Monday, February 26, 2024

Dasara Celebrations – ర‌జ‌నీకాంత్ నివాసంలో ఘ‌నంగా ద‌స‌రా వేడుక‌లు …హాజ‌రైన గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఇంట్లో న‌వ‌రాత్రి-ద‌స‌రా వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ప్రతి సంవత్సరం నవరాత్రులను పురస్కరించుకుని నటుడు రజినీకాంత్ ఇంట్లో ఘనంగా పండుగను జరుపుకుంటారు. రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ ఈ ఏడాది కూడా నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో వీవీఐపీలను కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే న‌వ‌రాత్రి పూజా కార్య‌క్ర‌మానికి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్ , ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, సోదరి సెల్వి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, , నటుడు విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, ఐఏఎస్ అధికారి రాధాకృష్ణన్, నటి మీనా తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement