Saturday, May 4, 2024

పవనసుతుడు కలతచెందిన వేళ…

శ్రీరామచంద్రమూర్తి ఆదేశానుసారం పవన సుతుడు సీతమ్మ తల్లి జాడను తెలుసుకోవడానికి లంకలో ప్రవేశించారు. ఎంతో భక్తితో అంగుళం అంగుళం వెదికారు. యెంత వెదికినా సీతమ్మ కనబడలేదు. స్వామి నిరాశలో కూరుకుపోయారు. సీతమ్మ జాడ తెలుసుకోకుండా వెన క్కి వెళ్ళడంకన్నా ఆత్మహత్యే సరైన మార్గం అనుకున్నారు. మళ్ళీ ఆయనే ”ఆత్మహత్య మహాపాపం. అలా చేయకూడదు. అన్నిటికన్నా శ్రేష్టం తపస్సు. అందుకే తపస్సు చేసుకుందామ”ని అనుకున్నారు. మళ్ళీ ఆయ నే ”అమ్మ వారిని వెదకడం, తపస్సు చెయ్యడం రెండింటికీ తేడా ఏముం ది?” అని తర్కించుకున్నారు.
”జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి మన బలం సరిపోనప్పుడు భగవంతుడిని ప్రార్ధిస్తే ఆయనే ఉపాయం చూ పిస్తారు కదా!” సరిగ్గా ఆంజనేయస్వామి కూడా అలాగే ఆలోచించారు.
వెంటనే జయ మంత్రం పఠించారు ఇలా-
”నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై.
నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చన్ద్రార్కమరుద్గణభ్య:”
తను వెదికితే కనబడేది కాదు. తను దర్శనం ఇవ్వదలుచుకుంటే తన ప్రయత్నం లేకుండానే కనబడేది. స్వామి అశోకవనంలోకి వచ్చారు. మన సమయం బాగాలేకపోతే దగ్గరలోనే ఉన్నవి ఒకోసారి కనబడవు. చైత్య ప్రాసాదంలో సహస్ర స్తంభ మండపం కనిపించింది. మెరిసిపోతోంది కైలాస శిఖరంలా. కోరి అమ్మవారు అక్కడ కూర్చుందా అన్నట్లు అనిపిం చింది. బంగారు వేదికలు, మణిప్రవాళముల సోపానాలు. కోకిలలూ, ఇతర విహంగముల మధుర కలరవాలు కలవట అక్కడ. వాటిని హనుమంతుడు నిద్ర లేపారు అంటారు వాల్మీకి. అదిగో అవీ కనబడుతున్నాయి.
ఉత్పతద్భి: ద్విజ గణౖ: పక్షై: సాలాస్సమాహతా:
అనేక వర్ణా వివిధా ముముచు: పుష్పవృష్టయ:
ఆ ఎగిరే పక్షుల రెక్కల తాకిడికి వివిధ పుష్పాలు నేల రాలాయట. అవి అమ్మవారి పాదాల దగ్గర పడ్డాయి. ప్రసన్నతారాధిపత్యుల దర్శనం జరుగు తోంది. రామచంద్రుని అర్ధాంగి ముఖచంద్ర దర్శనం.
క్రుంగి కృశించి, శుక్ల పక్షం నాటి పాడ్యమి చంద్రునిలా, నివురుగప్పిన నిప్పులా, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కనిపించింది తల్లి. ఒబ్బిడిగా, నిం డుగా పైట కప్పుకొని పొందికగా కూర్చుని వుంది. ఆమె ఆకృతి రామచంద్ర విరహాకృతి. ఆమే సీత అనే నిర్ణయానికి వచ్చారు హనుమ.
”రామస్య చ యధారూపం తస్యేయం అసితేక్షణా”
రామునికీ, తల్లికీ పోలికలు కనిపించాయి హనుమంతులవారికి. ఈమె లేకుండా రామచంద్రమూర్తి జీవించి ఉన్నారు అంటేనే చాలా దుష్కరమైన కర్మ కదా అది అనిపించింది. తలుచుకుంటేనే కళ్ళ నీళ్ళు నిండిపోయాయి. ఆమెని చూడగలిగినందుకు ఆనంద బాష్పాలు, అన్ని బాధలు పడుతోందే అని దు:ఖాశ్రువులు.
”తేజస్వీ హనుమాన్‌ విలలాప హ” అంటారు మహర్షి.
”దదర్శ హనుమాన్‌ దేవీం లతామకుసుమామివ”
పూలు లేని లత వలె ఎటువంటి శోభలేని తల్లి కనబడింది అక్కడ.
సీతమ్మతల్లి కనిపించిందన్న ఆనందంలో మారుతి గంతులు వెయ్యలే దు. తోకని ముద్దు పెట్టుకోలేదు. ఇదివరకు మండోదరిని చూసి సీతమ్మ అను కున్నప్పుడు వచ్చిన కోతివేషాలు ఇప్పుడు రావడంలేదు. మనసులో ఏదో తెలియని ప్రశాంతత.
”ప్రాస్పన్దతైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మమివాభితామ్రమ్‌”
ఎడమ కన్ను అదురుతోంది తల్లికి. అది వాల్మీకి చూసినంత జాగ్రత్తగా చూస్తేనే గాని ఎవరికీ తెలీదు. నీటి అడుగున ఉన్న పద్మపు నాళాన్ని ఒక చేపపి ల్ల తగిలింది. ఆ ప్రకంపన పైనున్న పద్మం రేకుల దాక వచ్చింది. చిన్నగా కంపించింది పద్మపత్రం. అలా కంపిస్తోంది తల్లి వామ నేత్రం. ఏడిచిఏడిచి అమ్మ కళ్ళు ఎర్రని పద్మపు రేకులయ్యాయి. రావణుడి మీది కోపం, స్వామి ఇంకా పట్టించుకోవటం లేదనే ఉక్రోషం! అసలే చెంపకు చారెడేసి కన్నుల తల్లి. ఇప్పుడు కోతులే లేని లంకలో కోతి కనిపిస్తోంది. ఒకటే విస్మయం ఆ కళ్ళలో. నేను కొంచెం ధైర్యం చెప్పకపోతే తల్లి బ్రతుకదు అనిపించిందేమో, పలకడం మొదలు పెట్టారు ఆంజనేయస్వామి. ”ఏ భాషలో మాట్లాడాలి? పుట్టింటి భాష వింటే ప్రాణం లేచి వస్తుంది. మైథిలీ ప్రాకృత భాషలో మొద లుపెట్టారు. ఏంమాట్లాడాలి? ఎవరినైనా కట్టిపడేసే విషయం రామ విషయ మే. అంతకంటే మధురవాక్యం ఏముంటుంది?” అనుకుని-
”రాజా దశరధో నామ…” అంటూ రామ చరిత్ర మొదలుపెట్టారు.
”స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామ మనుస్మరన్తీ” తల్లి కొంచెం స్థిమిత పడింది.
”నమోస్తువాచస్పతయే సవజ్రిణ స్వయంభువే చైవ హుతాశనాయచ.” అనుకుంది. అడుగడుగునా భగవత్సంస్మరణ మన జాతి సంస్కారం మారుతి అంజలి ఘటించి మధురంగా మాట్లాడుతున్న సన్నివేశం.
”శిరస్జ్యలిమాధాయ సీతాం మధురయా గిరా?” అన్నారు మహర్షి.
అశ్వసంచలన ఆసనంలో ఉన్నారు స్వామి. ఒప్పుకుంటే వీపు మీద ఎక్కించుకుని ఉచ్చైశ్రవంలా స్వామి పాదాల దగ్గర వాలి పోదామనేమో ఆ తొందర. ”కాత్వం భవసి కల్యాణి?” నువ్వెవరవమ్మా? అని ప్రశ్నించారు.
ఒకవేళ నువ్వుగాని నేను వెదుకుతున్న సీతమ్మవు కావుగదా?
”సీతా త్వమసి? భద్రం తే…. తన్మమాచక్ష్వ పృచ్ఛత:.
మొదట రామచంద్రునితో సమాగమంలో చాలా మాట్లాడాడు కపివరేణ్యుడు. ఒక్కమాట మాట్లాడలేదు స్వామి తనతో. ఇప్పుడు తన పుణ్యం పండింది. రాముని కంటే దయ గల తల్లి… నోరువిప్పి మాట లాడిం ది తనతో. ప్రతిరోజూ తను రామునికంటే ముందు నిద్ర లేచి తల స్నానం చేసి వ చ్చి, సుఖశయనుడైన స్వామి పాదాలకి నమస్కరించేది. పాదాలకు ముంగు రుల తాకిడి,… చిరు జల కణముల స్పర్శతో… చిరునవ్వుతో కూడిన పులక రింతతో స్వామి కనులు తెరిచేవారు. ముందుగా చూడామణి కనబడేది. అమ్మ తన శిరసు మెల్లగా పైకెత్తి స్వామిని చూసేది. చూడామణి దర్శనమైన తరువాతే సీతమ్మ తల్లి ముఖ దర్శనం అయ్యేది స్వామికి. అందుకనే కాబోలు తల్లి హనుమకి తన గుర్తుగా చూడామణిని ఇచ్చింది.
దానిని తీసుకువచ్చి శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చారు ఆంజనేయ స్వామి. దానిని చూసి . సీతాదేవి శిరస్సుపై చూడామణి వున్న దృశ్యం మదిలో కదలాడింది. ఆయన చాలా బాధపడ్డారు. అలా చూడామణి ద్వారా ”త్వరలో నేనూ కనిపిస్తాను” అనే సీతమ్మతల్లి సందే శం అందుకున్నారు శ్రీరామచంద్రమూర్తి.

Advertisement

తాజా వార్తలు

Advertisement