Thursday, April 25, 2024

సాయి అనుగ్రహ శక్తి

బాబాకు కూర్మి భక్తుడైన రఘునాధ్‌ తెండూల్కర్‌కు ఒకసారి ఒక జ్యోతిష్కుడు కనిపించాడు. ఆయన తెండూల్కర్‌తో ”ఈ సంవత్సరం మీ కుటుంబం గ్రహ స్థితులు ఏమీ బాగా లేవు, కావున మీకు మంచి జరిగే అవకాశమే లేదు. మీ అబ్బాయిని కూడా పరీక్షలకు పంపవద్దు, అతనికి పాసు కావడానికి అవకాశములు లేవు” అని చెప్పాడు. దానితో రఘునాధ్‌ టెండూల్కర్‌ ఖిన్నుడయ్యాడు. తండ్రి వద్ద నుండి విషయాన్ని తెలుసుకున్న అతని కుమారుడు బాబు టెండూల్కర్‌ నిరుత్సాహపడతాడు. పాసు కానప్పుడు చదవడం ఎందుకని పుస్తకాలను పక్కన పడేసి ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ సంవత్సరం అతను మెడిసిన్‌ పరీక్షలకు హాజరు కావల్సి వుంది. జరిగిన విషయాన్ని గ్రహంచిన అతని తల్లి తనకు సాయిబాబానే దిక్కని నమ్మి, శిరిడీకి వచ్చి బాబా కాళ్ళపై పడి ఆ జ్యోతిష్కుడు చెప్పిన విషయాన్ని వివరించి సలహా అడిగింది.
అప్పుడు శ్రీ సాయి చిరునవ్వుతో ”తల్లి! ఆ జ్యోతిష్యుని మాటలు కట్టిపెట్టండి. మీ అబ్బాయి తప్పక పరీక్షలలో కృతార్ధుడు అవుతాడు. ఆ హామీ నాది. నా మాటలపై నమ్మ కముంచి అతనిని పరీక్షలకు హాజరు కమ్మని చెప్పు” అని ఆశీర్వ దించారు.
తల్లి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్న బాబు తెండూల్కర్‌ సాయి తనను తప్పక గట్టెక్కిస్తారని నమ్మకంతో చక్కగా చదివాడు. సా యి అనుగ్రహం వలన పరీక్షలు బాగా రాసాడు కాని ఎక్కడో ఒక మూల సంశయం వుండడం వలన మౌఖిక పరీక్షకు హాజరు కాలేదు. దాంతో అతని ప్రొఫెసర్‌ నువ్వు వ్రాత పరీక్షలో చాలా బా గా వ్రాసావని, తప్పక మౌఖిక పరీక్షలకు హాజరు కావాల్సిందిగా కబురు పంపాడు. గ్రహస్థితుల కంటే సద్గురువు అనుగ్రహ శక్తి ఎన్నో రెట్లు మిన్న అని తెండూల్కర్‌ కుటుంబం ఈ లీల ద్వారా గ్రహంచారు.
సాయి భక్తాగ్రేసరుడు హరి భావూఫన్సే ఒక చక్కని డాక్టరు. నిస్వార్ధ తత్వంతో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వృత్తి చేస్తుం డేవాడు. తన స్వగ్రామంలో ఒకసారి ఒక కలరా రోగికి బాబా విభూ తిని ఇచ్చారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ విభూతిని సేవించిన ఆ వ్యక్తి రోగం వెంటనే తగ్గిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరిలో కలరా వ్యాధి విజృంభించింది. వందలాది మంది ఆ రోగం బారినపడ్దారు. బాబా ఊది ఒక వ్యక్తి రోగం తగ్గించిందని తెలుసుకున్నవారు ఫన్సే ఇంటికి పరుగులు తీసారు. అందరికీ ఊదీ తలా కాస్తా పంచడంతో ఫన్సే వద్ద వున్న ఊదీ అంతా అయిపోయింది. ఇంక ఎవరైనా వస్తే ఏంచెయ్యాలా అన్న దిగులు ఫన్సేకు పట్టుకుంది. వెంటనే ఆ అమాయకులను ప్రాణాం తకమైన ఆ వ్యాధి నుండి రక్షించమని బాబాకు హృదయపూర్వకంగా మొరపెట్టుకున్నాడు ఫన్సే. చిత్రంగా నాటి నుండి ఆ ఊళ్ళో కలరా వ్యాధి మాయమైపోయింది. వ్యాధిన పడ్డ వారందరూ స్వస్థతను పొందగా మరి ఇంకెవ్వరూ ఆ వ్యాధి బారి నపడలేదు. ఖరీదైన డాక్టర్ల మందుల కంటే ఎంతో గొప్పగా పని చేసి, ఆ ఊరి నుండే వ్యాధిని తరిమి కొట్టిన సాయినా థుని ఊదీ మ#హమ వర్ణింప తగునా?

Advertisement

తాజా వార్తలు

Advertisement