Sunday, April 28, 2024

తూర్పు ఏజెన్సీలో గిరిజన ధార్మిక సేవ

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: గిరిజన ప్రాంతాలు హిందూ ధర్మానికి పట్టు-కొమ్మలని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. నిష్కల్మషంగా, నిస్వార్ధంగా భక్తి ప్రవత్తులను చాటడంలో గిరిజ నులు ముందుంటారని తెలిపారు. విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన గిరిజన ధార్మిక సేవ కార్యక్రమం కోసం స్వామీజీ మారేడుమిల్లి మండలంలో పర్యటించారు. మద్దులూరు, పందిరిమామిడి కోట, ఇవంపల్లి, భీమవరం, వేటు-కూరు, పూజారి పాకలు, కూడూరు తదితర గిరిజన గ్రామాల్లో రగ్గులు పంపిణీ చేసారు. చలి తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా గిరిజనులకు రగ్గులు పంపిణీ చేస్తున్నట్లు- చెప్పారు. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు- ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం చేస్తున్నట్లు- తెలిపారు. విశాఖ శారదాపీఠానికి, అటవీ ప్రాంతాలకు ఎంతో అనుబంధం ఉందన్నారు. గిరిజ నుల కోసం గతంలో గోవులను పంపిణీ చేశామని, వైద్య శిబిరాలు ఏర్పాటు- చేసి శస్త్రచికిత్సలు చేయించామన్నారు. అనేక మంది గిరిజనులను తిరుమల యాత్రకు తీసుకెళ్లామని వివరించారు. స్వామీజీ వెంట ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ తదితరులు గిరిజన ధార్మిక సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement