Monday, April 29, 2024

ఆపరేషన్ మదర్ టైగర్ కి ముగింపు .. తిరుపతి జూకు పులి పిల్లల తరలింపు

ఆత్మకూరు – .ఆపరేషన్ మదర్ టైగర్ కి గురువారం ముగింపు పలికారు. రాత్రి తిరుపతి శ్రీ వేంకటేశ్వర జూ పార్కు కు నాలుగు ఆడ పులి పిల్లలను తరలించారు . దీంతో గత నాలుగు రోజులుగా తల్లి పులి ఆచూకీ కోసం అటవి శాఖ అధికారుల చేసిన ప్రయత్నం వృధా అయ్యింది. అదిగో పులి, ఇదిగో టీ 108 అంటూ పాద ముద్రలు, ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, తల్లి పులి T108F ని గుర్తించామని అంటున్న అధికారుల మాటలపై ఎన్నో అనుమానాలు రేకిపించడం మినహా మినహా చేసింది ఏమి లేదు.


ఇప్పటికీ విడుదల కానీ నాలుగు రోజుల ఆపరేషన్ మదర్ టైగర్ ట్రాప్ కెమెరా T108F ట్రేసౌంట్ చిత్రాలు మినహా ప్రజలకు కనపడింది ఏమీ లేదు.
మరోపక్క గత అర్థరాత్రి తల్లి పులికి పిల్లలను దగ్గరకు చేర్చేందుకు చేసిన ఆపరేషన్ లో పిల్లలను స్వీకరించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
నిన్న రాత్రి జరిగిన ఆపరేషన్ మదర్ టైగర్ టూ కబ్స్ సమయంలో రెండు పులి పిల్లలు అస్వస్థత గురైనట్లు తెలుస్తుంది. దీంతో సాహసం చెయ్యలేక.. అటవీ శాఖ అధికారులు చేతులు ఎత్తేసి తిరుపతి జూ కు తరలించిన సమాచారం. మొత్తంగా ఆత్మకూరు అటవీ అధికారులు. గత నాలుగు రోజుల్లో 90 గం.ల పాటు శాస్త్రీయంగా, సాంకేతికంగా ఎంత అన్వేషించిన తల్లి దరికి నాలుగు ఆడ పులి పిల్లలు చేరుకోకపోవడం జంతు ప్రేమికులకు నిరాశ మిగిల్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement