Friday, May 17, 2024

జైలో అంటే పులికి ఎంత ప్రేమో.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్..

ఆనంద్ మహీంద్రా.. పారిశ్రామికవేత్త అయినప్పటికీ సొంత బ్రాండ్ ప్రమోషన్ కంటే ఆసక్తికరమైన సోషల్ మీడియా కంటెంట్ షేర్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపుతారు. పైగా వాటికి స్పెషల్ కామెంట్ కూడా పెడుతుంటారు. రీసెంట్ గా జైలో వాహనం బంపర్ ని పెద్దపులి నోటితో కొరుకుతూ.. వెనక్కి లాగుతున్న వీడియోను షేర్ చేయగా అదిప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..

మహీంద్రా జైలోతో పులి ఆడుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? సరే, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సరిగ్గా అదే వీడియో వైరల్ అవుతోంది. ఇది మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని ఎంతగానే ఆకట్టుకుంది. మైసూర్-ఊటీ రోడ్‌లోని తెప్పకాడు సమీపంలోని ముదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఈ వీడియో తీశారు. టూరిస్టులు వెళ్తున్నఓ జైలో వెహికల్ ని పులి వెనకనుంచి అటాక్ చేస్తుంది. కాగా, వీడియోలో చిన్నపిల్లాడిలాగా పులి జైలో వెంట పడుతూ.. వాహనం వెనక ఉన్న బంపర్ ని కొరికేస్తుంది. దీంతో పులి బలంగా వెనక్కి లాగడంతో జైలో వాహనం కూడా కాస్త వెనక్కి వస్తుంటుంది.

మహీంద్రా కార్లపై పులి ప్రేమ ఎట్లుందో మీరూ చూడండి.. అని ట్యాగ్ లైన్ తో ట్విట్టర్ లో షేర్ చేశారు ఆనంద్ మహీంద్ర. ఆ కారు Xylo కాబట్టి.. అది దాన్ని నమలడంలో ఆశ్చర్యం లేదని నేను అనుకుంటున్నా. బహుశా మహీంద్రా కార్లు అంత డీలిసియస్ గా ఉంటాయేమో..’’ అని కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement