Wednesday, May 15, 2024

Ugadi Panchangam |శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేష రాశివారికి ఎలా ఉంటుందంటే..

శ్రీ క్రోధి నామ సంవత్సర రాశుల ఫలితములు

మేష రాశి
ఆదాయం 08, వ్యయం 14
రాజ్యపూజ్యం 04 అవమానం 03

గురువు ఉగాది నుండి 01.5.2024 వరకు గురుడు 1వ స్థానమై సాధారణ శుభుడైనందున వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుట మంచిది. 02.5.2024 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 2వ స్థానమై శుభుడైనందున ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబసౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
శని ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 11వ స్థానమై శుభుడైనందున ప్రయత్నకార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
రాహువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 12వ స్థానమై అశుభుడైనందున ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితలతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
కెతువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 6వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగముంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement