Monday, April 29, 2024

ఉషాకన్య స్వప్న ఫలం

ఉష అను పేరుగల కన్య. ఈమె బాణాసురుని (బలిచక్రవర్తి కొడుకు) కూతురు. ఒక నాడు ఉషాకన్య తన భవనం పైభాగములో నిద్రించియుండగా, నిద్రలో తను ముందె న్నడూ విననీ, కననీ అసమాన సౌందర్యవంతుడైన అనిరుద్ధునితో సుఖించినట్లుగా స్వప్నానుభవం పొందింది. మన్మథ చేష్టలన్నింటినీ అనుభవించినట్లుగా మనసుకు తగిలింది. విరహ వేదన పొందింది. విరహ వేదన పడుచున్న ఉష వద్దకు ఆమె బహి: ప్రాణమైనట్టి ప్రియమైనది, బాణాసురుని మంత్రి కుంభాడకుని కూతురు అయిన చిత్రరేఖ అనే చెలికత్తె వచ్చింది. ఉష ప్రాణనాథునికి దూరమై బాధపడుచున్నట్లు, భ్రాంతిని పొందినట్లుగ గమనించింది. ఉషను చూచి ఉషా! నాకంటే ఇష్టమైన వారెవ రున్నారు? నీ కోరిక నాకు చెప్పకపోతే నీ తండ్రిపై ఒట్టు అని అన్నది.
అందుకు ఉష ”ఓ ప్నేహితులారా! నా స్వప్నంలో ఒక పద్మనేత్రుడు, నీలదేహు డు, నవమన్మథుడుగా ఉన్నవాడు కన్పించాడు. అతడు నన్ను దగ్గరకు తీసుకొని గాఢమైన కౌగిట చేర్చుకున్నాడు. అథరామృత మిచ్చాడు. మన్మథ్రకీడలో తేల్చి, మృదుమధుర మాటలు చెప్పి నన్ను దు:ఖసముద్రములోనికి త్రోసి వెళ్ళిపోయాడు” అని కలతచెంది కన్నీరు పెట్టుకున్నది. అప్పుడు చిత్రరేఖ ”ఉషా! నీవు విచారించటం ఎందుకు? మానవులు, యక్షులు, కింపురుషులు, కిన్నెరలు, ఖేచరులు, సిద్ధు లు, సాధ్యులు, ఈ జాతుల కు చెందిన ప్రభువులను, పురుషుల్ని చిత్రపటాలలో లిఖించి చూపుతాను. వారి లో నీ మనస్సును హరిం చిన ప్రియుడిని గుర్తించ గానే అతణ్ణి నీ వద్దకు తీసు కొని వస్తాను అని చెలిని అనునయించింది. అంగీక రింపచేసింది. వెంటనే ముల్లోకాలలో ప్రసిద్ధి చెందినవారి చిత్రాలు లిఖించింది. వారి పేర్లు, గోత్రాలు వ్రాసిం ది. అలా పూర్తి చేసిన చిత్ర పటాలను ఉషకు చూపింది. వారిలో ఒక్కొక్కరిని గూర్చి వివరణగా చెప్పింది. మాళ వ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాళ, విదేహ, పాండ్య, కురు, బర్బర, పింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుద్మేశ, కరాట, లాట, పాంచాల, నిషాద, ఘార్జర, సాళ్వదేశ ప్రభువుల పటాలను చూపింది. మగధ రాజైన జరాసంధుని పటాన్ని చూపింది. విదర్భరాజు భీష్మకుని పెద్ద కొడుకైన రుక్మి అనువాని, కాళింగుడు అనే రాజుది, ప్రాగ్జ్యోషిత పురాధిపతి అయిన భగదత్తుని, పుండ్రదేశాధిపతి అయిన పౌండ్రకవాసుదేవుని, చంద్రవంశ ప్రదీపకులైన ధర్మరాజ భీమ, అర్జున, కురుక్షిపతి దుర్యోధనుల మొదలగు వారల చిత్రపటాలను చూపింది.
యదువంశంలో జన్మించిన శూరసేన, వసుదేవ, ఉద్ధవ, బపలరామ మొదలగు వార ల చిత్రప టాలను చూపింది. యదువంశ సుధాబుంధి చంద్రుడైన శ్రీకృష్ణుని చిత్రపటాన్ని, శ్రీకృష్ణరుక్మిణీదేవి కుమారుడైన ప్రద్యుమ్నుని చిత్రపటాలను చూపిం ది. చివరగా అపర మన్మథాకారుడైన అనిరుద్ధుని చిత్ర పటాన్ని చూపింది. ఆ పటాన్ని కనులు విప్పి చూచిన ఉష ”చిత్రరేఖా! నా మాన ధనాన్నంతటినీ దొంగిలించిన వీని స్వరూపాన్ని చిత్రించి చూపావు. ఇతడే నా మానసచోరుడు” అని అన్నది. ఉషా! ఇతడు శ్రీకృష్ణుడు మనుమడు. అందగాడు. పేరు అనిరుద్ధుడు అని చె ప్పి అతణ్ణి వెంటనే తీసు కొని వస్తాను. అందాకా విచారించకు అని ఆకాశమార్గంలోనికి వెళ్ళింది. ద్వారకా నగ రాన్ని చూచింది. ఆ నగరంలో చంద్రకాంత శిలాభవనంలో హంసతూళికాపాన్పుపై పవళించి నిద్రిస్తున్న అనిరుద్ధుణ్ణి తన యోగ విద్యావిశేషంతో గ్రహించి ఉషాకన్య భవనానికి చెెర్చింది. అందు ఉషాదేవి శయ్యపై పరుండబెట్టింది. అనిరుద్ధుడు మేల్కాంచి ఉషాకన్యను చూచాడు. ఇద్దరూ సూర్యోదయాస్తమాలు తెలియనంతగా ఒకటై కాలం గడిపారు. ఉష గర్భవతి అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement