Saturday, October 12, 2024

తల్లిని డంపింగ్ యార్డులో వదిలి వెళ్ళిన కసాయి..

తాడేపల్లి,ఫిబ్రవరి24(ప్రభ న్యూస్) తాడేపల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిని అర్థరాత్రి బ్రహ్మానందపురంలోని డంపింగ్ యార్డ్ లో కన్న కొడుకే వదిలివేసిన వెళ్లిన ఘటన తాడేపల్లి బ్రహ్మానందపురంలో చోటు చేసుకుంది.బాధితురాలు విజయవాడ గవర్నర్ పేటకు చెందిన రామలక్ష్మిగా గుర్తించారు.ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు కృష్ణ జిల్లా నుండి
ప్రక్క జిల్లాలోని గుంటూరు తాడేపల్లి లో వదిలేసి వెళ్లారు. కన్న కొడుకు ఇక్కడ వదిలి వేయడంతో చనిపొదామని అనుకున్నా దైర్యం చాలలేదని కన్నతల్లి రామ లక్ష్మి కన్నీటి పర్యంతం అయింది. బాధితురాలు రామలక్ష్మి ఆవేదనపై చలించిన అధికారులు బాధితురాలిని ఓ మిషనరీ సంస్థలో చేర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement