Wednesday, May 15, 2024

భగవంతుని ప్రేమ పాత్రులు

వై కుంఠ వాసుడైన శ్రీమహావిష్ణువు- శ్రీమన్నారాయణుడు- లక్ష్మీ పతికి భక్తులంటే ఎంతో యిష్టము. భక్తరక్షణార్థమే యుగ యుగా లలో ఆయన అవతారములు దాల్చి భక్త రక్షణ గావించుట మన పురాణాలలో, పలు గ్రంథాలలోని రచనలు తెలియజేస్తున్నాయి. నారాయ ణుడు దశావతారములు దాల్చి మీనరూపుడై వేదాలను రక్షించాడు. కూర్మ రూపుడై భూమిని, భూదేవి రక్షించాడు. వరాహరూపంతో రక్షణ చేశాడు. ఉగ్రనారసింహ రూపం దాల్చి హిరణ్యకశిపుని సంహరించి, తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడినాడు. వామనరూపంలో బలి గర్వమణచి పాతాళము నకు అణగ్రదొక్కి రాక్షస బాధల నుండి మునులను రక్షించినాడు. తాను నమ్ముకున్న, తనను సదా భక్తితో సేవించే భక్తులకు శ్రీరామచంద్రుని అవతా రములో సుగ్రీవుని, హనుమంతుని- శబరిని- గుహుని, విభీషణుని రక్షించి వారికి రామనామ మహిమను తెలిపి తరించమన్నాడు.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడై బాల్యంలో పలు లీలలను చూపి, వయసులో పాండవులకు, కుంతికి- ద్రౌపదికి- అక్రూరునికి, గోపిక లకు, ఉద్ధవునికి దివ్యలీలలు చూపి భక్తి తత్పరత యొక్క విశిష్ఠతను తెలి పాడు. శ్రీకృష్ణుడే వైకుంఠవాసుడని నమ్మిన భక్త జనులకు ఆప్తబంధువుగా, ఆర్తత్రాణపరాయణునిగా నిలిచాడు. అన్నదమ్ములైన కౌరవ, పాండవులకు ఆస్తి విషయంలో, రాజ్యం విషయంలో కలహం వస్తే తాను నమ్మిన పాండ వుల పక్షమున నిలిచి, కురుక్షేత్ర సంగ్రామంలో పార్థసారధియై విజయాన్ని అందించిన ఆశ్రిత రక్షకుడు. విశ్వరూప సంద ర్శనమును అర్జునునికి చూపి, పార్థుని యుద్ధోన్ముఖుని గావించుటకు పరమాత్మ గీతను బోధించాడు. భగవంతుడే ధర్మరక్షణా ర్థం గీతాసందేశం ద్వారా తనకు ఎలాంటి భక్తు లంటే యిష్టమో, తన భక్తులు యుగయుగా లలో ఎలా మెలగాలో, మానవులు ఎలా సుఖ సంతోషాలు- శాంతిని పొందాలో తన గీతా శ్లోకముల ద్వారా దివ్యఉపదేశం అందించాడు శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో 12వ అధ్యా యం భక్తి యోగం ద్వారా తనకు ఎటువంటి భక్తులంటే ఇష్టమో, వారు ఎలా జీవితంలో మసులుకొని, తన ప్రేమకు పాత్రులవుతారో 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు తెలి పారు పరమాత్మ.
13వశ్లోకంలో-
అద్వేష్టా సర్వభూతానాం –
మైత్ర: కరుణపవచ
నిర్మమో, నిరహంకార:-
సమదు:ఖ సుఖ:క్షమీ||
అంటూ సర్వప్రాణుల యందునా ద్వేషములేనివాడై, మైత్రినీ, దయనూ పాటిస్తూ, దేహేంద్రియాలమీద మమకారం లేనివాడై, సుఖ దు:ఖాలకు అతీతుడై, సహనంతో, ఓర్పుతో, నిత్యసంతోషంలో, నిర్మల మనస్సుతో, దృఢమైన నిశ్చయంతో మనస్సునీ, బుద్ధినీ నాయందే నిలిపిన భక్తుడంటే ఇంతో ఇష్టం.
లోకాలన్నీ తాను భయపెట్టక, తాను లోకానికి భయపడక ఆనందం- ద్వేషం- భయచాంచల్య రహితుడు కావాలి. కోరికలు లేక పరిశుద్ధుడై, సమర్థత కలిగి, తటస్థునిగా వుంటూ, మనసులో వ్యాకుల పాటు లేనివాడై, కర్మఫలముల నాశించకయున్నవాడు నాకిష్టుడుగా వుంటాడు. నాకు ప్రియ భక్తుడౌతాడు. ఎవరైతే సంతోషం- దు:ఖం- వ్యతిరేకత- శుభాశుభ గణనం లేకుండా వున్నాడు పరమాత్మ అయిన తనకు యిష్టుడన్నాడు.
శ్లో|| సమశ్శ్రతేచ- మిత్రేచ- తధామానవమానయో
ష్లసుఖదు:ఖేషు- సమస్సంగ వివర్జిత:|| అంటూ శత్రువులు-మిత్రుల పట్ల వారి గురించి సమదృష్టి గల వాడూ, కోరికలు లేనివాడు, కోరికలను విసర్జించిన వాడే నా ప్రియ భక్తుడన్నాడు.దొరికిన దానితో తృప్తిచెందేవా డు- మౌనియై- స్థిరనివాసం లేక, సుస్థిర మనస్సు గలవాడు పరమాత్మ కిష్టుడు.
భక్తిమోగం చివరలో తాను తెల్పిన భక్తుల లక్షణాలు దాదాపు ముప్పది రెండునూ ఆశయాలలో గాకుండా, ఆచరణలో చూపించాలని, ఎవరైతే నా ఆశయాలకు అనుగుణంగా చరిస్తారో వారి పట్ల నాకృప, నా రక్షణ వారి కుం టుందని అంటూ
శ్లో|| మేతుధర్మ్యామృత మీవం- యధోక్తం పర్యుపాసతే
శ్రద్ధదానామత్పరమా:- భక్తాస్తేతీవమే ప్రియ:|| అంటూ ఎవరైతే నేను చెప్పిన ఈ ధర్మాన్ని అనుష్ఠిస్తూ, ఆచరిస్తూ, విశ్వసిస్తూ, నన్నే నమ్మి ఉపాసి న్తూ ఉంటారో వారే నాకు మిక్కిలి ఇష్టులు- ప్రియ భక్తులు. వారే నా ప్రేమకు పాత్రులౌతారని శ్రీకృష్ణ పరమాత్మ భక్తుల లక్షణాలను వివరిస్తూ సకల మానవులు ఆధ్యాత్మిక భావంతో వుండి దైవ లక్షణాలు కలిగి శాంతి సుఖా లను పొందాలని భగవద్గీత ద్వారా సమాజనికి దివ్య సందేశం అందించిన పరమాత్మకు మనం సర్వదా శరణాగతియై, కృతజ్ఞతలు తెలిపి భక్తి తత్పరతో మెలిగి ధన్యజీవులమవుదాం. సదాదైవ స్మరణలో పయనిద్దాం. పరమాత్మ సందే శా న్ని అమలులో పెడదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement