Thursday, May 2, 2024

నేడు శ్రీవారి ప్రణయ కలహోత్సవం

తిరుమల, ప్రభన్యూస్‌: శ్రీవేంకటేశ్వరస్వామి తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగారభరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 18వ తేదీ తిరుమలలో వైభవంగా జరుగనున్నది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4 గంటల తర్వాత స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరు వేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తర్వాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుంచి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement