కడప (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : కడప నగరంలోని ఒక బార్ వద్ద జరిగిన ఘర్షణలో ఇద్దరు యువకులు దారుణంగా హత్యకు గురైన సంఘటన జరిగినది. డీఎస్పీ శివారెడ్డి కథనం మేరకు నగరంలోని రాజారెడ్డి వీధికి చెందిన అభిలాష్ (28), రేవంత్ (26) అనే ఇద్దరు మిత్రులు సాయిబాబా హాలు వద్ద ఉన్న బారుకు బుధవారం రాత్రి వెళ్లారు.. బారు నుంచి బయటకు వస్తుండగా కొందరు కత్తులతో దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన రేవంత్ అక్కడికక్కడే మరణించగా ఆసుపత్రి పాలైన అభిలాష్ గురువారం మరణించాడని డీఎస్పీ శివారెడ్డి తెలిపారు. హత్యలకు పాత ఘర్షణలే కారణమని భావిస్తున్నామని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -