Thursday, May 16, 2024

Ugadi Panchangam |శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి ఎలా ఉంటుందంటే..

కర్కాటకరాశి
ఆదాయం – 14, వ్యయం – 02
రాజ్య పూజ్యం – 06, అవమానం – 06

గురువు ఉగాది నుండి 01.5.2024 వరకు 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం వుంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు. 02.05.2024 నుండి 11వ స్థానమై శుభుడైనందున అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
శని ఉగాది నుండి వత్సరాంతం వరకు 8వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు వుంటాయి.
రాహువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 9వ స్థానమై సాధారణ శుభుడైనందున తలచిన కార్యాలను ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.
కేతువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 3వ స్థానమై శుభుడైనందున నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడుట మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బందిపడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement