Sunday, April 28, 2024

HYD: పేద అడబిడ్డల పెళ్లికి అండగా ఉప్పల ఫౌండేషన్.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ : ఉప్ప‌ల ఫౌండేష‌న్ పేద ఆడ‌బిడ్డ‌ల పెళ్లికి అండ‌గా ఉంటుంద‌ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కి చెందిన పేద కుటుంబం అమ్మాయి, వరలక్ష్మి వివాహం కోసం, హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన నిరుపేద కుటుంబం అమ్మాయి భవాని వివాహం కోసం వారు హైదరాబాద్ నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్యాంప్ కార్యాలయంలో వ‌చ్చి క‌లువ‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా పుస్తె, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ, మన తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ అడబిడ్డలను తోబుట్టువులుగా చూసుకుంటూ ఒక అన్నలా, మేనమామ లాగా వారి సంక్షేమం, అభివృధి కోసం ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను చేపట్టినది సీఎం కేసీఆర్ ఒకే ఒక్కడు అని అన్నారు. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం, సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక అయిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకంను నిరుపేద అడబిడ్డలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్నివర్గాల పేదలు, పేద ఆర్యవైశ్యులు కూడా కళ్యాణ లక్ష్మికి అప్లయ్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు పెళ్లి కూతుర్లు, వారి కుటుంబ సభ్యులు, సిద్దిపేట జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన అధ్యక్షులు ఎన్సీ సంతోష్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ఐవిఎఫ్ అధ్యక్షులు కైలాస ప్రభాకర్, నాగేంద్రం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వుత్తునూరి సంపత్ , ఐవీఎఫ్ రాష్ట్ర‌ ఉపాధ్యక్షుడు మాడిశెట్టి సదానంద్ గుప్తా, నోముల రాజు గౌడ్, పద్మా గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ముహమ్మద్, సోమేశ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement