేపీ ప్రయత్నించింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆందోళన కలిగించే సామాజిక సమస్యలను లేవనెత్తకుండా ప్రతిపక్షాలను నిలువరించేం దుకు మోడీ ప్రభుత్వం వ్యూహాలు పన్నింది. విభజనలు, ఇతర ముఖ్యమైన సమస్యలతో పాటు బడ్జెట్‌, అదానీ స్కామ్‌ గురించిన చర్చను అడ్డుకుంది. నిశ్చయాత్మకమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందు కు ప్రభుత్వం అపూర్వమైన చర్యలను అవలంబించింది. ప్రసంగాలను తొలగించడం, చర్చలను నిరోధించడం, పార్లమెంటు సభ్యులపై దాడి చేయడం చివరకు ఆగమేఘాల మీద కాంగ్రెస్‌ ఎంపీని అనర్హుడిగా ప్రకటించడం వంటి అవాంఛిత చర్యలకు బీజేపీ ప్రభుత్వం దిగింది. ఫలితంగా రూ.45 లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో కూడిన బడ్జెట్‌ ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందిందని సోనియాగాంధీ అన్నారు.

- Advertisement -

సీబీఐ, ఈడీ అధికారాల దుర్వినియోగం..
నరేంద్ర మోడీ ప్రభుత్వం సీబీఐ, ఈడీని దుర్వినియోగం చేయడం అందరికీ తెలిసిందే. 95 శాతానికి పైగా రాజకీయ కేసులు ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే నమోదయ్యాయి. అదే సమయంలో బీజేపీలో చేరిన వారిపై కేసులు అటకెక్కాయి. సత్యం, న్యాయం, ధర్మం గురించి గొప్పగొప్ప మాటలు చెప్పే ప్రధాని మోడీ, తనకు సన్నిహితుడైన వ్యాపారవేత్తపై వచ్చిన ఆర్థిక మోసాల ఆరోపణల్ని విస్మరించడం దారుణం. దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మెహుల్‌ చోక్సీపై ఉన్న ఇంటర్‌పోల్‌ నోటీసును మోడీ ప్రభుత్వం ఉపసంహ రించుకుంది. బిల్కిస్‌ బానోపై దోషిగా తేలిన రేపిస్టులను విడుదల చేశారు. వారంతా బీజేపీ నేతలతో వేదిక పంచుకున్నారని సోనియా ధ్వజమెత్తారు.

న్యాయవ్యవస్థపై దాడి జరుగుతోంది..
న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రభుత్వం క్రమబద్ధమైన దాడులు చేస్తోంది. స్వయాన కేంద్ర న్యాయమంత్రి కొంతమంది రిటైర్డ్‌ జడ్జీలను దేశ వ్యతిరేకులని, ఇందుకు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించడం దేనికి సంకేతం? ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, వారి అభిరుచులను రెచ్చగొట్టేందుకు, న్యాయమూర్తులను భయపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ భాషను ఎంచుకున్నారు. ప్రభుత్వ రాజకీయ బెదిరింపులకు, బిజెపి స్నే#హతుల ఆర్థిక బలంతో మీడియా స్వాతంత్య్రం చాలా కాలంగా రాజీపడిందని సోనియా ఆరోపించారు. నిశ్శబ్దాన్ని అమలు చేయడం వల్ల దేశ సమస్యలు పరిష్కారం కావని నొక్కిచెప్పారు. చైనాతో ప్రత్యక్ష సరి#హద్దు సమస్యను ప్రస్తావిస్తూ, చైనా చొరబాట్లను ప్రధాని తిరస్కరించడం, పార్లమెంటులో చర్చను ప్రభుత్వం అడ్డుకోవడం, విదేశీ వ్యవహారాల మంత్రి పరాజయ వైఖరిని అవలంబించడం మోడీ సర్కార్‌ అసమర్థతను చెప్పకనే చెబుతోందని సోనియా మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement