Sunday, April 28, 2024

ఆత్మయోగి ముమ్మిడివరం బాలయోగి

పురాతన భారతీయ యోగభూమి ఎందరో మహర్షులకు, యోగులకు పుట్టినిల్లు. పురాతన, ఆధునిక యోగుల సంప్రదాయంలో తపస్సు, ధ్యానం ద్వారా తపోసిద్ధి పొంది ఎందరో భక్తులకు జ్ఞానగీతిని అందించిన మహనీయు లలో ము మ్మిడివరం బాలయోగీశ్వరు లు ఒకరు. సుమారు నాలుగు దశాబ్దా ల పాటు నిరాహారం గా తపస్సులో ధ్యా నంలో మునిగి భ క్తులపై కరుణాకటాక్షాలు ప్రసరింపచేసిన భగవాన్‌ బాలయోగీశ్వరుల చరిత్ర ఆధ్యాత్మిక పరంపరలో ఓ అరుదైన ఘట్టం.
కోనసీమలోని ముమ్మిడివరం గ్రామంలో కటికదల గంగయ్య, రామమ్మ అనే పేద దళిత కుటుంబం ఇంట 23 అక్టోబర్‌ 1930న మూడో సంతానంగా బాలయోగీశ్వరులు జన్మించారు. వారి పూర్వపు నామం సుబ్బారావు. గోవుల కాపరి గా కుమారుడిని గంగయ్య పనిలో చేరిస్తే ఆయన ధ్యాసంతా పూర్వజన్మ వాసనల ఫలితంగా తప స్సు వైపు మరలింది. సుబ్బారావు తన 16వ యేట కృష్ణుడు, నారదుడు ఫొటోతో దగ్గరలోని కొబ్బ రితోటలో యోగముద్రలో ధ్యానం చేసుకుంటూ గడిపారు. కాలక్రమంలో బాలయోగీశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. ముక్తిని పొందడానికి, జ్ఞా నం పొందడానికి సాధన అవసరమని భావించిన బాలయోగీశ్వరులు సుమారు నాలుగు దశాబ్దాల పాటు మౌనముద్రలోనే దాదాపు గడిపారు. ధ్యాన సమాధిస్థితిలో మౌనాన్నే సంకేతంగా చేస్తూ భక్తు ల్లో జ్ఞాన తృష్ణను మేల్కొల్పారు. ఏకధాటిగా రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు ధ్యానము ద్రలోనే ఉన్న బాలయోగీశ్వరులు జనం తాకిడితో చివరి జన్మలో ఉన్న తనకు ఆటంకం కలగకూడ దని స్వచ్ఛందంగా తలుపులు మూయించి సాధ నలో మునిగితేలేవారు. అరుదుగా మాత్రమే భక్తు లకు సందేశాలను, జ్ఞానబోధను ఇస్తూ వారి కోరిక మేరకు మ#హశివరాత్రి పర్వదినం మర్నాడు దర్శ నం ఇవ్వడం ప్రారంభించారు. నలభై యేండ్లు మౌనముద్రలో ఉంటూ అపుడపుడు మాత్రమే భక్తుల విన్నపం మేరకు మౌనం వీడేవారు. వారి కష్టాలను తీర్చేవారు. ధ్యాన సమాధిస్ధితికి చేరు కుని అన్నపానీయాలు విసర్జించి బాలయోగీశ్వరు లు ఈ ప్రాంతంలో తపోనిష్టతో దైవదూతగా భక్తు ల నీరాజనాలు అందుకున్నారు. ఈశ్వర తత్వ ప్రతీ కగా నీరాజనాలు అందుకున్న స్వామివారిని దర్శించుకొనేందుకు 1984-85 దశకంలో సుమా రు 15 లక్షల మందికి పైగా భక్తులు, విదేశీ భక్తులు ముమ్మిడివరం విచ్చేసేవారు.
భగవాన్‌ బాలయోగీశ్వరులు అరుదుగా ప్రబోధిం చిన జ్ఞానగుళికలో క్రింది మాటలు ప్రసి ద్ధమైనవి. ”భగవంతుడిని ధ్యానించడానికి అర ణ్యం వెళ్లనవ సరం లేదు. ప్రపంచము నందు ఒక్క సూర్యుడే ఇం త ప్రకాశముగా నుండును. జీవాత్మ పరమాత్మ స్వరూపము. పంచభూతములు దాని ని మాయలోనికి లాగుచుండును. తానెవ్వరో తెలు సుకొని చలించే మనస్సును కట్టిబెట్టగలిగితే తన ఆత్మ తన గురువగును.” భగవత్‌ తత్వాన్ని అన్వేషి స్తూ యోగవిద్యను వశపర్చుకొని అష్టాంగయో గం ద్వారా అనితర తపస్సుతో ధ్యాన సమాధిలోని కి వెళ్లిన బాలయోగీశ్వరులు 19 జూలై 1985లో శివైక్యం చెందారు.
ముమ్మిడివరం బాలయోగీశ్వరుల తపో మందిరంలో మహాశివరాత్రి పర్వదినాలు వైభ వంగా వేడుకలు కొనసాగుతాయి. గోదావరి జిల్లా లో ఎక్కువగా తమ బిడ్డలకు బాలయోగి పేరు పెట్టుకోవడానికి కారణం భగవాన్‌ బాలయోగి చూపిన ఆధ్యాత్మిక ప్రభావమే కారణం. ఆత్మ యా గి బాలయోగి తన ధ్యానసిద్ధితో మౌనముద్రతో భక్తుల హృదయాల్లో జ్ఞానకాంతిని ప్రసరింపచేసి ఆధునిక భారతీయ యోగుల పరంపరలో ఆరా ధ్యుడిగా నిలిచిపోయారు. తపోనిష్టా పరుడైన బాలయోగీశ్వరుల గురించి ప్రముఖ కవి భోయి భీమన్న మాటల్లో-
మాల ఇంట పుట్టి పాలేరుతనముండి
బాలకృష్ణునట్లు పశువులుగాసి
పశుపతిత్వమంది పరమాత్మవైనావు
నిన్నుమించి యతులు నేడు గలరె?

– అడపా నాగదుర్గారావు (దుర్గ)
9000725566

Advertisement

తాజా వార్తలు

Advertisement