Friday, April 26, 2024

ప్రలోభాన్ని కలిగించేది భ్రాంతి

బ్రహ్మ సత్యమ్‌ జగన్మిథ్య” అంటూ మన వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు మన చెవిలో ఇల్లు కట్టుకొని మరీ చెబు తున్నా కూడా ఈ దేహం, కాలం, సంపద, అందం, ఆనందం అన్నీ నిజమనుకొంటూ మోహార్ణవ భ్రాంతిలో సదా మునిగి తేలుతూం డడం మానవ నైజం. ఈ ప్రపంచంతో అవినాభావ సంబంధం ఏర్పర చుకొని ఇక్కడి వస్తువులకు, వ్యక్తులకు, బంధాలకు లేని విలువలను ఆపాదించుకొని, అవి లేకపోతే మనలేమని మనం భ్రమిస్తున్నాం. వాటి కి కలిగే హాని వృద్ధులకు దు:ఖిస్తూ, సంతోషిస్తూ కాలం గడుపుతున్నాం. దీనినే ‘భ్రమ’ లేక. ‘భ్రాంతి’ అంటారు. లేని వాటిని ఉన్నాయను కోవడ మే భ్రమ. వేదాంతశాస్త్రంలో నాలుగు రకాలైన భ్రాంతులు తరచూ చెప్పబడ్డాయి. అవి (1) రజ్జుసర్ప భ్రాంతి, (2) స్థాణు-పురుష భ్రాం తి,(3) శుక్తి-రజత భ్రాంతి, (4) మరు-మరీచిక భ్రాంతి.
వీటిలో మొదటిది ”రజ్జుసర్ప భ్రాంతి రజ్జువు అంటే తాడు. సర్ప మంటే పాము. రజ్జుసర్ప భ్రాంతి అంటే తాడును చూచి పాము అను కొని భ్రమపడటం. చీకటిలో వంకరగా పడి ఉన్న తాడును చూచి పాము అనుకొని సామాన్యుడు భయపడి ముందుకు వెళ్ళడానికి జం కుతాడు. కానీ వివేకవంతుడు దానిని నిదానంగా, చక్కగా పరిశీలించి అది ‘తాడు’ అనే సత్యాన్ని తెలుసుకొని ముందుకు సాగుతాడు. అజ్ఞా నంలో ఉన్నప్పుడు వాస్తవంగా అక్కడ ఉన్న తాడుమీద పాము రూపా న్ని పరచింది మన మనస్సు. ఉన్న రూపానికి భిన్నమైన రూపాన్ని దర్శించింది మనస్సే! దీనినే ఆదిశంకరులు ‘అధ్యాస’ అన్నారు. ”అత స్మిన్‌ తద్బుద్ధి:- అధ్యాస” అని దీనికి వ్యుత్పత్తి.
రెండవది ‘స్థాణు-పురుష భ్రాంతి”. స్థాణువు అంటే స్థిరమైనది అని అర్థం. రాయి, కొయ్యదుంగ, మేకు లాగా స్థిరంగా, చలనం లేకుం డా ఉండేది. పురుషుడంటే మనిషి. మసక వెలుతురులో ఒక కొయ్య దుంగనో, రాతిబండనో చూచి, దానిని మనిషిగా భ్రమపడి, దొంగేమో అని భయపడి, కలత చెందడాన్ని స్థాణు- పురుష భ్రాంతి అంటారు.
పైన చెప్పుకొన్న రజ్జుసర్ప భ్రాంతి, స్థాణుపురుష భ్రాంతులు రెండూ మసక వెలుతురు లేదా గుడ్డివెలుగులో ఏర్పడినవి. కనుక వెలుగు ఉంటే భ్రాంతులు కలుగవేమో అని అనుకోకూడదు. వెలుగులో నూ ఏర్పడే భ్రాంతులూ కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ”శుక్తి- రజత”, ” మరు- మరీచిక” భ్రాంతులు.
మూడవది ”శుక్తి- రజత భ్రాంతి”. శుక్తి అంటే ముత్యపు చిప్ప. రజతమంటే వెండి. ఆల్చిప్పలలో వెలుతురు పడినప్పుడు అది వెండి బిళ్ళలాగా కన్పిస్తుంది. అయితే అది నిజంగా వెండి కాదు. వెండిబిళ్ళ అని భ్రమించి, దానిని సొంతం చేసుకోవాలనే ఆశతో దగ్గరకు వెళ్ళి చేతిలోకి తీసుకొంటాం. అది ఆల్చిప్ప అని తెలుసుకొని ఖంగుతింటాం. ఇదే విధంగా నీటిలోని చంద్రుని ప్రతిబింబాన్ని చూచి, ఆకాశంలో ఒకరు, నీటిలో ఒకరు- ఇలా ఇద్దరు చంద్రులున్నారేమో అని భ్రమిస్తా ము. జ్ఞానప్రకాశనంతో సత్యాన్ని గ్రహంచగలుగుతాము.
ఇక నాలుగవది ”మరు మరీచిక భ్రాంతి”. ఎడారుల వంటి ప్రదేశా లలో ఇసుక దిబ్బల పైన ఎండ బాగా కాస్తున్నప్పుడు దూరం నుండి చూస్తే నీటి ప్రవాహంలాగా అలలు అలలుగా కనబడుతుంది. ఎండ మావులంటే ఇవే. దాహం తీర్చుకోడానికి ప్రాణులు ఆ మరీచికల వెంట పరుగులు తీసితీసి ఎంత దూరం పరుగెత్తినా ఇంకా అంతదూరంలో ఉన్నట్లే కనబడే ఆ ఎండమావుల భ్రమలో పడి ప్రాణాలు కోల్పోతాయి.
ఈ నాలుగు భ్రాంతులలో రజ్జుసర్ప భ్రాంతి, స్థాణు-పురుష భ్రాం తి భయాన్ని కలిగించేవి కాగా, శుక్తి-రజత భ్రాంతి, మరుమరీచిక భ్రాంతి ప్రలోభాన్ని కలిగించేవి. మొదటి రెండు భ్రాంతులూ దగ్గరగా ఉండే వస్తువుల వలన కలిగితే, మిగిలిన రెండూ దూరంగా ఉన్న వస్తు వుల వలన కలుగుతాయి.
సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు, వేగంగా వెళ్తున్న రైలు కిటికీ లోనుండి చూస్తే చెట్లు, భవనాలు వేగంగా వెనుకకు పరుగులు తీస్తున్నట్లు అనిపించడం సామూ#హక భ్రాంతులకు ఉదాహరణలు.
మరి ఈ భ్రాంతులు కలుగుతున్నది ఎవరికి? తాడుకా? స్థాణువు కా? ముత్యపు చిప్పకా? కాలిన ఇసుకకా? చూచే కన్నులకా? శరీరా నికా? మనసుకా? తాడు, స్థాణువు, ముత్తెపు చిప్ప, కాలిన ఇసుక, శరీర ము, కన్నులు, ఇవేవి ఊహంచుకోలేవు. భ్రమపడ లేవు. మనస్సే సర్వ భ్రమలకూ మూలం. యోగవాశిష్ఠం ఇలా చెబుతోంది.
”స్ఫుర తి, వల్గతి, గచ్ఛతి, యాచతే
భ్రమతి, మజ్జతి, సంహరతి స్వయం
అపరతా ముపయాత్యపి కేవలం
చలతి చంచ ల శక్తి తయామన:”
మనసు చంచలమైనది. చంచలత్వం వలన ఎన్నో వేషాలు వేస్తుం ది. తాను ప్రత్యేకంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గుర్రంలాగా పరిగెడు తుంది. స్వయంగా భ్రమలో పడుతుంది. ఇదే స్వప్నం. తనే మునిగి పోయి, తనే లేకుండా పోతుంది ఇదే సుషుప్తి. తనే సంసారాన్ని పొంది సుఖ దు:ఖాలలో కొట్టు మిట్టాడుతుంది ఇదే జాగ్రత్తు. తనే కైవల్యాన్ని పొంది అన్నిటికన్నా మిన్నగా ఉంటుంది. ఇదే మోక్షము అంటూ అన్ని భ్రమలకు, ముక్తికి కూడా కారణం మనస్సే అని తెలుపుతుంది పై శ్లోకం.
కనుక అపరిపక్వమైన మనస్సే అలా ఒకదాని బదులు మరొక దాని ని భావించుకొంటుంది. దీనినే వేదాంతం అన్యథాకరణం అంటుంది. తాడును తాడుగానే మనసు గ్రహస్తే అది యథార్థ జ్ఞానం. దీనిని ‘ప్రేమ’ అంటారు. తాడును పాముగా భావిస్తే అది అన్య ధాకరణం. ఇదే భ్రమ. ఈ భ్రమను సత్వరమే ఉపశమింపచేయకపోతే అది చిలువలు పలువ లుగా అల్లుకొనిపోయి స్థిరపడిపోతుంది. భ్రమ ఉపశమించాలంటే ఆ మసక వెలుతురు తొలగాలి. నిరంతర సాధనతోనే ఈ భ్రమలన్నీ తొల గించుకోవాలి. అందుకు భగవత్కృప కావాలి.ధూర్జటి కవి చెప్పినట్లు-
”అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌటెరింగిన్‌ సదా
కాంతల్‌ పుత్రులు, నర్థమున్‌, తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిన్‌ చెంది చరించుగాని, పరమార్థంబైన నీయం దుతా
చింతాకంతయు చింత నిల్ప డు గదా శ్రీ కాళహస్తీశ్వరా!”
ప్రపంచమంతా ఒక పెద్ద మాయ, అశాశ్వతమని తెలిసికూడా మానవుడు నిరంతరమూ భార్య, పిల్లలు, సంపద, తన శరీరము శాశ్వ తమనే మోహంలో, భ్రమలో మునిగి ఉంటాడు కానీ, పరమాత్ముడ వైన నీపై రవ్వంతైనా మనసు నిల్పడు కదా! అని ధూర్జటి వాపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement