Thursday, May 2, 2024

కోరికలీడేర్చే శిరుముగై కోదండరామస్వామి

మహావిష్ణువు దశావతారాలలో పరిపూర్ణ అవతారం రామావతారం. ఈ అవతారంలో శ్రీరాముడు మహా రాజు బిడ్డగా పుట్టినా సామాన్య మానవుడి వలె తన జీవి తంలో అనేక కష్టాలను అనుభవించాడు. నిరాడంబరంగా జీవించి ఏకపత్నీవ్రతుడిగా లోకమంతటికీ ఆదర్శప్రాయం అయ్యాడు. శ్రీ మహావిష్ణువు కోదండ రామునిగా భక్తులను అనుగ్ర#హస్తున్న అత్యంత ప్రముఖమైన ఆలయం కోయం బత్తూరు జిల్లాలోని శిరుముగైలో నెలకొని వుంది.
పవిత్ర భవానీ నది తీరాన ప్రాచీన కాలంలో రామ భక్తు లంతా కలసి ఒక చిన్న రామాలయం నిర్మించారు. చాలా సంవ త్సరాల క్రితం ఈ ప్రాంతంలో పెద్ద తుఫాను వచ్చి భయంకర మైన గాలివాన వచ్చింది. ఆ రాత్రి ఊరిలోని దీపాలు అన్నీ ఆరిపోయి అంధకార బంధురమై పోయింది. కాని ఆశ్చర్యక రంగా ఊరంతటికి ఒక్క రామాలయంలోని దేవుని సన్నిధి లోని దీపం మాత్రం గాలివానకు చెక్కు చెదరక ఆరకుండా వెలుగుతూనే వుంది.
ఈ విషయం చుట్టుప్రక్కల ప్రజలందరికీ తెలిసి ఆ ఆల యం మ#హమగల ఆలయంగా భావించసాగారు. భక్తులు అనేకమంది చేరి ఆ మ#హమాన్వితమైన ఆలయాన్ని మరింత పెద్దదిగా నిర్మించారు. 1985లో, 1997 సంవత్సరాలలో ఆలయ కుంభాభిషేకం జరిగింది. 2005లో కోదండరామ స్వామి ఆలయ సమీపాన్నే రామలింగ చౌడేశ్వరీ అమ్మవారికి కూడా ఆలయం నిర్మించి కుంభా భిషేకం జరిపారు.
తర్వాత కాలంలో భక్తులు అందరూ కలసి పునర్నిర్మాణం చేశారు. కోదండ రామునికి కుడిప్రక్కన లక్ష్మణస్వామి, ఎడమ ప్రక్కన సీతాదేవిని ప్రతిష్టించి యీ ఆలయానికి, రామలింగచౌడేశ్వరి అమ్మవారి ఆలయానికి ఘన వైభవంగా కుంభాభిషేకం జరిపారు.తూర్పుదిశగా వున్న కోదండరామస్వామి ముఖ మండపంలో దీపస్ధంభం వున్నది. తరువాత రెండు ప్రక్కల నాగులతో తొండ ముకల ఆళ్వారుకి ప్రత్యేక సన్నిధి ఉండగా, మహామండపంలో ముకుళిత #హస్తా లతో ఆంజనేయస్వామి దర్శనం అనుగ్ర#హస్తున్నాడు.
ప్రతీ సంవత్సరం దీపావళి పర్వదినాన ప్రాత:కాల సమయమున సీతా, లక్ష్మణ సహిత కోదండరామునికి, రామలింగేశ్వరునికి, రామలింగచౌడేశ్వరి అమ్మవారికి విశేష పూజలు జరుపుతారు. గృహాలలో, కార్యాలయాలలో మన మంటే గిట్టక మనకు తెలియకుండానే అసూయాపరులు, శత్రువులు ఏర్పడతా రు. ఇలాంటి వ్యక్తుల బారినుండి తప్పించుకోవడానికి చక్రత్తాళ్వారుని భక్తితో పూజించాలి. శనివారాలలో 12 సార్లు చక్రత్తాళ్వారు నన్నిధికి ప్రదక్షిణలు చేసి, తులసిమాలలు సమర్పించి పటిక బెల్లం నివేదించి భక్తులకు వినియోగించడం శుభ ఫలితాలను యిస్తుంది.
సకల సంపదలనిచ్చే ‘శ్రీరామ’ తారక మంత్రము

”శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం
సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపమ్‌
ఆజానుబా#హుమరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి”
అంటూ శ్రీరాముడిని స్తుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజ యంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి.
జన్మత: కిరాతకుడై పుట్టిన ఓ బోయవాడు వాల్మీకి మ#హర్షిగా అవతరించి ‘శ్రీమద్రామాయణం’ రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు. అడవుల్లో తిరుగుతూ వేటాడుతూ కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మ#హర్షిగా మారేందుకు ”రామ రామ రామ” అనే తారక మంత్రమే తోడ్పడింది.
కిరాతకుడైన బోయవాడిని నారదుడు చూసి నీవు చేస్తున్న ఈ కిరాతకమైన పాప కార్యంలో నీ భార్యాబిడ్డలు ఏమైనా పాలుపంచుకుంటారో తెలుసుకునిరా అని పంపుతాడు.
వెంటనే ఆ కిరాతకుడు భార్యబిడ్డల వద్దకు వెళ్లి ఆ ప్రశ్న అడుగుతాడు. దాని కివారు గృ#హస్తుడుగా మమ్ములను పెంచి పోషించే బాధ్యత నీది కానీ నీవు చేసే పుణ్యకార్యంలో భాగం పంచుకుంటామే తప్ప పాపకార్యంలో కాదు. అని నిష్క ర్షగా పలుకుతారు. వారి పలుకులకు వైరాగ్యము చెందిన బోయవాడు. ‘మ#హర్షి నాకు చక్కని మోక్షమార్గానికి ఉపాయము చెప్పమ’ని ప్రాధేయపడతాడు.
కిరాతకుని విన్నపము మేరకు నారదుడు ”రామ రామ రామ” అనే తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు. చివరకు నోరు తిరగక శరీరంపై పుట్టలు పోస్తు న్నా ”మర” అంటూనే ఆ తారకమంత్రాన్ని వీడలేదు. బ్ర#హ్మ అనుగ్ర#హముతో వల్మీకము నుండి పునర్జీవింపడి వాల్మీకి మ#హర్షిగా జ్ఞాన సంపదను ఈ తారక మంత్రముచే పొంది శ్రీమద్రారామాయణం అను కమనీయ కావ్యం రచించి కారణజన్ముడై ఊర్థ్వలోకమందు ఆచంద్రతారార్కం తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయినాడు.
అట్టి శ్రీమద్రామాయణం మనకు ఎంతో ఆదర్శవంతమైంది. అందలి శ్రీ సీతారామచంద్రమూర్తి మూర్తీభవించిన ధర్మదేవతా స్వరూపం. ఆ కావ్యమే మనకు మన భావితరాలకు మార్గదర్శి కానుంది. కాబట్టి ప్రతి రోజూ ‘రామ నామ తారక మంత్రము’ను పఠించడంతో పాటు సీతారాముల కళ్యాణోత్సవం వీక్షించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. – బిహెచ్‌.రామకృష్ణ

Advertisement

తాజా వార్తలు

Advertisement