Sunday, April 28, 2024

శ్రీరామానుజుల 1006 తిరునక్షత్ర మహోత్సవం

శ్రీరామానుజుల వారి 1006 తిరునక్షత్ర మహోత్సవ కార్యక్రమం (ఈ నెల 5తేది నుండి 9 తేది వరకు ) ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.
ప్రతిరోజు నిత్య కార్యక్రమ వివరాలు:
ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ( సుప్రభాత సేవ, నిత్యారాధన, శ్రీరామానుజు వైభవం. తీర్థప్రసాద వితరణ ) సువర్ణ రామానుజుల ప్రాంగణంలో జరుగును.
సాయంత్రం 5.30 గంటల నుండి 8 గంటల వరకు (సామూహిక విష్ణుసహస్రనామ స్తోత్రపారాయణం,చిన జీయర్ స్వామివారిచే ఉపదేశాత్మక సందేశం, సాంస్కృతిక కార్యక్రమాలు ) పౌంటేన్ ప్రాంగణంలో జరుగును.

Advertisement

తాజా వార్తలు

Advertisement