Saturday, May 18, 2024

Ugadi Panchangam |శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సింహ రాశివారికి ఎలా ఉంటుందంటే..

సింహ రాశి
ఆదాయం – 02, వ్యయం – 14
రాజ్య పూజ్యం – 02, అవమానం – 02

గురువు ఉగాది నుండి 01.5.2024 వరకు 9వ స్థానమై శుభుడైనందున స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి. 02.05.2024 నుండి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.
శని ఉగాది నుండి వత్సరాంతం వరకు 7వ స్థానమై శుభుడైనందున విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవికాసాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
రాహువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 8వ స్థానమై అశుభుడైనందున మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
కేతువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 2వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సాధిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా

తీసుకొనుటకు కృషి చేస్తారు. స్త్రీలు, బంధుమిత్రులను కలుస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement