Tuesday, September 19, 2023

Editorial – చంద్రునితో బంధం…

జాబిల్లిని ముద్దాడటానికి వెళ్ళిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడం తథ్యమని నిర్థారణ కావడంతో భారతీయులందరి దృష్టే కాకుండా, యావత్‌ ప్రపంచం దృష్టి చంద్రయాన్‌పై కేంద్రీకృతమై ఉంది. చంద్రయాన్‌ విజయవంతం అయితే, సాంకేతికంగానే కాక, ఆర్థికంగా భారత్‌ ఎంతో పురోగతిని సాధించినట్టు అవుతుంది. అంతరిక్ష రంగంలో మన దేశం సరికొత్త చరి త్రను సృష్టించినట్టు అవుతుంది. ఇంతవరకూ అమెరికా, రష్యా, చైనా, జపాన్‌లకు మాత్రమే సొంతమైన ఖ్యాతిలో భారత్‌ వాటా పంచుకోనున్నది. ఇంకా చెప్పాలంటే రష్యా ను మించిన ఖ్యాతి భారత్‌కి దక్కనున్నది. రష్యా సాధిం చిన విజయాలన్నీ సోవియట్‌ యూనియన్‌ హయాంలో సాధించినవే. రష్యా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత రాస్‌కాస్మోస్‌ చేపట్టిన ఏకైక మూన్‌ మిషన్‌ లూనా-25 ప్రయోగం విఫలమైంది.

చంద్రుని వద్దకు ప్రయోగాలకు ఇప్పటి వరకు 13 దేశాలు 146 ప్రయత్నా లు చేశాయి. వీటిలో 69 మాత్రమే విజయవంతం అయ్యాయి. చంద్రుడిపై అన్వేషణల విషయంలో అగ్రరాజ్యానికే 15 వైఫల్యాలు ఎదురయ్యాయి. దీంతో పోల్చిచూస్తే భారత అంతరిక్ష కేంద్రం ప్రయత్నాలు ఎంతో ఫలప్రదమనే చెప్పాలి. జాబిలిపైకి మన దేశం జరిపిన మూడు ప్రయోగాల్లో ఒక్కటే విఫలమైంది. ఇప్పుడు మూడో ప్రయోగం విజయవంతం కాబోతు న్నది. చంద్రయాన్‌-3లో నేడు చేపట్టే తుది ప్రక్రియ సజావుగా పూర్తియితే మన దేశానికి ఎనలేని ఖ్యాతి వస్తుంది. ఈ సక్సెస్‌ మన దేశానికి అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంది. చంద్రునిపై రహస్యాలను కనుగొనేం దుకు వీలవుతుంది.

- Advertisement -
   

మన అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పటికే వ్యాపారపరంగా లాభాలను ఆర్జిస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్‌ తయారు చేసే హార్డ్‌ వేర్‌కు గిరాకీ పెరుగుతుంది. వాటి ఆధారంగా తయారీ పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలు బాగా పెరుగుతాయి. భారత్‌ని తృతీయ ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు మన ప్రభుత్వం సాగిస్తున్న యత్నాలు సఫలం కావడానికి దోహదం చేస్తుంది. మన దేశం ఇంతవరకూ 34 దేశాలకు చెందిన 381 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. వీటి ద్వారా 279 మిలియన్‌ డాలర్లను ఆర్జించింది. చంద్ర యాన్‌ ప్రయోజనాల్లో ముఖ్యమైనది చంద్రుని ఉపరి తలంపై అన్వేషణ. ఇందుకోసం ఇస్రో ఎంతో శ్రమి స్తోంది. ఎన్నో పరిశోధనలు చేస్తోంది.

చంద్రునిపై నీటి జాడలున్నాయని చంద్రయాన్‌-1 ప్రయోగంలో తేలింది. దాంతో జాబిలిపై మనుగడకు అవకాశాలపై ఆశలు చిగురించాయి. భూమండలానికి ప్రత్యామ్నా యంగా మరొక ఆవాసం కోసం మానవుడి అన్వేషణలో ముందగుడు పడినట్లయింది. చంద్రుడి ఉపరితలం, అక్కడి వాతావరణం స్థితిగతులను అధ్యయనం చేయడమే ఇప్పుడు జరుగుతున్న మూన్‌ మిషన్ల ప్రధాన లక్ష్యాలు. చంద్రుని ఉపరితలం వలసరాజ్యంగా ఉపయో గ పడుతుందా అనే దానిపై కూడా పరిశోధనలు సాగుతు న్నాయి.భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం కావడం వల్ల చంద్రునిపై ఖనిజాలు, ఇతర అమూల్య నిక్షేపాలను కనుగొంటే భారత్‌కి ఎంతో ఉపయోగకరం అవుతాయి. చంద్రయాన్‌-3 సురక్షితంగా ల్యాండ్‌ అయితే, అక్కడి సమాచారాన్ని మనకి పంపిస్తుంది. చంద్రుని దక్షిణ ధ్రువంలో లభించే రాళ్ళు, మట్టి కొన్ని లక్షల క్రితం నాటి పరిస్థితులను ఆవిష్కరించే అవకాశం ఉంది. చంద్రునితో భూమికి గల సంబంధాలను కనుగొనేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే , అక్కడి లభించిన మృత్తిక ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగపడవచ్చు. అక్కడ జరిపే పరిశోధనలు దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడవచ్చు.

ఇస్రో చంద్రయాన్‌ ప్రయోగాలు చేపట్టింది కేవలం రోవర్లు, ల్యాండర్లను చంద్రుడి మీదకు పంపించడానికి మాత్రమే కాదు. ఎప్పటికైనా మానవుల్ని కూడా చంద్రుడి మీదకు పంపాలనే బలీయమైన సంకల్పంతో భారత అంతరిక్ష కేంద్రం అడుగులు వేస్తోంది. కానీ, ఈ ప్రయత్నం అనుకున్నంత సులభం కాదు. అందుకే ఒక్కో విజయం సాధిస్తూ ఇస్రో ముందు కెళ్తోంది. తదుపరి ప్రయోగాల్లో మానవ స#హత అంతరిక్ష నౌక లను పంపి స్తారు. ఈ దిశగా అమెరికా కూడా వేగంగా అడుగులు వేస్తోంది.ఇందుకోసం ఆర్టెమిస్‌ను మరింత సమర్థవం తంగా తీర్చిదిద్దుతోంది. గతంలో వ్యోమ గాములను చంద్రుడిపైకి పంపిన నాసా 2025 నాటికి దక్షిణ్రధువంపై అడుగిడేలా ప్రణాళికలు సిద్ధంచేసింది. ఇవన్నీ సజావుగా సాగితే చందమామ రావే.. జాబిల్లి రావే అని కాకుండా చందమామ వస్తున్నా.. జాబిల్లిd వస్తున్నా.. అని పాడు కునే రోజులు ఎంతోదూరం లేనట్లే.

Advertisement

తాజా వార్తలు

Advertisement