Thursday, April 25, 2024

కేంద్రంలో రానున్నది రైతు సర్కారే : మంత్రి గంగుల కమలాకర్

భారత దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారని, రానున్నది రైతు సర్కారే అని బీసీ సంక్షేమ పౌరసరఫరాలశాఖ మంత్రి రంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేసారు. మంగళవారం BRS కార్యాలయం ప్రారంబానికి సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ లతో కలసి మంత్రి గంగుల ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఈ సందర్బంగామంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రేపు మధ్యాహ్నం 12.37 నుంచి 12.47 మధ్య BRS ఢిల్లీ కార్యాలయం ప్రారంభం అవుతుందని, ముందుగా పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణలో రైతుల కోసం 24 గంటల కరెంటు ఇస్తున్నారని దేశమంతా ఉచిత కరెంటు ఇవ్వాలని సీఎం భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 8 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే రైతుల కోసం పేదల కోసం అనేక కార్యక్రమాలు తీసుకోబడ్డాయో అవన్నీ కూడా దేశ వ్యాప్తంగా అమలు కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభానికి హాజరుకానున్నారని.. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం కోసం పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి చేరుకుంటున్నారని, ఇదిలా ఉంటే ఢిల్లీలో ప్రత్యేకంగా నిర్మించిన వేదశాలలో రాజశ్యామల యాగం ఇవాళ రేపు యాగం, ప్రత్యేక పూజల్లో కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. మంత్రి గంగుల వెంట మేయర్ సునీల్ రావు, చల్ల హరిశంకర్, నందెల్లి మహిపాల్, సయ్యద్ అంజాద్ ఆలీ వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement