Saturday, May 4, 2024

మనోవిజ్ఞానం భగవద్గీత జ్ఞానం

హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు గీతా జయంతి. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను చెప్పిన రోజు. భగవద్గీత జన్మించిన మార్గశిర శుద్ధ ఏకాదశి. ప్రపంచ వ్మాప్తంగా శ్రీకృష్ణుని భక్తులందరూ గీతాజయంతిని పండుగగా జరుపుకుంటారు.గీతలో దాదాపు 700 శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ మానవజాతికి జీవితంలో అనేక ముఖ్యమైన అంశాల గురించి జ్ఞానాన్ని అందిస్తాయి.

భారతీయతత్వం ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడన్న తత్వం. మాన సిక శాస్త్ర అధ్యయనంలో.. మిగతావారి కంటే భారతీయులే.. ఉన్నత శిఖరాలు అధిరోహంచారు. మనం మనసు తత్వం, లక్షణాలు, పరిధి, విశ్లేషణ వంటి విషయాలపై మనదేశంలో వేల సంవత్సరాలుగా అధ్యయనం సాగుతోంది.
అర్జునునితో మనసు స్వభావం, ఇంద్రియాలను అదుపు చేయడం లో… మనసు పాత్ర, చిత్తం, స్మృతి నాశనం.. తద్వారా కలిగే లాభనష్టాలు శ్రీ కృష్ణ భగవానుడు తెలిపారు. మనమనసుపై అదుపు ఉంటే మనసు మిత్రువు లేకుంటే శత్రువు. మానసిక సంఘర్షణలతో శక్తి తగ్గిపోతుంది. తిరి గి శక్తిని నింపి కార్యోన్ముఖుని చేసే గొప్ప సశాస్త్రీయ గ్రంథం భగవద్గీత.
శరీరానికి… సచ్చిదానంద స్థాయికి మధ్యవర్తి మన మనసు. భగవ ద్గీత మన కోరికలను ఏవిధంగా నియంత్రించుకోవాలో చక్కటి వివరణ. మన మనసు నియంత్రణలో ఉంటే ఏదైనా సాధ్యం. మానవుడు తన కర్త వ్యం ఆచరించకపోవడం వలన కలిగే నష్టం కంటే…. తన కర్తవ్యం కాని పనిని….కర్తవ్యంగా భ్రమపడి చేసే పని వలన చేసే వ్యక్తితోపాటు సమా జానికి కూడా తీవ్ర నష్టం.
కౌరవులు ఎన్నో అక్రమాలు చేసి ప్రజలను విపరీతమైన వేదనలకు గురి చేసి దుష్ట పాలన సాగించారు. పరిపాలనా దక్షత కలిగిన పాండవులకు రా జ్యాధికారం దక్కలేదు. అర్జునునికి అధర్మాన్ని అణచగల శక్తి సామర్ధ్యాలు ఉన్నప్పటికీ… బంధుప్రీతి, వ్యామోహం, మమకారం వంటి అనవసర ఆలోచనలు చుట్టుముట్టి కర్తవ్యం విముఖునిగా చేసి, కురుక్షేత్ర యుద్ధరం గం నుండి వెనుదిరుగుదామా అనే భావనను కలిగించాయి. పిరికితనంతో అస్త్ర శాస్త్రాలను వదిలేశాడు. తన బంధువర్గం, ఆచార్యులపైన యుద్ధం చేయడం అధర్మంగా భావించాడు. ఏది చేయదగినది? అనే ధర్మ సంకటా న్ని నివృత్తి చేసి… ధర్మ సూక్ష్మాలను బోధించి శ్రీకృష్ణ భగవానుడు అర్జును నికి ధైర్యాన్ని నూరిపో సి… తిరిగి కర్తవ్యోన్ముఖుని గావించాడు.
శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన గీతోపదేశం అన్ని కాలా లకు విశ్వజనులకు సర్వకార్యాలలో యుక్తాయుక్త విచక్షణ కలిగించే స్ఫూర్తి వంతమైన శాస్త్ర గ్రంథరాజము. ఒక వ్యక్తి, జాతి, వర్గం, వాదం, దేశం, కాలాలకు సంబంధించింది కానే కాదు. అన్ని వయసుల వారికి, ఆబాల గోపాలానికి… సాధకుల నుండి సాధువుల వరకు.. విద్యార్థి నుండి విజ్ఞాన వేత్త వరకు… సామరుని నుండి ప్రధానమంత్రి వరక .అందరికీ ఆచరణ యోగ్యమైన ఆదర్శ జీవన విధానానికి దారి చూపించే కరదీపిక భగవద్గీత.
అర్జునుడిచే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయించిన శ్రీకృష్ణుడిని మనం మన మనసులో తలుచుకొని ”దుష్ట శిక్షణ శిష్ట రక్షణ” చేసుకోవడం నేడు మనం దరి బాధ్యత. విశ్వమంతటా ధర్మసంస్థాపనకై ఆవిర్భవించిన ధర్మ ప్రబో ధం, భగవంతుని దివ్యవాణి భగవద్గీత. ఇందులో ఎన్నో నిగూఢమైన విజ్ఞాన శాస్త్ర ర#హస్యాలు దాగి ఉన్నాయి.
భావితరానికి ప్రేరణ గీతామృతధార. ప్రపంచంలోనే పేరొందిన యూనివర్సిటీలలో గీతను ప్రత్యేకంగా బోధిస్తున్నారు. గీత మత గ్రంథం కాదు విశ్వ గ్రంథం. ప్రపంచ మానవ మానసిక వ్యక్తిత్వ వికాస గ్రంథం.
పుష్పమాలవలె సకల ధర్మ సముదాయమనీ… మనలో ధైర్యాన్ని నింపే కర్తవ్యబోధ భగవద్గీత అని అన్నారు స్వామి వివేకానంద.
అత్యుత్తమ ప్రపంచ మానవ మానసిక వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత. సకల వేదోపనిషత్తులసారం భగవద్గీత. మన మానసిక భవరోగ నివారిణి భగవద్గీత. మన నడవడికను సూచించే… సరికొత్త చక్కని దారిలో మార్గనిర్దేశం చేసే భగవంతుడందించిన సూచిక భగవద్గీత.
నేటి వరకు మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు భక్తి కోసం భగవద్గీత చదివేవారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా…. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం భగవద్గీత చదువుతూ ఆచరించవలసిన గ్రంథం గా తెలుసుకుంటున్నారు. భగవద్గీత బోధను నిత్యం అనుసరిస్తూ… సమానత్వ భావనతో, ప్రపంచానికి సమైక్య శాంతి సందేశాన్ని పంపిద్దాం.
ఏ సందేశమైనా గుడిలో… బడిలో… ప్రశాంతమైన ప్రదేశంలో చెప్ప డం జరిగింది. కానీ… భగవద్గీత మాత్రం అల్లకల్లోలంగా ఉన్న యుద్ధ రంగంలో చెప్పబడింది. మానవు డిని మాధవుడిగా తయారుచేసే…. గొప్ప ధర్మగ్రంథం భగవద్గీత.
గీత చదువుదాం. అందరిచేత చది విద్దాం. గీతాజ్ఞాన జ్యోతులై వెలుగుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement