Wednesday, May 15, 2024

మహాదేవుని ప్రియ అర్థాంగి జగన్మాత!

శ్రీకృష్ణ భగవానుని దివ్య మహిమలను బ్రహ్మవైవర్త మహాపురా ణములలో చాలా విపులముగా వర్ణించడం జరిగింది. శ్రీ గణ శ్వరుడు, శివుడు, రుద్రుడు, విష్ణువు ఆదిశేషుడు బ్రహ్మాది దేవత లు, మనువులు, మునీంద్రులు, వాణి, పార్వతి, గంగ, లక్ష్మి మొదలగు వారు గోవిందుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్యచరణములను సదా స్మరించుచున్నారు. అత్యంత గంభీరము, భయంకరమునగు దావా గ్ని వంటి సంసార సాగరమును దాటుటకు మానవులు శ్రీకృష్ణుని పాద పద్మములను సదా పూజించవలెను. శ్రీహరికి దాస్యము చేసి సుఖము ను పొందుట తప్ప వేరొక మార్గము లేదు. గోవర్ధన పర్వతమును చిటి కిన వ్రేలిపై నెత్తి వ్రజ భూమిని ఇంద్రుని నుండి కాపాడిన లీలామానుష అవతారుడు శ్రీకృష్ణుడు. వరాహావతారమునెత్తి జలమున మునిగిపో వుచున్న భూమిని తన దంతాగ్రమున నిలిపి కాపాడినవాడు ఈ శ్రీకృ ష్ణాంశయైన గోవిందుడే! తన రోమకూపములందు ఈ సమస్త విశ్వ బ్రహ్మాండములను అవలీలగా ధరించినవాడు ఈ ఆదిపురుషుడైన గోవిందుడే! గోపికల ముఖారవింద భక్తి మకరందమును గ్రోలుటకు కరుణరసాభ్రమరమై బృందావనమున విహరించినవాడు ఈ శ్రీకృ ష్ణుడే! గోపవేషధారియై తన పిల్లన్రగోవిని మధురాతి మధురముగా రమింపచేసి ప్రకృతిని పరవసింపచేసిన రాసేశ్వరుడైన శ్రీకృష్ణుని సదా స్తుతించిన వారికి కలుగు సచ్చిదానందము ఈ విశ్వములోనే లేదు. పరమ పురుషుడైన శ్రీకృష్ణుడు శ్రీమహావిష్ణువు యొక్క అవతారము.
శ్రీకృష్ణుని రెప్పపాటు కాలములో బ్రహ్మ యొక్క ఆయుర్దాయ ము పరిపూర్ణమగును. శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలలు, కర్మలు వర్ణిం చుటకు వీలుకానివి. పరమ భక్తాగ్రేసరులు, యోగులు మాత్రమే కృష్ణ లీలల అంతరార్థము తెలుసుకోగలరు. ఎవరైతే నిత్యమూ కృష్ణ నా మమును జపింతురో వారికి కృష్ణ లీలలు మనోహరములై నిలిచి పర మానంద సుఖమును కలుగచేయుట నిశ్చయము.
ఈ సమస్తము శ్రీకృష్ణభగవానుని కళాంశలే! మనువులు మునీం ద్రులు, మహాదేవుడు, బ్రహ్మ ఆయన కళావిశేష అంశలే! మహా విరా ట్పురుషుడు కూడా శ్రీకృష్ణుని విశిష్ట కళయని గ్రహించవలెను.
సహస్ర శీర్షా శిరస: ప్రదేశేబిభర్తి సిద్ధార్థ సమం చ విశ్వమ్‌
కూర్మేచ శేషో మశ కోగజేయథా కూర్మశ్చ కృష్ణస్య కలాకలాంశ:
సహస్ర శీర్షుడగు ఆదిశేషువు ఆవగింజవలె సమస్త విశ్వమును తన శిరములపై నిలుపుకొనియున్నాడు. కాని అతడు మహాకూర్మము యొక్క పృష్ఠ భాగమున ఏనుగుపైనున్న దోమవలెనున్నాడు. ఆకూర్మ భగవానుడు కూడా శ్రీకృష్ణుని కళాంశయేనని తెలుసుకొనవలెను. గోలోకనాథుడైన శ్రీకృష్ణభగవానుని నిర్మల యశస్సు వేదములలోను, పురాణములలోను కూడా ప్రస్ఫుటముగా వర్ణింప సాధ్యము కాలేదు. బ్రహ్మాది దేవతలు గూడా ఆ ఆదిపురుషుని వర్ణించుటకు సమర్థులు కాదు. అటువంటి సర్వేస్వరుడైన శ్రీకృష్ణుని భజించిన వారికి ఆయన కృప వెన్నంటి వుండుననుటలో సందేహము లేదు.
సకల విశ్వాధారుడు, సనాతనుడునైన భగవానుని లోకములలో ఎందరో బ్రహ్మలు, విష్ణువులు, రుద్రులు వసించుచున్నారు. శ్రుతులు, దేవతలు కూడా వారి సంఖ్యను లెక్కించలేరు. అట్టి భగవానుడైన శ్రీకృష్ణుని ఆరాధించిన వారికి ముక్తిగాక మరేమి లభించును.
విధాతలకే విధాతయైన ఆ భగవానుడు జగత్ప్రసవినియు, నిత్య స్వరూపిణియగు ప్రకృతిని ప్రకటించి అసంఖ్యాకమైన లోకములను సృష్టించెను. బ్రహ్మాది దేవతలందరు ఆ ప్రకృతి నుండి సృజించబడిన వారే! వారు భక్తిప్రదాయిని అయిన ప్రకృతి మాతను సేవించుదురు.
బ్రహ్మస్వరూపా ప్రకృతిర్నభిన్నా
యయాచ సృష్టిం కురుతే సనాతన:
స్త్రియశ్చ సర్వా: కలయా జగత్సు
మాయాచ సర్వే చ తయా విమోహితా:
ప్రకృతి బ్రహ్మస్వరూపమే, అది బ్రహ్మముకంటె భిన్నము కాదు. ఆ శక్తి మూలమున సనాతన పురుషుడైన పరమాత్మ ఈ జగములను సృష్టించుచున్నాడు. ప్రకృతి కళల నుండియే ప్రాపంచిక స్త్రీలందరు ప్రకటితమైరి. ప్రకృతి మాయ. దానిచేతనే సర్వజీవులు మోహితులగు చున్నారు. సనాతనయగు పరాప్రకృతి నారాయణిగా చెప్పబడినది. పరమపురుషుడగు నారాయణుని శక్తియే ఈ నారాయణి. సర్మాత్ముడై ఈశ్వరుడు కూడా నారాయణి చేతనే శక్తిమయుడు అగుచున్నాడు. సృష్టి చేయుటకు ఈ నారాయణి శక్తియే కారణము. కావున ప్రకృతిని ఆరాధించిన ఆమె సంతుష్టిని పొంది ఆనందమును వర్ణింపచేయును. ప్రకృతియే స్త్రీ రూపమున త్రిగుణములను ఆపాదించుకొని రూపొం దినది. అందువలన స్త్రీలను అవమానించిన, పరాభవించిన సాక్షాత్తు ప్రకృతిమాతనే పరాభవించినట్లు! అప్పుడు ప్రకృతి యొక్క ఆగ్రహ మునకు గురికాక తప్పదు. సాధ్వియైన స్త్రీని పూజించిన సర్వమంగళ ప్రదాయని, పూర్ణ బ్రహ్మస్వరూపిణి అయిన ప్రకృతి మాత సంతృప్తి నందగలదు. ఈ ప్రకృతి మాతనే విష్ణుమాయయని జ్ఞానులైన భక్తులు కీర్తించుచున్నారు. ఆ మాయ సృష్టికి ఆదియందు ఐదు రూపములలో ఉద్భవించినది. ప్రథమురాలు శ్రీకృష్ణుని ప్రాణాధిష్ఠాత్రి శ్రీరాధాదేవి, సర్వసంపత్స్వరూపిణి శ్రీమన్నారాయణ ప్రియ శ్రీమహాలక్ష్మి, వాణిక ధిష్టాత్రి సరస్వతి, బ్రహ్మ ప్రియపత్ని, సర్వవందిత అయిన సావిత్రి, ఐదవ ప్రకృతి రూపము హరిమాయా స్వరూపము. మహాదేవుని ప్రియ అర్థాంగి జగన్మాతయగు దుర్గ. ఇక అతి అద్భుతము, రహస్య ము ఆ దుర్గాదేవియందు శ్రీకృష్ణాంశ సంభూతుడైన, సకలారాధ్యుడైన గణశ్వరుడు ఉద్భవించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement