Thursday, September 21, 2023

సంతాన సౌభాగ్య వ్రతం పోలాల అమావాస్య

మన శాస్త్రాలు మహిళల సౌభాగ్యానికి, సంతానానికి అనేక వ్రతాలు, పూజలు పేర్కొన్నాయి. ఆయా వ్రతాలను ఆచ రించడం అనాదిగా వస్తున్న ఆచారం అయింది. ముఖ్యం గా శ్రావణమాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమైనదే. శ్రావణమాసంలో వచ్చే నాలుగు లేక అయిదు మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ పూర్ణిమ ఇలా… శ్రావణ అమావాస్య వరకూ అన్నీ పర్వదినాలే. అయితే శ్రావణమా సం నెలరోజులు మహిళలు సౌభాగ్యం కోసం వ్రతం ఆచరిస్తే శ్రావణ బహుళ అమావాస్య రోజు సౌభాగ్యంతోపాటు సంతానంకోసం పూజ చేస్తారు. అదే పోలాల అమావాస్య. పోలాల అమావాస్యకు ఎంతో విశి ష్టత వుంది. ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంర క్షణ కోసం నిర్దేశించబడింది. పెళ్లైన చాలా కాలానికి కూడా సంతానం కలుగని స్త్రీలకు పోలాల అమావాస్య ఎంత ముఖ్యమో… సంతాన వతులైన స్త్రీలకు కూడా అంతే ముఖ్యం. అందుకే స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు.

వ్రత విధానం

- Advertisement -
   

శ్రావణమాస అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసి… దేవుడి మందిరంలో ముగ్గులు వేసుకోవా లి. ముఖ్యంగా ఈ పూజకు ఉండాల్సింది కంద మొక్క. దేవుడి మం దిరం వద్ద కంద మొక్కను ఉంచి దాని చుట్టూ పసుపు, కుంకుమ, బియ్యం పిండితో చుక్కలు పెట్టా లి. ఏడు పోచలు దారానికి పసుపు రాసి పసుపుకొమ్ము కట్టాలి. ఇలా ఇంట్లో ఎంత మంది మహిళలు వుంటే అన్ని అమ్మవారికి ఒకటి, వాయనం ఇచ్చే ముత్తైదువుకి ఒకటి చొప్పున తోరాలు తయారుచేసుకొని కంద మొక్క దగ్గర పెట్టాలి. మొదటగా పసుపు వినాయకుడిని పూజించి ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీదేవిని గానీ, సంతానలక్ష్మీదేవిని గానీ ఆవాహనం చేసుకొని షోడశోపచారాలతో శక్తి కొలది పూజచేయాలి. పూజ పూర్తి అయిన తర్వాత ఏడు బూరెలు (మగపిల్లలు కలవారు, మగసంతానం కావాలనుకునేవారు), ఏడు గారెలు (ఆడపిల్లలు ఉన్నవారు, ఆడ సంతానం కావాలనుకునేవారు) నైవేద్యం పెట్టాలి. కథ చెప్పుకుని అక్షింతలు వేసు కోవాలి. ఏడు బూరెలు, ఏడు గారెలు దక్షిణ వేసి బహు సంతానవతి అయిన ముత్తై దువుకి వాయనం ఇచ్చి, పసుపుకొమ్ము కట్టిన తోరాన్ని ఇచ్చి నమస్కరించి అక్షింత లు వేయించుకోవాలి. ఒక పసుపుకొమ్ము తోరాన్ని అమ్మవారికి వుంచి, మిగిలినవి తీసి పూజ చేసుకున్నవారు మెడలో వేసుకోవాలి. పిల్లలకు కూడా కథ అక్షింతలు వేసి పసుపు కొమ్ము కట్టిన తోరాన్ని మెడలో వేయాలి. ఇలాచేస్తే మంచి జరుగుతుం దని, సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పదికాలాలపాటు చల్లగా ఉంటారు. నమ్మకం. సాయంత్రం కూడా అమ్మవారి వద్ద దీపం వెలిగించాలి. పూర్ణం బూరె లు, గారెలు లాగే పోలేరమ్మకు పొట్టెక్క బుట్టలు నైవేద్యం పెట్టవచ్చు. పనస ఆకు లతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజలు పోలాంబ పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాల తోపాటు చీరసారెలు సమర్పిస్తారు. ఈవిధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ, ఫలితంగా వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు.

వ్రత కథ

ఈ వ్రతంలో ముఖ్యమైన కథ ఒకటి వుంది. పూర్వకాలంలో ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉండేవారు. ఆ ఏడుగురుకి పెళ్లిళ్లు చేస్తారు. అందరూ పిల్లాపాపలతో సుఖంగా వుంటారు. అయితే ఏడవ కోడలకి మాత్రం ప్రతి సంవత్సరం పిల్లాడు పుడతాడు. కానీ పోలాల అమావాస్య రోజు చనిపోతా డు. అలా ఆరు సంవత్సరాలు జరుగుతుంది. అమావాస్య రోజే పిల్లవాడు చనిపోవ డంతో తమకు పోలాల అమావాస్య పూజ చేసుకునే అవకాశం లేదని మిగిలిన ఆరు గురు తోడికోడళ్లు ఏడవ కోడలిని దెప్పుతుంటారు. ఏడవ సంవత్సరం కూడా పు ట్టిన పిల్లవాడు కొన ఊపిరితో వుండగానే ఒక చాపలో చుట్టేసి ఎవరికీ కనిపించ కుండా దాచేస్తుంది. అందరితోనూ కలిసి తను కూడా పూజ చేసుకుంటుంది. పూజ అంతా అయ్యాక ఎవరూ చూడకుండా ఆ బాబుని భుజం మీద వేసుకుని ఏడుస్తూ స్మశానానికి వెళ్తుంది. అది చూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో ఎదురుగా వస్తారు. ”ఎవరమ్మా నీవు? ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడుగుతారు. దానికి ఆమె ”ఎవరైతే ఏమిటమ్మా మీరు ఏమైనా ఆర్చేవారా తీర్చే వారా?” అని అంటుంది.
దానికి ఆ దంపతులు ”మేము ఆర్చేవారము. తీర్చేవారమే! చెప్పు అమ్మా” అంటారు. ఆమె తన బాధను తెలియజేస్తుంది. వెంటనే ఆ దంపతులు ఆమె ఓదా ర్చి ”నీకు అంతా శుభం కలుగుతుంది. నీ బిడ్డల సమాధుల దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఏమి పేర్లు పెట్టాలని అనుకున్నావో ఆ పేర్లతో పిలువు” అని చెబుతారు. ఆమె అలాగే చేస్తుంది. భుజం మీద ఉన్న బిడ్డతో సహా చనిపోయిన బిడ్డలు అందరూ బతికి లేచి వస్తారు. ఆశ్చర్య ఆనందాలతో వారందరని అక్కున చేర్చుకుని ఆ దంపతులకు కృ తజ్ఞతలు చెబుదామని తిరిగి చూస్తే వారు కనిపించరు. ఆ వచ్చింది పార్వతీ పరమే శ్వరులు అని తెలుసుకుని ఆనందంగా పిల్లలు అందరినీ తీసుకుని ఇంటికి వెళుతుం ది. అక్కడ ఆమె తోడికోడళ్లు ఆమె అదృష్టానికి అబ్బురపడి ఆమెకు క్షమార్పణ చెప్పుకుంటారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అందరూ పోలాల అమావాస్య పూజ చేసుకుంటున్నారు. పిల్లాపాపలతో శుఖ సంతోషాలతో సంతోషంగా వుం టారు. పోలాల అమావాస్య పూజ అయిన తర్వాత చేతిలో అక్షతలు పట్టుకుని ఈ కథ చదువుకుని పిల్లల తలపై వేసి, పూజ చేసిన వారు కూడా వేసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement