Monday, April 29, 2024

ఎడిటోరియ‌ల్ – స‌మున్న‌తం మ‌న రాజ్యాంగం..

రాజ్యాంగ రూపకల్పనకు సారథ్యం వహించిన డాక్టర్‌ భీమ్‌రావు రాంజీ అంబేద్కర్‌ భావజాలాన్ని వ్యాపింపజేయడమే ఆయనకు భారత జాతి సమర్పించే నివాళి అన్న ప్రకాష్‌ అంబేద్కర్‌ మాటల్లో అణుమాత్రం అత్యుక్తి లేదు. అంబేద్కర్‌ 125అడుగుల మహావిగ్రహా న్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో కలిసి శుక్రవారం ఆవిష్కరించిన ప్రకాష్‌ అంబేద్కర్‌ ఈ కార్యక్ర మంలో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు. అంబే ద్కర్‌ విగ్రహం ఎంత సమున్నతమైనదో ఆయన ఆశయాలు కూడా అంత సమున్నతమైనవని ఆయన అన్నమాట్లో రవంతైనా అసత్యం లేదు. అంబేద్కర్‌ వ్యక్తిత్వం ,భావజాలం ఈ దేశానికి ఎంతో కరదీపిక లుగా నిలిచాయి.స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్ళలో ఆయన ఈ దేశానికి ఎలాంటి వ్యవస్థ ఉండాలో నిర్దేశించారు. గాంధీగారు దేశ స్వాతంత్య్ర సమరానికి నేతృత్వం వహించి మహాత్ముడయ్యారు.ఆయన అడుగు జాడల్లో భారత దేశం నడిచి ఉంటే ప్రస్తుత పరిస్థితులు ఉండేవి కావని అభిప్రాయపడే వారు ఇంకా ఉన్నారు. అలాగే, అంబేద్కర్‌ ఆశయాలను అటకెక్కించడం వల్లనే దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదు ర్కొంటోందని భావిస్తున్నవారెంతో మంది ఉన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న మాట పెద్దల నుంచి పిన్నలవరకూ అందరి నోటా వినిపిస్తోంది. అంబేద్కర్‌ పేరు చెప్పగానే అట్టుడుగు వర్గాలకు రిజర్వే షన్ల గురించే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు.

అంబేద్కర్‌ సాధించిన విజయాల్లో అది ఒకటన్నది ముమ్మాటికీ నిజం. అయితే,దేశానికి ఆయన అందించిన అమోఘమైన ఆభరణం రాజ్యాంగం. భారత రాజ్యాం గం వంటిది ప్రపంచంలో ఎక్కడా లేదని ఎంతో మంది న్యాయకోవిదులు ఇప్పటికీ ప్రశంసిస్తూ ఉంటారు. ప్రపం చంలో మనతో పాటు స్వాతంత్య్రాన్ని మన దేశంతో పాటు స్వాతంత్య్రాన్ని పొందిన అనేక దేశాలు ముఖ్యం గా, మన పొరుగుదేశాలు ఎన్ని తిరుగుబాట్లకు,కుట్రలకు లోనయ్యాయో సమకాలీన చరిత్ర చెబుతోంది. భారత రాజ్యాంగం ఇతర దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తిదాయ కమైనది. ముఖ్యంగా, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్ల డానికి రాజ్యాంగమే పునాది. మన ప్రజాస్వామిక వ్యవస్థపై ఎన్ని దాడులు జరిగినా అది చెక్కు చెదరలేదు. రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆత్యయిక పరిస్థితి సమయంలో జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు.ఆ తర్వాత కూడా రాజ్యాంగంపై పలు రకాల దాడులు జరు గుతూనే ఉన్నాయి రాజ్యాంగం పరిరక్షణ సుప్రీంకోర్టు ప్రధాన లక్ష్యమని మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ,ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ పలు సందర్భాల్లోస్పష్టం చేశారు. రాజ్యాం గం జోలికి వెళ్ళడానికి ఎవరూ సాహసించకపోవడానికి దానిని అంత పకడ్బందీగా రూపొందించిన అంబేద్కర్‌ ప్రతిభ,మేథా సంపత్తులను ప్రశంసించకుండా ఉండ లేం.

దేశంలో పౌరులందరికీ ప్రాథమిక హక్కులు ఉండా లన్న మన రాజ్యాంగంఎన్నో విధాల ఆదర్శప్రాయమైన ది. ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటికీ మకుటాయమై నది. రాజ్యాంగం గురించిన గొప్పదనం గురించి ఇప్పటి కీ చర్చ జరుగుతోంది. రాజ్యాంగాన్ని చిన్నబుచ్చే ప్రయ త్నాలు జరిగినప్పుడల్లా దేశంలోని ప్రజాస్వామ్య వాదులు ప్రతిఘటిస్తున్నారు. పౌరుల ప్రాథమిక హక్కు లను కాపాడటంలో మనరాజ్యాంగం ఎన్నో సందర్భాల్లో ప్రజలకు అండగా నిలిచింది. అంతటి మహత్తరమైన రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్‌ సమాజంలో అన్ని వర్గాలకూ ఆరాధ్యుడు. హైదరాబాద్‌లో ఆయన మహావిగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ,దక్షిణాదిన రెండో దేశ రాజధాని ఉండాలని అంబే ద్కర్‌ ఆకాంక్షించారనీ, అది ఇంకా నెరవేరలేదని అన్నా రు. ప్రజలు తలుచుకుంటే అది కూడా నెరవేరుతుంది.
ఇప్పటికే వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయ ట్రిబ్యు నల్‌ను హైదరాబాద్‌లో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ కృషి ఫలితంగా ఏర్పడింది.గతంలో ఈ వివాదాల పరిష్కారానికి సింగపూర్‌ వెళ్ళేవారు. అంబేద్కర్‌ ఆశించిన సామాజిక న్యాయం సాధించేందు కు అందరిలో చైతన్యం వచ్చింది. అయితే, దళితులు, అట్టడుగు వర్గాలపై దాడులను ఎదుర్కోవడానికి ఆందో ళనలకు ఉపక్రమిస్తున్నారు. ఈ చైతన్యం కొనసాగితే సామాజిక న్యాయం సాకారమవుతుంది. సమాజంలో అట్టడుగు వర్గాలపైనా, అసహాయ వర్గమైన మహిళలపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. వీటిని నిరోధించేం దుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా అవి అమలు జరగటం లేదు. షెడ్యూల్‌ కులాల హక్కుల పరిరక్షణ చట్టం మహిళల చట్టం అమలు జరగకపోవడమే ఇందు కు నిదర్శనం. రాజ్యాంగం బలహీనులకు కల్పించిన రక్షణలను అమలు చేసినప్పుడే అంబేద్కర్‌ ఆశయాలను పాటించినట్టు. ఆయన జయంతులు, వర్ధంతులు నిర్వ హించడం విగ్రహాలకు పూల మాలలు వేయడంతో ఆయనను గౌరవించినట్టు కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement