Sunday, April 28, 2024

సుభిక్షంగా తెలుగు రాష్ట్రాలు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలన్నదే విశాఖ శారదా పీఠం ఏకైక లక్ష్యమని స్వరూపానందేంద్ర వివరించారు. ప్రధానంగా వ్యవసాయం, రైతులు, అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే దేశం సశ్యామలంగా ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరింతగా మెరుగైన పాలన అందిస్తారని స్వరూపానందేంద్ర ఆకాంక్షించారు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజా సంక్షేమ కార్య క్రమాలు మరింతగా చేపట్టి అందరి మన్ననలు పొందాలని అగ్నిసాక్షిగా తాను అమ్మవారిని కోరుకున్నానన్నారు. ముఖ్య మంత్రులకు, దేశ ప్రజలకు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సు లు ఎప్పుడూ ఉండాలని స్వామి ఆకాంక్షించారు. ఆ సంక ల్పంతోనే రాజశ్యామల యాగం నిర్వహించామని చెప్పారు. భారతావనిలో జగన్మాత రాజశ్యామల అమ్మవా రిని ఉపాసనా దేవతగా ఆరాధిస్తున్న ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠమని ఆ పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి తెలిపారు. ఈనెల 7న ప్రారంభమైన పీఠం వార్షిక మహోత్సవాలు శుక్రవారం ముగిసాయి. ఈ ఉత్సవాల్లో దేశ రక్షణ కోసం ఐదు రోజులపాటు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. యాగం మహా పూర్ణాహుతి సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి మాట్లా డారు.ఐదు రోజులపాటు- నిర్వహించిన రాజశ్యామల యా గం పూర్ణాహుతితో విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు ముగిసాయి. కాగా రాజశ్యామల యాగం లో అద్భుతం చోటు చేసుకుంది. పూర్ణాహుతి సమయంలో రేగిన యాగ జ్వాలలో ఓంకారం దర్శనమిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement