Tuesday, May 7, 2024

చంద్రగ్రహ దోష నివారణకుమాస శివరాత్రి వ్రతం

మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది…
పరమ పవిత్రమైనది మాస శివరాత్రి

మాసశివ రాత్రి అంటే ఏమిటి? ఎప్పుడు వస్తుంది? ఎందుకు, ఎలా జరుపుకోవాలి? ఈ వ్రత ఆచరణ అనే విషయాలు తెలుసుకుని మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే జాతకంలో వున్న చంద్రగ్రహ దోషం నిర్మూలిత మవుతుంది.
ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం… శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి…
ఎందుకు జరుపుకోవాలి?
మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు. అమా వాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. ‘చంద్రోమా మనస్సో జాత:’ అనే సిద్ధాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణదశలో ఉన్న ప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారివారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది.
తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది. ఆయాజీవులు ఈ సమయంలో మానసిక ముగా సమయ మును కోల్పోవడ మో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగము తో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తల పెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. మనం గమనిస్తే అమా వాస్యతిథి ముందు ఘడియలలో కొందరి ఆరోగ్యం మందగించ డం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాల న్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంతమేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.
వ్రత విధానం
మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలంటే అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి మాస శివరాత్రి. ఆరోజు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానా ధికాలు ముగిం చుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో పెట్టిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుం ది. అదేవిధంగా ఆరోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవే మీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతు లు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి.

మాస శివరాత్రి వలన ఉపయోగములు
ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవడ ము వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల తీెవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది. వృత్తికి సంబంధిం చిన అవరో ధాలలో మార్పు కల్గుతుంది. దీర్ఘకాలిక అనా రోగ్య సమ స్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యం గా మొండి గా, పెంకిగా, బద్ధకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలముకు వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారి లో కాలక్రమ ములో ఖచ్చితముగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు.

  • డా. చదలవాడ హరిబాబు 9849500354
Advertisement

తాజా వార్తలు

Advertisement