Thursday, May 2, 2024

నేడు తొలి ఏకాదశి శ్రీహరి వాసము… ఏకాదశి

తిథులు అన్నింటిలోకి ఏకాదశి తిథి పరమ పవి త్రమైనది. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ”#హరివాసము” అని కొనియా డబడుచున్నది. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయ నంలో పండుగలు అధికం. అందునా వర్షాకాలం…. ఆరోగ్య పరిరక్షణార్థం నియమాలు ఎక్కువగా పాటిం చాల్సి ఉండడం చేత పూర్వీకులు వ్రతాలు, ఉత్సవాలు ఎక్కువగా నిర్దేశించారు. అలాంటి పండగల ఆరంభ దినం ఆషాఢ శుక్ల ఏకాదశి. చాతుర్మాస్య దీక్షా ఏకా దశులలో మొదటిది కావడం చేత ”తొలి ఏకాదశి” అంటారు. దక్షిణాయనంలో రాగల పండుగలకు ఇది తొలిది. నిష్టాపరులకు సనాతన సాంప్రదాయ ఆచరణ ఆసక్తులకు ఇది ఉపవాస దినం. ఈనాటి నుండి చాతు ర్మాస వ్రతం ప్రారంభిస్తారు. ఈ నాలుగు మాసాల పాటు ప్రతి దినం పురాణ గ్రంథాలు పఠించడం సదా చారంగా వస్తున్నది. అన్ని ఏకాదశులలోకి ఆషాఢ శుక్ల ఏకాదశి మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈరోజు నుంచి దేవతలకు రాత్రి మొదలవుతుంది.

ఏకాదశి తిథి ఎలా వచ్చింది?

కృతయుగంలో తాళజంఘుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడు. ఈ మురాసురుడు బ్ర హ్మ వరంతో దేవతలను, రుషులను హంసించాడని, ఆ రాక్షసుడితో మహా విష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అల సిపోయి శయనిస్తాడు. దేవదేవుడు యోగనిద్రలో వుండడంతో దానవులు దేవతలపై విజృంభించారు. దీంతో దేవతలు భయపడి వైకుంఠానికి పరుగులు తీసి భగవానుడి శరణు కోరారు. అప్పుడుశ్రీ#హరి శరీరం నుంచి ‘సత్త్వ్వశక్తి’ దానవుల దాష్టీకాన్ని అంతం చేసిం ది. యోగనిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ఏకాదశి అని పేరుపెట్టాడు. ఆమె సమయ స్ఫూర్తి కి, సకాలంలో సహకరించినందుకు సంతసించిన శ్రీ మహావిష్ణువు ఆ ఆ కన్యను వరం కోరుకోమనగా.. తా ను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరగా, నాటినుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వచ్చింది.

ఏకాదశీ వ్రతం

అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణ కథనాలు. ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశినాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకు ని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటిరోజు అనగా ద్వాదశి రోజు ఉదయాన్నే కాలకృత్యాల అనం తరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమ ర్పించి భోజనం చేయాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మ డికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు, పప్పుధాన్యాలు తీసుకోకూడదు. మంచంపై పడుకో కూడదని పురాణాలు చెబుతున్నాయి.
మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్‌ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మ పురాణం పేర్కొంది.
అనాదిగా సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి శ్రీ విష్ణు సాయుజ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాం ధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. సూర్యవంశ చక్రవర్తి, సత్యసంధుడు, మాంధాత తన రాజ్యంలో అనావృష్టి నెలకొన్నప్పు డు అంగీరసుడి సూచనపై శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేశాడని, ఫలితంగా వర్షాలు కురిసి పరిస్థితి చక్కబడిందని పురాణాలు చెబుతున్నాయి. సతీసక్కు బాయి కూడా ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది.
చాతుర్మాస్య దీక్ష

- Advertisement -

తొలి ఏకాదశి మొదలుకొని విష్ణుమూర్తి నాలుగు నెలలపాటు, పాతాళ లోకంలో బలి చక్రవర్తి ద్వారం వద్ద ఉండి, కార్తీక శుక్ల ఏకాదశి నాడు వెనక్కి తిరిగి వస్తారని చెబుతారు. అలాగే ఈరోజు నుండి శ్రీ మహా విష్ణువు నాలుగు నెలల పాటు క్షీర సముద్రంలో శేష తల్పంపై పడుకొని, కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటారని అని పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే దీనికి ”దేవ శయన ఏకాదశి” అని, ”శయనై కాదశి” అని పేర్లు కూడా ఉన్నాయి. వైష్ణవాలయా లలో ఈ రోజు విగ్రహాలను, ఆభరణాలతో అలంక రించి పూజించడం ఆచారం. ఆషాడ మాస శుక్ల ఏకాదశినాడు ఉపవాసం ఉండి చాతుర్మాస్య వ్రత కల్పం ప్రారంభించాలని శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్లు గ్రంథస్తం.
బ్ర#హ్మ వైవర్త పురాణ ఆధారంగా చాతుర్మాస్య దీక్షను ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభించి, కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ ఆచరించాలని ధర్మసింధు, నిర్ణయ సింధు తదితర గ్రంథాలు చెబుతున్నాయి. చాతుర్మాస్య దీక్షా పరులు, సరస్వతి దేవిని కూడా పూజించడం, కొన్నిచోట్ల ఆచారంగా ఉంది. ఈ చాతుర్మాస్య దీక్షను ఎవరైనా చేయవచ్చు. దీనికి కుల, వర్గ, వర్ణ నియమాలు కానీ, లింగ వివక్ష కానీ లేవని చెబుతారు. ప్రస్తుతం మఠాధి పతులు, సన్యాసం స్వీకరించిన వారు చాతుర్మాస దీక్ష పాటిస్తున్నారు. చాతుర్మాస్య వ్రత నియమాలు ప్రధానంగా ఆరోగ్యా నికి సంబంధించినవి. ఈ కాలంలో ఆరోగ్య నియమా లనూ, ఆహార నియమాలనూ విధిగా పాటించాలి. ఈ సమయంలో కామక్రోధాలు విసర్జించి, కొన్ని ఆహార నియమాలు పాటిస్తారు. శ్రావణ మాసంలో కూరగా యలు, భాద్రపదాసంలో పెరుగు, ఆశ్వీయుజమాసం లో పాలు, పాల పదార్థాలు, కార్తిక మాసంలో పప్పు ధాన్యాలు, పప్పుతో చేసిన పదార్థాలను త్యజించాలి.
ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమయమైన కుటుంబ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థలతో ప్రజలంతా మనుగడ సాగించాలన్న సదుద్దేశంతో మన పూర్వ ఋషులు సంస్కృతి, సంప్రదాయం పేరుతో ఏర్పర చిన వ్రతం ఇది. జీవితంలో ఒక్కసారి చాతుర్మాస్య వ్రతాన్ని అనుసరిచినా దాని ఫలితాన్ని కలకాలం అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement