Tuesday, May 14, 2024

నిజమైన ఉపాసన…

ఉపాసన చేసేటప్పుడు దేవత యొక్క బాహ్య రూపాన్నే కాకుండా, ఆంతర్యం కూడా తెలుసు కుని ఆరాధన సాగించాలి. లేకపోతే ఆ ఉపాసన సత్ఫలితాల్ని ఇవ్వదు. అందుకు నిదర్శనమే ఛాందోగ్య ఉప నిషత్తులోని ఈ కథ.
వసంతం రాగానే చెట్లన్నీ చిగురించి పచ్చదనంతో వాతా వరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వింధ్యాచల పర్వతం మీద ఉన్న చెట్లన్నీ, కొత్త చిగుళ్లు తొడిగి తమ పచ్చదనంతో వింధ్యాచలానికి కొత్త అందాల్ని తెచ్చిపెట్టాయి. నెమ్మదిగా ప్రవహస్తున్న సెలయేటి అలల ధ్వనికి తోడు, సెలయేటి మీద నుండి వచ్చే చల్లటి గాలి చేసే ధ్వని కూడా తోడై మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. అప్పుడు సమయం పది గంటలు దాటింది. సూర్యుడు తన ప్రతాపం చూపించసాగాడు.
సెలయేటి ఒడ్డున ఆశ్రమంలో కపి గోత్రంలో పుట్టిన శున కుడి కుమారుడు శౌనకుడు, కక్షసేనుడి కుమారుడు అభి ప్రతారి అనే ఇద్దరు ఋషులు తమ నిత్యకర్మలని ముగించు కుని, ప్రధానంగా చేసుకునే తమ వాయు దేవోపాసన కూడా పూర్తి చేసుకున్నారు. భోజనశాలలో విస్తర్లు వేసి వడ్డన మొద లుపెట్టారు. ఋషులిద్దరూ భోజనానికి సిద్ధమయ్యారు.
అదే సమయంలో తలుపు తట్టిన చప్పుడు అయ్యింది. ”భవతీ! భిక్షాం దేహ” అని వినిపించింది. ఎవరో బ్రహ్మ చారి భిక్షాటనకు వచ్చాడు. ”ఇది సమయంకాదు, వెళ్ళు.” అని లోపల నుండి సమాధానం వచ్చింది. భిక్షకుడికి లేదన డం విచిత్రం ఏమీకాదు. కాని ఋష్యాశ్రమంలో తిరస్కారా నికి ఆశ్చర్యపోయాడు బ్రహ్మచారి. ఈ ఆశ్రమవా సులను తేలికగా వదలకూడదు అనుకున్నాడు. వెంటనే లోపల వున్నవారిని ఉద్దేశించి ”ఆర్యా! తమరు ఏ దేవతను ఉపాసి స్తారు?” అని ప్రశ్నించాడు బ్రహ్మచారి.
”మా ఉపాసనా దైవం వాయువు. ఆయననే ప్రాణం అని కూడా అంటారు.” అన్నాడు ఒక ఋషి.
”స్వామీ! ఈ ప్రపంచమంతా ప్రాణంవల్ల రూపం దా ల్చింది. సృష్టి అంతా తిరిగి ప్రాణంలోనే లయమైపోతుం ది. ఈ విషయం తమకు తెలుసు కదా! ప్రాణమనేది కనిపించే వస్తువుల యందు, కనిపించని వాటియందు కూడా వున్నది కదా!” అన్నాడు బ్రహ్మచారి.
”ఎందుకు తెలియదయ్యా! నువ్వు చెప్పేదంతా మాకు తెలిసిందే. కొత్త ఏమీ కాదు.” అన్నాడు లోపలి ఋషి.
”అయితే సరే! ప్రస్తుతం అన్నం తినబోతున్నారు కదా! మరి ఆ అన్నం ఎవరి కోసం తయారు చేశారు? ఎవరికి నివేద న చేస్తారు?” తిరిగి ప్రశ్నించాడు బ్రహ్మచారి.
”ఆ మాత్రం తెలియదా! మేము ఆరాధించే వాయుదేవు డికి సమర్పించడానికి” సమాధానం చెప్పాడు ఋషి.
ఈ బ్రహ్మాండంలో గొప్పవి నాలుగున్నాయి. అవి అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలం. ఈ నాలుగింటిని వాయువు తనలో ఇముడ్చుకొంటుంది. అట్లే పిండమున, అంటే శరీర మున వాక్కు, నేత్రం, శ్రోత్రం, మనసు అనే నాలుగు ఇంద్రి యాలు ముఖ్యమైనవి. ఈ నాలుగింటినీ ప్రాణం తనలో ఇముడ్చుకొంటుంది. వాయువు, ప్రాణం మిగిలిన వాటిని తమలో కలుపుకొనుటకు చూస్తుంటాయి. సచ్చిదానంద స్వరూపుడైన పరమేశ్వరుడు అఖిల భువనాన్ని ఏలుతూ తానే రక్షకుడు, భక్షకుడు అవుతున్నాడు. అట్టి దేవుని మహ మ చేతనే పిండమున ప్రాణము, బ్రహ్మాండమున వాయువు తమ స్వీయ కర్మలను చేస్తున్నాయి. అంతటా ఉండి వెలుగు తూ, అన్నింటినీ అందజేస్తున్న ఆ పరమ పురుషుని ఈ మనుష్యులు గుర్తించరు. ఈ అన్నం ఆ దేవత కొరకే. ఆ ప్రాణ రూప బ్రహ్మము కొరకే నేను అన్నము అర్థించాను. కానీ మీరు ఇవ్వలేదు. మీరు అన్నం ఇవ్వనిది నాకు కాదు. ఆ ప్రాణరూప బ్రహ్మానికి.
”ప్రాణమనేది విశ్వమంతా వ్యాపించి వున్నది. ఆ ప్రాణానికి నైవేద్యంగా మీరు అన్నం వండారు. ఈ ప్రపంచం లో నేను కూడా ఒక భాగమే. అంటే నాలో కూడా ప్రాణము న్నది. మీరు ఉపాసించే పరబ్రహ్మ ప్రాణ రూపంలో మీలో వున్నది. అదే నాలో కూడా వున్నది. అలాంటప్పుడు ఆకలి తో వున్న బ్రహ్మచారి రూపంలో మీ ఉపాసన దైవమైన వాయుదేవుడే మిమ్మల్ని భిక్ష అడుగుతుంటే మీరు ఎందుకు లేదంటున్నారు?” అని ప్రశ్నించాడు బ్ర#హ్మచారి.
ఈ వివరణకు ఆశ్రమంలోని ఋషులు చాలా సంతో షించారు. ”నువ్వు చెప్పింది ముమ్మాటికీ సత్యం” అన్నారు.
”ఋషీశ్వరులారా! నాకు భిక్ష పెట్టకుండా పొమ్మంటే, నాలో వున్న ప్రాణాన్ని అంటే మీ ఆరాధ్య దైవాన్ని తిరస్కరిం చినట్లే కదా! మీరు ఎవరికోసం అన్నం వండారో ఆ దేవునికే ఆహారం ఇవ్వననడం న్యాయమేనా?” అన్నాడు బ్రహ్మ చారి. ఆ మాటలకు ఋషీశ్వరులకు జ్ఞానోదయం అయిం ది. వెంటనే లేచి గౌరవంగా ఆ బ్రహ్మచారిని లోపలికి తీసు కుని వచ్చారు. దేవత యొక్క బాహ్యరూపాన్నే కాకుండా, ఆంతర్యం తెలుసుకుని ఆరాధించాలి. అని అర్ధం చేసుకున్న వారై బ్రహ్మచారికి భోజనం పెట్టి పంపారు.
ఆకాశంలో వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథ్వి. పంచభూతాల సృష్టి క్రమమిది. పృథ్వి నుండి ఔషధులు, ఓషధుల నుండి అన్నం, అన్నం నుండి ప్రాణం ఉద్భవించాయి. అన్నమే ప్రాణం. అందుకే అన్నాన్ని పరబ్ర#హ్మంగా భావించాలి. ప్రాణ, శరీరాల రక్షణ జరిగితేనే మానవుడు సాధకుడు కాగలుగు తాడు. అదే నిజమైన ఉపాసన. అందరిలోనూ ఉండే జీవా త్మే ఆ పరమాత్మ అని.. ఆ పరమాత్మే అన్నాన్ని గ్ర#హస్తున్నా డని, కాబట్టి అన్నార్తులకు లేదనకుండా అన్నం పెట్టాలని తెలియచేప్పే కథ ఇది.
– భువనేశ్వరి మారేపల్లి, 9550241921

Advertisement

తాజా వార్తలు

Advertisement