Saturday, May 18, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

72. శ్రీశైలేశుభజింతునో? అభవు( గాంచీనాథుసేవింతునో ?
కాశీవల్లభు( గొల్వ( బోదునో? మహాకాళేశు( బూజింతునో?
నా శీలం బణువైనమేరువనుచున్రక్షింపవే నీ కృపా
శ్రీ శృంగారవిలాసహాసములచేశ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, శ్రీశైల- ఈశున్- శ్రీశైల మల్లికార్జునుని, భజింతును- ఓ- సేవించుదునా?, కాంచీనాథున్- కాంచీ నగర అధిపతి అయిన, అభవున్- ఏకామ్రనాథుని, సేవింతును- ఓ- కొలుతునా?, కాశీవల్లభున్- కాశీనగరాధిపతి అయిన విశ్వనాథుని, కొల్వన్- సేవించటానికి, పోదును- ఓ- వెడలుదునా? మహాకాళేశున్- ఉజ్జయినిలో నున్న మహాకాళేశ్వరుని, పూజింతును- ఓ- అర్చించుదునా?, నా శీలంబు- నా చరిత్ర (నడవడిక, ప్రవర్తన) అణువు- ఐన్- అణుమాత్రమే అయినా, మేరువు- అనుచున్- మేరుపర్వత మంతఅని భావించి, నీ కృపా- శ్రీ- నీ దయ అనే శుభప్రదమైన, శృంగార- అలంకారమై ఒప్పు, విలాస- హేలా, హాసములచే- చిరునవ్వులచే, నన్ను- నన్ను, రక్షింపవు- ఏ- కాపాడవా?
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా!సర్వవ్యాపివై అనేక క్షేత్రాలలో వెలసిన నిన్ను ఏ విధంగా సేవించగలను? శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునునిసేవింతునా? కంచి యందున్నఏకామ్రేశ్వరునిసేవింతునా? కాశీవిశ్వనాథుని సేవించటానికి వెళ్లనా? ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరునికొలువనా? ఆజ్ఞాపించు! నా సేవాభావం (భక్తి) అణుమాత్రమే అయినా మేరుపర్వతం అంత అని భావించి, నీ కరుణ అనే శుభప్రదమైన, సుందరమైన చిరునవ్వులు చిలికించి నన్ను కాపాడు.
విశేషం: ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రాలలో, పంచారామాలలో, పంచభూతాత్మకంగా– పృథ్వీ, జల, వాయు, ఆకాశ, జ్యోతి, రసాది లింగ రూపాలలో, స్వయంభూలింగాలుగా, దేవతాప్రతిష్ఠిత లింగాలుగా, అనేక రూపాలలో, అనేక తీర్థాలలో వెలసినశివుణ్ణి అర్చించటం ఎట్లా? ఎన్ని ప్రదేశాలకని వెళ్ళగలను? అని తన అశక్తతని వ్యక్తం చేస్తూ, తన భక్తి, సేవ అణుమాత్రమే అయినా మేరువంతగా భావించటానికి శివుడి కరుణ మాత్రమే కారణం అనిఅంటున్నాడు ధూర్జటి.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement