Monday, April 29, 2024

Spl Story: రీసెర్చ్​లో టాప్ స్పీడ్​​.. చైనా స్సేస్ ​స్టేషన్​​ షురూ, ప్రపంచ పెద్దన్న కావాలన్న ఆశ!

టెక్నాలజీ ఉంటే చాలు.. దేన్నైనా బీట్​ చేయొచ్చన్నది ఇప్పుడు పలు దేశాలు అనుసరిస్తున్న విధానం. ఇక ముందు వార్​ఫేర్​ కానీ, మరే విధమైన పోటీ అయినా అంతరిక్ష ప్రయోగాలతోనే ఉండబోతోందన్నది స్పష్టమవుతోంది. ఇప్పటికే  పలు దేశాలు స్పేస్​ రీసెర్చ్​పై ఫోకస్​ చేస్తున్నాయి. అందులో అమెరికా టాప్​ వన్​లో ఉండగా.. ఆ లెవల్​ని దాటెయ్యాలని చైనా ప్లాన్​ చేస్తోంది. ఇందులో భాగంగా స్పేస్​ స్టేషన్​ నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే రెండు భాగాలు కంప్లీట్​ అయిన ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (టియాంగాంగ్​) ఈ ఏడాది అక్టోబర్​ నాటికి మూడో మోడ్యుల్​ని కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాసా ప్రయోగించిన హబుల్​ స్పేస్​ టెలీస్కోప్​ కంటే 350 రెట్ల వ్యూ సామర్థ్యం కలిగిన స్సేస్​ టెలీస్కోప్​ని ప్రయోగించేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా అమెరికాకు చెందిన నాసా ఇంటర్నేషనల్​ స్సేస్​ స్టేషన్​ (ISS)కు దీటుగా టియాంగాంగ్​ని నిర్మించి ప్రపంచ పెద్దన్న కావాలని చైనా ఉవ్విళ్లూరుతోంది.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో కీలక దశకు చేరింది. ప్రయోగాల కోసం స్పేస్​ స్టేషన్​ నిర్మాణంలో ఇంకో అడుగు ముందుకు వేసింది. చైనా ఆస్ట్రోనాట్స్​ ఇవ్వాల (సోమవారం) మొదటిసారి చైనా అంతరిక్ష కేంద్రం యొక్క కొత్త ల్యాబ్ మాడ్యూల్‌లోకి ప్రవేశించారు. ఈ ఏడాది చివరి నాటికి కక్ష్య అవుట్‌పోస్ట్ ను పూర్తి చేసే దిశగా ఒక ప్రధాన అడుగు పడే అవకాశం ఉందని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.

ఇక.. మార్స్, చంద్రునిపై రోబోటిక్ రోవర్‌లను ల్యాండ్ చేసిన చైనా.. తదుపరి ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది ఆ దేశ కిరీటంలో మరో ఆభరణంగా ఈ స్టేషన్ పేర్కొంటోంది. మానవులను కక్ష్యలో ఉంచిన మూడవ దేశంగా చైనాకి గుర్తింపు దక్కింది. అయితే.. ఈ స్పేస్​ స్టేషన్​ పూర్తయిన తర్వాత వాహక నౌక (రాకెట్​) తియాంగాంగ్ — లేదా స్వర్గపు రాజభవనంగా పేర్కొనే అంతరిక్ష ప్రయోగశాలలో – ముగ్గురు వ్యోమగాములు తిరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ నిత్యం ఒక టీమ్​ ఉండేలా చైనా ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ఇక్కడ నిరంతరం శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించేలా చైనా ముమ్ముర యత్నాలు చేస్తోంది.  

తియాంగాంగ్ కు చెందిన మూడు ప్రధాన విభాగాల్లో రెండవది అయిన వెంటియన్ నిర్మాణం పూర్తి అయ్యింది. దక్షిణ చైనా నుండి లాంచ్​ చేసిన రాకెట్​ సోమవారం స్టేషన్ యొక్క కోర్ మాడ్యూల్ టియాన్హేతో కనెక్ట్​ (డాక్) అయ్యింది. జూన్ నుండి కోర్ మాడ్యూల్‌లో ఉంటున్న ముగ్గురు ఆస్ట్రోనాట్స్​ టియాన్హేతో డాకింగ్ చేసిన కొన్ని గంటల తర్వాత హాచ్‌ని తెరిచి వెంటియన్‌లోకి ప్రవేశించారు. చైనా బ్రాడ్‌కాస్టర్ CCTV దీనికి సంబంధించిన ఫుటేజీని చూపించింది. నీలిరంగు జంప్‌సూట్‌లు ధరించిన చైనా వ్యామోగాములు కెమెరా ముందు నిల్చుని సెల్యూట్ చేసే వీడియోతో పాటు.. ప్రకాశవంతమైన మాడ్యూల్ చుట్టూ తేలుతూ కనిపించారు.

- Advertisement -

ఇక.. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో మొక్కల పరిశోధన, పండ్ల ఈగలు, జీబ్రాఫిష్‌ల వృద్ధి వంటి ప్రయోగాలతో సహా.. లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ పరిశోధనలపై వెంటియన్ దృష్టి సారించనుంది. కాగా, మాడ్యూల్‌లో ముగ్గురు అదనపు వ్యోమగాములు ఉండేందుకు కూడా ప్లేస్​ ఉంటుందని తెలుస్తోంది.

సిబ్బంది ట్రాన్సిసన్​ సమయంలో ఆరుగురు ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. మూడవ, చివరి మాడ్యూల్ మెంగ్టియాన్ అనే పేరు గల మరొక ల్యాబ్ అక్టోబర్‌లో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. టియాంగాంగ్ పూర్తయిన తర్వాత కనీసం 10 సంవత్సరాల పాటు భూమికి 400-450 కిలోమీటర్లు (250-280 మైళ్లు) తక్కువ కక్ష్యలో ఉంటుందని భావిస్తున్నారు. నాసా పంపిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ కంటే 350 రెట్లు వ్యూ ఫీల్డ్ కలిగిన స్పేస్ టెలిస్కోప్‌ను ప్రయోగించాలని చైనా యోచిస్తోంది.

కాగా, ప్రయోగించనున్న టెలిస్కోప్ కూడా టియాంగాంగ్(అంతరిక్ష ప్రయోగ కేంద్రం) మాదిరిగానే అదే కక్ష్యలో ఉంటుంది. అవసరమైనప్పుడు ఫ్యుయల్​ నింపుకోవడానికి, సర్వీసింగ్ చేయడానికి స్టేషన్ దానితో డాక్ చేయడానికి అనుమతిస్తుంది. అంతరిక్ష ప్రయోగాలలో ప్రపంచ శక్తిగా తన స్థాయిని చాటుకోవాలన్న కాంక్షతో చైనా అంతరిక్ష ప్రయోగాలకు, అన్వేషణకు బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోంది. మొదటి చైనీస్ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం, ఆ తర్వాత చంద్రుని యొక్క అవతలి వైపున చారిత్రాత్మకమైన మొదటి నియంత్రిత ల్యాండింగ్, అంగారక గ్రహం యొక్క ఉపరితలంపైకి రోవర్‌ను పంపించడంతో సహా ఈ 20 ఏళ్లలో తన కార్యక్రమాలను స్పీడప్​ చేసి.. విజయవంతంగా నిర్వహిస్తోంది. 

కాగా, సిబ్బంది ఉండే అవుట్‌పోస్ట్ కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి అనేక మిషన్‌ల తర్వాత ఈ సంవత్సరం టియాంగాంగ్‌ (అంతరిక్ష ప్రయోగ కేంద్రం) పూర్తి చేయడానికి రెడీగా ఉంది. ఈ స్పేస్​ స్టేషన్ పూర్తయినప్పుడు అమెరికాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో నాలుగింట ఒక వంతు చుట్టూ 90 టన్నుల బరువు ఉంటుందని అంచనా వేశారు. అయితే.. ఇంటర్నేషనల్​ స్పేస్​ సెంటర్​ (ISS)తో యునైటెడ్ స్టేట్స్, రష్యా, కెనడా, యూరప్, జపాన్ మధ్య సహకారం 2024 తర్వాత ముగియాల్సి ఉంది. అయినా 2028 తర్వాత కూడా ISS పని చేయగలదని NASA పేర్కొంది.

నాసా వారి అంతరిక్ష ప్రయోగ కేంద్రం ISS, చైనా వారి అంతరిక్ష ప్రయోగ కేంద్రం టియాంగాంగ్​ కంపారిజన్​ ఇమేజ్​
Advertisement

తాజా వార్తలు

Advertisement