Thursday, May 16, 2024

కనకమహాలక్ష్మి ఆలయంలో తులసిదళార్చన

విశాఖపట్నం, ప్రభన్యూస్‌బ్యూరో: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవా రి ఆలయంలో గురువారం భక్తుల సౌకర్యార్ధం మరో ఆర్జిత సేవను ప్రారంభించారు. ఇప్పటికే అనేక ఆర్జిత సేవలను దేవస్థానం అమలు చేస్తుంది. తాజాగా సహస్ర తులసీదళార్చన ఆర్జిత సేవను ప్రారం భించారు. ఈ ఆర్జిత సేవను విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వా త్మానందేంద్ర సరస్వతీ స్వామి ప్రారంభించారు. ఉదయం అమ్మవారి ఆలయంలో స్వాత్మానందేంద్ర తొలుత జ్యోతిప్రజ్వలనతో ఈ ప్రత్యేక పూజలు చేపట్టారు. తదుపరి స్వామీజీ స్వయంగా తులసీ దళ అర్చన నిర్వహించారు. అనంతరం విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్స వ ఆహ్వాన పత్రికను అమ్మవారి ముందు ఉంచి పూజలు జరిపారు. ఈ సంజఅనంతరం ఇకపై ప్రతి గురువారం సహస్ర తులసీదళ అర్చన ఉంటు-ందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన గురువారం రోజున తులసి దళాలతో అర్చన చేసే అవ కాశాన్ని భక్తులకు కల్పించడం అభినందనీయమని అన్నారు. విశాఖ వాసుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటోన్న కనకమహాలక్ష్మి అమ్మ వారి దేవస్థానం దినదిన ప్రవర్ధమానమవుతోందని తెలిపారు.
7 నుంచి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు
ఫిబ్రవరి 7 నుంచి 5 రోజులపాటు- విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవములను నిర్వహిస్తున్నట్లు- ఉత్తరాధికారి స్వాత్మానందేం ద్ర స్వామి తెలిపారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో రాజశ్యామల అమ్మవారి యాగం చేపడుతున్నట్లు- వివ రించారు. సర్వజనుల హితాన్ని కాంక్షిస్తూ చతుర్వేద పారాయణం, లోక కళ్యాణార్థం విశేష హోమాలు నిర్వహిస్తామని అన్నారు. ఫిబ్రవరి 8న రధసప్తమి సందర్భంగా త్రిచ, సౌర విధానంగా సూర్యారాధన ఉంటు-ందని, ఫిబ్రవరి 10న సుబ్రహ్మణ్యశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉదయం షణ్ముఖ యాగం, సాయంత్రం రధోత్సవం, రాత్రి వల్లీ కళ్యా ణం నిర్వహిస్తామని తెలిపారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహో త్సవాలలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం పొందాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement