Tuesday, May 7, 2024

మనోజ్ఞగా శ్ర‌ద్ధా శ్రీనాథ్.. పోస్ట‌ర్ రిలీజ్

సైంధ‌వ్ చిత్రం నుండి హీరోయిన్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ లుక్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్.ఆమె మనోజ్ఞగా కనిపించనున్నట్లు ప్రకటించారు. తన నటనతో అందరినీ అలరించే సూపర్ టాలెంటెడ్ నటి!! సైంధవ్ బృందం అద్భుతమైన నటి శ్రద్ధాశ్రీనాథ్ ని స్వాగతిస్తోంది అని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో హీరోగా వెంక‌టేశ్ న‌టిస్తున్నారు. సైంధవ్ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ స్థంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ సహా పలువురు నటులు కనిపించనున్నారు. టాలెంటెడ్ దర్శకుడు శైలేశ్ కొలను దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement