Wednesday, May 8, 2024

పరబ్రహ్మ స్వరూపుడు గురువు

గురువును బ్రహ్మ విష్ణు మహశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా జ్ఞానా న్ని మనలో పుట్టించి , విష్ణువులా రక్షించి, శివుడిలా అజ్ఞా నాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి, మాన వతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలా పొందాలో నేర్పుతాడు. గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువు లను స్మరించడం వల్ల త్రిమూ ర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణమి నాడు, సప్తర్షులకు జ్ఞాన బోధ చేశాడని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహా ముని ఈ రోజున సత్యవతీ శంత నులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను విభజిం చాడనీ ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురు పూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము ఉన్నతంగా ఎదగాలంటే గురువు మార్గదర్శకత్వంలో శిక్షణ అత్యంత అవసరం. నిత్యా నిత్యాలను వివరించి, వివేక జ్యోతిని వెలిగించి, ప్రగతి పథంలో నడిపించేవాడు గురువు. అందుకే ”కృష్ణం వందే జగద్గురుం” అన్నారు. గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు మనకు ఎన్నో విషయాలను బోధించాడు.
”దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బహస్పతిం”
నవగ్రహాలలో గురుగ్రహం ఒకటి. దేవగురువు బృహస్పతి. గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూ పుడు. సప్త ఋషులలో అంగీరస పుత్రుడు బృహస్పతి. బాల్యంలోనే మహా పండితుడు. బుద్ధిమంతుడైనాడు. వేదాలను కూలంకషంగా అధ్యయనం చేసి, శాస్త్రాలను లోతుగా పరిశీలించి, రూప, గుణ, శీలంతో ప్రకాశిం చాడు. శివుని ఆరాధించి అతడిని ప్రసన్నం చేసుకున్నా డు. కాశిలో శివలింగ ప్రతిష్ఠ చేసి ఘోర తపస్సుచేసి, శివు ని అనుగ్రహాన్ని పొందాడు. గురువారం బృహస్పతిని స్మరిస్తూ నామకరణం చేయబడింది. మానవుల ప్రవర్త నను నిర్ధారించే నవగ్రహాలలో బ#హస్పతి ఒకటి. ఇతని కి వాచస్పతి అని మరొక పేరు కూడా ఉంది. కొన్ని వేదము ఋక్కులలో బృహస్పతిని అగ్ని అని భావించారు. గురు వు యజమానులకు పురోహతుడు. దేవతలకు గురువు. గురువు గుణాలకు అతీతుడు. ప్రకృతిలో కనిపించే ప్రతి అంశము మనకు గురువు. గురువు లేకుండా ఏ విద్య రాణించదని శాస్త్ర వచనం.
భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమ శివుడు ఆది యోగి. గురు సంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మ దేవునకు ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన కుమా రుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రు డైన పరాశర మహర్షికి, ఆయన తన కుమా రుడైన వ్యాస మహర్షికి ఉప దేశించాడు.
వ్యాస మహర్షి ఆషాఢ పౌర్ణ మి రోజున జన్మించాడు కాబట్టి, ఆ రోజుని వ్యాస పౌర్ణమిగా పేర్కొంటారు. వ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. నలు పు రంగులో ఉన్నవాడు కాబట్టి కృష్ణ అనీ, ద్వీపం (ద్వైపాయ నము) మీద జన్మించినవాడు కాబట్టి ద్వైపాయనుడు అనీ ఆ పేరు వచ్చిందంటారు. అప్పటి వరకూ ఉన్న వేదాలన్నింటినీ ఒక చోటకు చేర్చి, వాటిని నాలుగు భాగాలుగా విభజిం చాడు కాబట్టి ఈ కృష్ణ ద్వైపాయనుడు ‘వేద వ్యాసుడు’గా మారాడు. వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు. అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటు న్నాం.
వేదవ్యాసుడు అనగానే మహాభారతం కూడా గుర్తు కు వస్తుంది. వ్యాసుడు మహాభారత రచయితే కాదు, అందులో ఒక ముఖ్య పాత్ర కూడా! అసలు వ్యాసుడు లేనిదే భారతం లేదు. వ్యాసుని కారణంగానే ధృతరాష్ట్రు డు, పాండురాజు, విదురులు జన్మించారు. అంటే వ్యాసు డు లేకపోతే కౌరవ పాండవులే ఉండేవారు కాదు!
హందూ సంస్కృతికి మూలమైన శాస్త్రాలన్నింటికీ వ్యాసుడు మూల పురుషుడు. అలాంటి వ్యాసుని గురు పరంపరకు ప్రతినిధిగా భావించి, ఆయన పుట్టిన రోజుని గురువులను ఆరాధించే గురు పౌర్ణమిగా జరుపుకోవడం ఆచారంగా వస్తున్నది.


సింహాద్రి గిరి ప్రదక్షిణం

ఆషాఢ పూర్ణిమను సింహాచలంలో గిరిపున్నమి అని వ్యవహరిస్తారు. ఆషాఢ శుద్ధ చతుర్దశి రాత్రి కొండ దిగువన ఉన్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలుపెడతారు. కాలి నడ కన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శిస్తారు. 32 కిలో మీటర్ల దూరం కాలి నడకన సింహాచల గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వేలాది భక్తులు పున్నమినాడు స్వామి దర్శనం చేసుకుంటా రు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు, ఆలయంలోనే ప్రదక్షిణం ఆచరించి స్వామి దర్శనం చేసుకుంటారు.
– ఎస్‌.రామకిష్టయ్య, 9440595494

Advertisement

తాజా వార్తలు

Advertisement