Tuesday, May 21, 2024

మహనీయ పథానికి మార్గం…జీవన విద్య

కాలం ఆహారం, నిద్ర, సంపర్కాలతో గడచిపోతుంటే దానిని బ్రతకటం అంటారు. లోకం, మనిషి, భగవంతుడు అనే మూడు ముఖ్య విషయాల గురించి కూడా అధ్యయనం చేయాలనే తలంపుతో ఉంటే దానిని జీవించడం అంటారు. నేను మనిషిగా ఈ భూమి మీద జన్మించాను. లోకం అనే ప్రకృతితో నేను కలసిమెలసి ఉండాలి. ఈ చరాచరమంతా ఆ భగవంతుని ఆధీనం లో ఉంది. ఈ శరీరం పాంచభౌతికం, ఇటువంటి ఆలోచనలు కల్పిం చేది మాత్రం శుద్ధ చైతన్యం. అదే శాశ్వతమైన ఆత్మ. ఇది పరమాత్మ తో మమేకమై ఉంటుంది. ఈవిధమైన ఆధ్యాత్మిక భావనతో ఆనం దమయుడై ఉండడమే జీవించడం. వ్యక్తావ్యక్త శక్తి గలది ఒక్క మని షికి మాత్రమే! మిగిలిన జీవులన్నీ కేవలం బ్రతుకుతాయి. అయితే ప్రారబ్దము వల్ల, గత జన్మవాసనల ప్రభావంవల్ల కొన్ని జీవులు కూ డా శుద్ధచైతన్య శక్తితో ఉండడం గమనించవచ్చు. ముఖ్యంగా దుర్ల భమైన నరజన్మ లభించినపుడు కాలాన్ని గడపకూడదు. భగవంతు ని స్వరూపమైన కాలాన్ని సద్వినియోగం చేయాలి. ఇటువంటి మహత్తర విషయాల గురించి వేల సంవత్సరాల క్రితమే మన ఋషి పరంపర ఉపనిషత్తుల ద్వారా మనిషికి అందించింది. ఒక రకంగా శిక్షణతో కూడిన జీవన విద్యను ఒక మార్గంగా నిర్దేశించింది. అటు వంటి మహత్తర శిక్షణల మణిహారమే తైత్తిరీయోపనిషత్తు. మనుషు లను ”శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా:” అమృత పుత్రులారా! ఆలకించండి అని సంబోధించింది శ్వేతాశ్వతరోపనిషత్తు. ఒక విధం గా మనుషులను ఒక మహానీయ పథంలో నిలిపాయి ఉపనిషత్తులు. జీవించడం అనేది ఒక విద్య. పూర్వం గురుకులాలలో విద్యను పూర్తి చేసుకున్న తరువాత కొన్ని కర్తవ్యాలను నిర్దేశించి పంపేవారు.
వేదమనూచ్యార్యోన్తే వాసిన మనుశాస్తి సత్యంవద ధర్మంచర
స్వాధ్యాయాన్మా ప్రమద: ఆచార్యాయ ప్రియం ధన మాహృత్య
ప్రజాతన్తుం మా వ్యవచ్ఛేత్సీ:
వేదాధ్యయనము సంపూర్ణమయిన తరువాత ఆచార్యుడు శిష్యులకు ఇలా కర్తవ్యబోధ చేసేవారు. ”సత్యమునే పలుకండి. ధర్మ మార్గంలో వెళ్ళండి. విద్యను చేజార్చుకోకండి. ఆచార్యునికి ఇష్టమై న గురుదక్షిణ సమర్పించండి. గురువుకు సంతోషాన్ని కలిగించండి. సంతతి పరంపరను విచ్ఛిన్నం చేయకండి.”
విద్య చేజారి పోవడమంటే నేర్చుకున్న నైపుణ్యాలను లోక కళ్యాణం కోసం ప్రయోజనకరంగా వినియోగించడం. అలాగే మరొ కరికి నేర్పడం. లేకపోతే విద్య చేజారిపోతుంది. నేర్చుకున్న విద్య ఏదై నా వంశపారపర్యంగా కొనసాగాలి లేకపోతే అది విచ్ఛిన్నం అయి పోతుంది. సత్యం నుండి వైదొలగకండి ధర్మమార్గం నుండి వైదొలగ కండి. మేలు కలిగించే వాటి నుండి వైదొలగకండి. నేర్చుకోవడం, దేవతలకు, పితరులకు చేయవలసిన కర్మల నుండి వైదొలగకండి.
ఇక్కడ సత్యవ్రతుడైన సత్యహరిశ్చంద్రుణ్ణి మననం చేసుకోవా లి. ధర్మం కోసం నడచిన శ్రీరామచంద్రుని పాదములు సదా స్మరిం చుకోవాలి. తమ శిష్యులపై వాత్సల్యం కురిపించిన ద్రోణాచార్యుని, పరశురాముని, శంకర భగవత్పాదులను సదా గుర్తుంచుకోవాలి. మాతపితరుల సేవ వల్లే అపారమైన మహిమను పొందిన ధర్మవ్యా ధుని గురించి మరింత శోధించాలి.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవో భవ తల్లిదండ్రులను దైవంగా స్తుతించండి. ఆచార్యుని అంటే గురు వుని, అతిథిని దైవంగా స్తుతించండి. ప్రస్తుతం ఈ ఉపనిషద్వాక్యం మృగ్యంగా మారింది. అది మనిషి లక్షణం కాదు. తల్లి, తండ్రి, విద్య ను అందించిన గురువు, తిథి లేకుండా ఇంటికి వచ్చే అతిథి అంటే ఏదో ఒక కారణం చేత లేదా సహాయం కోరి హఠాత్తుగా వచ్చిన వారి ని దైవంగా భావించి వారిని సత్కరించండి అని చెబుతున్న మన సనాతన ధర్మాన్ని మించిన ఔన్నత్య భావన గల విధానం ఉండదు. మనిషికి కావలసిన లక్షణాలను భగవంతుడు ఇలా పేర్కొన్నాడు.
నింద్య రహితమైన పనులను చేయండి. నిందితులు కాకండి. సద్గుణాలను పెంపొందించే పనులను చెయ్యండి. మనకన్నా ఉన్న తులైనవారో, పునీతులైనవారో వచ్చినప్పుడు లేచి నిలబడి వారికి ఆసనం ఇవ్వండి. వారి శ్రమను తొలగించే ఉపచర్యలు చేయండి. శ్రద్ధ తో దానం చేయండి. ఉదాసీన వైఖరితో దానం చెయ్యకండి. శక్తికి మించి దానం చేయకండి. వినయంతో, గౌరవపూర్వకంగా సౌహార్ద హృదయంతో దానం చెయ్యండి. అంటే ధర్మబద్ధంగా సంపాదించి న దానినే దానం చేయాలి. ఉన్నదానిలో ఎంతోకొంత శక్తి మేరకు దానం చేయండి. అపాత్రునికి దానం చేయకండి. అవసరం అయిన దానిని, ఉపయోగపడే దానిని మాత్రమే దానం చేయండి.
కర్తవ్య సందేహం, ధర్మ సందేహం కలిగినప్పుడు మహాత్ముల ను అనుసరించండి. మహాత్ములంటే ప్రగాఢ చింతన కలిగినవారు, మనో ఏకాగ్రత గలవారు, సర్వస్వతంత్రులు, అక్రూరులు, సన్మార్గు లు, బ్రహ్మజ్ఞానులు, స్వార్థచింతన లేనివారు అటువంటివారు ఎలా వ్యవహరిస్తున్నారో గమనించి కర్తవ్య నిర్వహణ చేయండి. ఇక్కడ అటువంటి అవతార పురుషుల గాథలను పరివీలించి ధర్మ నిర్ణ యం చేయాలని గమనించి, సాధారణంగా అటువంటి వారు పావన జీవ నులై ఎటువంటి అపేక్షలకు లోను కాకుండా ఉంటారు.
సమస్త జీవులకూ లోకమే అనగా ప్రకృతే తోడ్పడుతుంది. ఈ పరమ సత్యాన్ని గ్రహించి అహంకారం విడిచి నడుచుకోవాలని ఉప నిషత్తులు బోధిస్తున్నాయి. మనిసి చేసే కర్మలన్నీ నీవు చేసేవి కావు నీచే చేయించబడుతున్నాయని గమనించాలి. ఇతరులకు లేదా జీవులకు నువ్వు సహాయపడుతున్నావంటే అది భగవంతుడు నీకిచ్చిన వరం అని భావించాలి. నేను అనే పరిధిని దాటి లోకం కోసం పనిచేయి అని గురువు బోధించి పంపుతాడు. ప్రకృతి నుండి నువ్వు పొందేది ప్రతీ ది భూతయజ్ఞం ద్వారా తిరిగి ఇవ్వాలి. అంటే మానవులతో సహా ప్రా ణకోటికి సహాయం చెయ్యండి. ఈ విశ్వమంతా ఒక క్రమ బద్ధమైన ప్రణాళికతో పని చేస్తున్నదని గ్రహించి అంతే క్రమశిక్షణతో నీ జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోమని, అదే ఋతజీవనం అని ఆచా ర్యుడు శిష్యులకు కర్తవ్యబోధ చేసి లోకకళ్యాణం కోసం గురుకులాల నుండి బయటకు పంపేవా రు. తిరిగివారు సన్యాసం స్వీకరించినా గృహస్థుగా మారినా లోకా న్ని తరింపచేసేవారు. పరం పరను కొనసాగించే వారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement