Sunday, April 28, 2024

సమస్త కోరికలు తీర్చే హనుమద్వ్రతం

మనసు నిత్యం చలిస్తుంది. అలాంటి మనసును అదుపులో వుం చుకోవడానికి మన:స్థితికి ప్రతినిధి అయిన మారుతిని ఆరాధించాలి. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్‌ వ్రతం. ఆంజనే యస్వామి భక్తికి ప్రతీకగా, ఆత్మవిశ్వాసం పెంచి అపజయాలు తొల గించి విజయాలు చేకూర్చే శక్తినిస్తాడు. భోగాన్ని, మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం హనుమంతుడు. భక్తసుల భుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం హనుమత్‌ వ్రతం హ నుమంతునికి సంబంధించిన ముఖ్యమైన పర్వదినాలు మూడు.
వైశాఖ బహుళ దశమినాడు వచ్చే హనుమజ్జయంతి.
జ్యేష్ఠ శుద్ధ దశమి నాటి హనుమత్కల్యాణం.
మార్గశిర శుద్ధ త్రయోదశి నాటి హనుమద్వ్రతం.

మాసాల్లో మార్గశిరమాసం శ్రేష్ఠమైనది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ”మాసానాం మార్గశీర్షోహం” అని చెప్పా డు. అలాంటి శ్రేష్ఠ మాసంలో వస్తుందీ హనుమద్వ్రతం. భక్తసులభు డైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం హను మత్‌ వ్రతం ఆచరించడం. మార్గశిర త్రయోదశినాడు సువర్చలా సమే త హనుమంతుడిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్‌ కథ లను శ్రవణం చేసి హనుమత్‌ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తి చేయాలి. పదమూడు ముళ్ల తోరాన్ని ధరించాలి. పదమూడు సంవత్సరాలు వరుసగా చేసినవారికి హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం కలుగు తుందని శాస్త్ర వచనం.

హనుమద్వ్రతం చేయడం ద్వారా సమస్త కోరికలు నెరవేరతాయి. అందుకు నిదర్శనం నీలుడు కథ. నీలుడు విభీషణుడి కుమారుడు. ఒ కనాడు అతడు తండ్రితో, ”ప్రభూ! లంకా నగరంలో సకల సంపదలూ ఉన్నాయి. కానీ రాజగృహంలో కానీ, లంకా రాజ్యంలో కానీ కల్పవృ క్షం, కామధేనువు, చింతామణి లేవు. శ్రీరామచంద్రుని సేవలో ధన్యు డవైన నీవు ఆ అమూల్య నిధుల్ని ఎందుకు పొందలేకపోయావు?” అని ప్రశ్నించాడు.

అందుకు విభీషణుడు ”కుమారా! శ్రీరాముని పాదపద్మాల సేవ అనే బ్రహ్మానంద సాగరంలో ఓలలాడే నాకు అలాంటి వాటిపై కోరిక కల గలేదు” అన్నాడు. పుత్రుడికి కీర్తి రావాలని ఆశించి, విభీషణుడు ”పుత్రా! నీలా! దేవలోకంలో కల్పవృక్షం, కామధేనువు, చింతామణి ఎల్లప్పుడూ దేవతల వద్దే ఉంటాయి. నీకు అవి కావాలనుకుంటే సాధిం చు. అందుకు గురు శుశ్రూష చేసి దేవతల్ని ఉపాసించాలి” అని చెప్పాడు.
నీలుడు తండ్రి మాటను శిరసావహంచి తండ్రికి నమస్కరించి, గురువైన శుక్రాచార్యుని వద్దకు చేరి గురు శుశ్రూష చేసి గురువును సంతృ ప్తిపరిచాడు. పది పన్నెండేళ్లు సేవించాక శుక్రాచార్యుడు సంతోషించి, ”నీకోరిక ఏమిటి?” అన్నాడు. నీలుడు తన కోరిక తెలి యజేశాడు.
అంతట భార్గవుడు ”నీలా! అన్ని విద్యలకు రాణి అనదగిన మంత్ర విద్యనూ, కోరికలన్నింటిని తీర్చగలదానిని ఉపదేశిస్తాను. శ్రేష్టమైన వ్రతాన్ని ఉపదేశిస్తాను. వాటి వల్ల నీకు దివ్య రత్నాలు తప్పక లభిస్తాయ న్నాడు. మృగశిరా నక్షత్రం అందుకు అనుకూలమైంది. ఆ మర్నాడు మృగశిర కావడంతో శుక్రాచార్యుడు పంచముఖాంజనేయుని మంత్రా న్ని, సమస్త ప్రయోజనాలు నెరవేర్చగల హనుమద్వ్రత్వాన్ని ఉపదేశిం చాడు. గురుఆజ్ఞ మేరకు నీలుడు హనుమద్వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచ రించాడు. అందుకు సంతోషించిన #హనుమంతుడు నీలుడికి సాక్షా త్కరించాడు. నీలుడు #హనుమం తుని అనేక స్తోత్రాలతో స్తుతించాడు. ఆ స్తోత్రాలకు సంతృప్తి చెందిన హనుమంతుడు ”నీలా! భక్తిప్రపత్తుల వల్ల నా భక్తులలో శ్రేష్ఠుడివైనావు. నీ తండ్రి విభీషణుడు కూడా నాకు మంచి మిత్రుడే. నీవు కోరుకున్న వాటిని తప్పక ఈయగలను. రేపు అమ రావతి వెళ్లి ఇంద్రుని జయించి, చింతామణి, కల్పవృక్షం, కామ ధేనువు పొందగలవు. అంతేకాదు, దేవతా స్త్రీలలో రత్నం, అందం సౌభాగ్యవతి అయిన వనసుందరిని కూడా పొందగలవు. మృగశిరా నక్షత్రం నీకు నిల యం అవుతుంది. నీ పేరు మీద ఈ పురు షోత్తమ క్షేత్రం నీలాద్రిగా ఖ్యాతి పొందుతుంది అని అనేక వరాలిచ్చాడు. వ్రతం నిష్ఠతో ఆచరించినవారు నీలాగే వెంటనే కోరిన ఫలితం పొందగలరు” అని హనుమంతుడు నీలు ని అనుగ్రహంచి అంతర్ధానమయ్యాడు. గురువైన శుక్రాచార్యుని పాద పద్మాలకు నమస్కరించి అనుమతి తీసుకుని వచ్చి, తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీస్సులు స్వీకరించాడు. ఒక దూతను పిలిచి నీలుడు ఇంద్రుడికి తన కోరిక గురించి కబురు పంపాడు. కల్ప వృక్షాదుల్ని ఇవ్వ డానికి ఇంద్రుడు తిరస్కరించి యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధం భీకర రూపం దాల్చడంతో బ్రహ్మ సాక్షాత్కరించి, నీలునికి ఇంద్రునిచే చింతా మణి, కల్పవృక్షం, కామధేనువు లను ఇప్పించి సయోధ్య కుదిర్చాడు.

హనుమద్వ్రతం వల్ల సోమదత్తుడనే చంద్రవంశ రాజేంద్రుడు పో యిన రాజ్యం సంపాదించుకున్నాడు. మాహష్మతీ పురాన్ని సోమదత్తు డు పాలించేవాడు. అతడు పరాక్రమశాలే అయినా శత్రువులందరూ ఒక్క సారిగా వచ్చి అతడిని ఓడించారు. గత్యంతరం లేక సోమదత్తుడు రాణి దేవికతో కలసి అరణ్యంలో ప్రవేశించాడు. రాజ్యభ్రష్టత, పుత్రశోకా నికి తోడు అంధత్వం కూడా కలిగింది. దేవకి సోమదత్తుని గర్గముని ఆశ్రమానికి చేర్చింది. గర్గ మహాముని పరిస్థితి తెలిసికొని, ధైర్యం చెప్పి, జయసిద్ధినిచ్చే హనుమద్వ్రతం ఉపదేశించాడు. గురువు ఆదేశం ప్రకా రం సోమదత్తుడు భక్తిశ్రద్ధలతో హనుమద్వ్రతం నిర్వహంచాడు.

- Advertisement -

అందుకు సంతుష్టుడైన ఆంజనేయుడు సాక్షాత్కరించి, ఒక ఖడ్గం ప్రసాదించి, దాని ద్వారా శత్రువులను జయించి మరల రాజ్యం పొంద గలవని అనుగ్రహంచాడు. ఇలా హనుమద్వ్రతం ఆచరించి ఒక్కరోజు లో శత్రువుల నందరిని జయించి, రాజ్యం పొందిన సోమదత్తుడు తన కు కలిగిన సమస్త బాధల నుంచి బయటపడ్డాడు. గర్గ మహామునిని రాజగురువుగా, పురోహతునిగా స్వీకరించి ధర్మబద్ధంగా మూడువంద ల ఏళ్లపాటు సామ్రాజ్యాన్ని పరిపాలించారు. హనుమద్వ్రతం ఆచ రిం చిన వారికి అన్ని కష్టాలు తొలగించి, సమస్త కోరికలు నెరవేర్చగలదు.
”అంజనా గర్భ సంభూత- రామ కార్యార్థ
సంభవ వర తోర కృతాభాస- రక్షమాం ప్రతి వత్సరమే”
అంటూ వ్రత తోరం ధరించాలి. హనుమద్వ్రతం లో పూజించిన రక్ష ధరించడంవల్ల హానుమద్రక్షణ పొందగలం. విశేషించి ఈ వ్రతం నాడు స్వామికి అత్యంత ప్రీతికరమైన అప్పాలు, తమలపాకులు, సింధూరంతో పూజలు చేయుట వలన స్వామి కృప కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement