Saturday, November 2, 2024

యాదాద్రి బ్రహ్మోత్సవాలుమత్స్యావతారంలో నృసింహుడు

యాదగిరిగుట్ట, ప్రభన్యూస్‌: స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మో త్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం మూడవ రోజు ప్రధానాలయంలో అలం కార సేవలు ప్రారంభమయ్యాయి. అలంకార ప్రియు డైన శ్రీ లక్ష్మీనృసింహుడిని దశావతారాల్లొ ఒకటైనా శ్రీ మత్స్యావ తారుడిగా అలంకరించి ఊరే గించారు. సత్యవ్రతమహారాజు వేదాలను పహరించిన సోమకున్ని సంహరించి మత్స్యావ తారుడిగా వేదాలను రక్షించిన అవతారంగా చెప్పబడుతుంది. మత్స్యావతారుడిగా అలంకరించి శ్రీ స్వామి వారిని వేదమంత్రాలు.. సన్నాయి వేళాలు.. మంగళ వాయి ద్యాల.. భక్తుల జయజయ ధ్వానాల మధ్య భక్తుల దర్శనార్ధం తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం పశ్చిమ దిశలో నిర్మించిన వేంచేపు మండ పాల్లో ఆస్థానం చేసి మత్స్యవతార విశేషాలను ఆచార్యులు వివరించారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామి వారిని శేష వాహన సేవ పై తిరువీధుల్లో వివరింప జశారు.
ఉత్తర మాఢ వీధుల్లో రథశాల ఎదురుగా వైటీడీ ఏ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక పై ప్రదర్శితమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్‌ లక్ష్మీనరసింహా చార్యులు, మరింగటి మోహనా చార్యులు, అర్చక బృందం ఉత్సవ వేడుకను నిర్వ హిం చారు. ఆలయ ఈవో ఎన్‌. గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహామూర్తి ఏర్పాట్లను పర్యవేక్షిం చారు. ఈ నెల 28న శ్రీ స్వామి వారి తిరు కల్యాణం నిర్వహిస్తున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, భువనగిరి డీసీపీ రాజేష్‌చంద్ర సంయుక్తంగా ఏర్పాట్లను పరిశీలించి సలహాలు, సూచనలు అందజేశారు. తూర్పు మాఢవీధుల్లో ఆగ్నేయ దిశలో నూతనంగా నిర్మించిన బ్రహ్మోత్సవ మండపంలో తిరుకల్యాణ మహోత్సవం జరపనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement