Friday, December 6, 2024

ధోనిపై అభిమానం.. పెళ్లి ప‌త్రిక‌లో ఫొటో

త‌న పెళ్లి ప‌త్రిక‌పై మ‌హేంద్ర‌సింగ్ ధోని ఫొటోని ముద్రించాడు ఓ ఫ్యాన్. తన పెండ్లి పత్రికపై ధోని ఫొటోను ముద్రించాడు. వివాహ వేదిక వివరాలతో పాటు ధోని ఫొటో ముద్రించిన ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల 12న కర్ణాటకలో వివాహం జరుగుతున్నట్లు ఫోటోలోని వివరాల ఆధారంగా తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన శమంత్ కుమార్ పిజి (సిద్ధార్థ్) వరుడు కాగా, వధువు పేరు భవ్యశ్రీ (రమ్య). వెడ్డింగ్ కార్డ్‌లో ఒకవైపు గణేశుడి ఫోటో ముద్రించగా, మరోవైపు ధోనీ ఫోటో ముద్రించారు.కార్డుపై మహేంద్ర సింగ్ ధోనీ ఫోటో ఛాంపియన్స్ ట్రోఫీ 2013 నాటిదిగా తెలుస్తోంది. వైరల్ గా మారిన ఈ ఆహ్వాన పత్రికకు సంబంధించిన మిగతా వివరాలు తెలియరాలేదు. కర్ణాటక ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ ఫొటోను ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement