Wednesday, May 15, 2024

మహాతపస్వినిసతీ సావిత్ర్ర్రి

భారతీయ సంస్కృతికి ఆలవాలమైన రామాయణం, మహాభా రతం, భాగవతం వంటి ఇతిహాసాలలోనే కాక, పురాణాలలో దమయంతి, సీత, సావిత్రి, ద్రౌపది, వంటి పతివ్రతలు మనకు గోచరి స్తారు. వారే మన హందూ వైవాహక సాంప్రదాయానికి మార్గదర్శ కులు. ఇటు వంటి పతివ్రతల కథలు మనకు ఆదర్శం.
పరాశక్తి వనితగా జన్మించి, పతివ్రతా ధర్మాన్ని నిర్వ#హంచి, ఇటు అత్తింటికి, అటు పుట్టింటికి ఖ్యాతి తీసుకురావడం ఒక ఎత్తు అయి తే, అల్పాయుష్కుడైన తన భర్తను పూర్ణాయుడుగా చేయడానికి యమధర్మరాజుతో సంవాదం చేసి సాధించిన ఇల్లాలు సావిత్రి కథ పరిశీలించండి. యమధర్మరాజు సావిత్రిల మధ్య జరిగిన సంభాషణ విశేషమైనది. మద్ర దేశాన్ని పరిపాలిస్తున్న అశ్వపతి అనే మహారాజు కు సం తానం లేనందువల్ల, సావిత్రీ దేవిని పద్దెనిమిది సంవత్సరాలు రాజు దంపతులు భక్తితో ఆరాధించారు. సావిత్రిదేవి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, పుత్రుడు కావాలని కోరాడు.
కాని భార్య మనసులో పుత్రిక కావాలని ఉంది. ”రాజా! నీకు త్వరలో కుమార్తె జన్మించబోతోంది” అని ఆశీర్వదించి, అదృశ్యమై పోయింది. అశ్వపతి ఆరాధించిన సావిత్రి సృష్టి ప్రథమావతారా లలో ఒకటి. లక్ష్మీ, సరస్వతి, దుర్గ, రాధిక ఇతర అవతారికలు. కూతు రు జన్మించినా, పుత్రుడు కోసం తపన పడి, మళ్ళీ సావిత్రీదేవిని ఆరా ధిస్తే, ”నీకు పుట్టిన కుమార్తె కారణజన్మురాలు. ఆమె వల్ల నువ్వు పుత్రు లను పొందగలవు. పుత్రజననం కొరకు బ్రహ్మ అనుమతి లేదు.” అని చెప్పింది. అశ్వపతి తన కుమార్తెకు సావిత్రి అని నా పేరు పెట్టారు. చాలా గారాబంగా పెంచారు. నారద మహర్షి సూచన మేరకు, ఆమె ను ద్యుమత్పేనుడు అనే మహారాజు కుమారుడు సత్యవంతుడుకు ఇ చ్చి వివాహం చేశాడు. అప్పటికే ద్యుమత్సేన మహారాజు రాజ్యాన్ని కో ల్పోయి, అడవులలో తపస్సు చేస్తూ జీవిస్తున్నారు. సావిత్రి అంద మైన ఆభరణాలు, వస్త్రాలు మున్నగు వాటిని ధరించే హొయలు పరి త్యజించి నారచీరలు ధరించి, భర్తకు, అత్తమామలకు సపర్యలు చేయసాగింది. సావిత్రికి నారద మహర్షి చెప్పిన తన భర్త ఆయు:ప్ర మాణం, కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉందని గ్రహంచిన ఆ మె, తపోదీక్షతో, త్రిరాత్రోపవాస వ్రతం ఆచరించింది. చివరకు తన భర్త ఆయు:ప్రమాణం తీరే రోజురానే వచ్చింది. సత్యవంతుడు సమి ధలు, దర్భలు, పండ్లు,తేవడానికి వెడుతూంటే, సావిత్రి అత్తమామ ల ఆశీర్వచనం పొంది కూడా వెళ్ళింది. అలసిపోయిన సత్యవంతుడు నిద్రకు ఉపక్రమించే సందర్భంలో, యముడు వచ్చాడు.
సావిత్రి తన యోగ దృష్టితో వచ్చినది యమధర్మరాజు అని గుర్తించింది. ”సావిత్రీ! నేను యమధర్మరాజును. నీవు తపో నిష్ఠురా లవు. మహాపతివ్రతవు.సావిత్రీ అంశ సంభూతురాలవు. కాబట్టి ను వ్వు నన్ను దర్శించగలుగుతున్నావు. నీ భర్త సత్యవంతుడు ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యాత్ముడు. కాబట్టే, నేనే స్వయంగా వచ్చా ను.” అంటూ ప్రాణాలనుతీసుకుని బయలుదేరాడు. సావిత్రి వెంటప డబోతే ”నువ్వు ఎక్కడికి? రాలేవు. సావిత్రి! మానవుడు కర్మాను సారంగా జీవిస్తాడు. కర్మాను సారంగానే మరణిస్తాడు. సుఖదు:ఖాలు అన్నీ కర్మఫలాలే. కర్మ బంధం ఎవరికైనా తప్పదు కదా! బ్రహ్మాది దేవ తలు కూడా కర్మబద్ధులే. ఏది సిద్ధించాలన్నా కర్మానుసారంగానే జరు గుతాయి.” అని చెప్పి ముందుకు వెళ్ళబోగా, సావిత్రి ”యమధర్మ రాజా! కర్మకు హతువేంటి? ఏ కర్మచేస్తే ఏఏ జన్మ లభిస్తుంది? జ్ఞానం అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి? అసలు ప్రాణం అంటే ఏమిటి? దేవతలు ఎవరు? ఈ సందేహాలకు సమాధానం ఇవ్వండి.” అని ప్రశ్న లను సంధించింది. అపుడు యముడు.
”ఓ! సాధ్వీ! వేదం ఏది చెబితే అదే ధర్మం. ఏది ఆచరించమంటే అది కర్మ. మంగళ ప్రదమైంది. వేదోక్తంకాని కర్మలు అమంగళకరం. నిష్కామంగా దైవకార్యాలను చేయడమే కర్మ నిర్మూలనోపాయం. అ దే ఉత్తమ భక్తి. నిర్లిప్తంగా కర్మఫలాలను అనుభవించేవాడు బ్రహ్మ జ్ఞాని. అతడే ముక్తుడని వేదం చెబుతోంది. అతడికి జన్మ- మృత్యు జరావ్యాధి శోకాలు ఉండవు. భక్తి రెండురకాలు. ఒకటి నిర్వాణ పదం. రెండవది హరిరూప ప్రదం. బ్రహ్మజ్ఞాన స్వరూపులైన యోగీ శ్వరులు, మహర్షులు, మొదటి రకం భక్తి కోరుకొంటారు. వైష్ణవులు రెండవది అభిలషిస్తారు. భగవంతుడు అంటే కర్మ స్వరూపుడు. అత డే కర్మకు బీజం. కర్మఫలప్రదుడు అతడే.
నివృత్తియే ముక్తి. వివేచనా శక్తియే బుద్ధి. అదే జ్ఞానానికి మూ లం. ఇక ప్రాణమంటే ఏమిటి? అని అడిగావు. ప్రాణం అంటే వాయు భేధాలు. ఈ పంచప్రాణాలు దేహధారులకు బలప్రదాలు. ఇంద్రియా లకు ప్రభువై ఈశ్వరాంశమై కర్మల కు ప్రేరేపితమైన, అనూ#హ్యంగా, అదృశ్యంగా ఉండే జ్ఞాన భేదాన్నే మనసు అంటారు. జ్ఞానేంద్రియాలు ఐదు కర్మ ప్రేరకాలు. అవే మిత్రులు.అవే శత్రువులు. అవే సుఖప్రదా లు.అవే దు:ఖప్రదాలు. సూర్యుడు వా యువు, పృథ్వి, బ్రహ్మాదులను అదిష్టాన దేవతలు అంటారు. ప్రాణాలతో ఉండే దేహని జీవుడు అం టారు. జీవుడికి ఆయువు తీరగానే ఊర్థ్వ లోకాలు చేరి కర్మ ఫలాలు అనుభవించి, మరో జన్మ ఎత్తుతారు. నీవు అడిగావు, కాబట్టి కొంత వరకు బ్రహ్మ జ్ఞాన విషయాలను బోధించాను. సుఖంగా తిరిగి ఇంటి కి వెళ్ళు!” అని యముడు ముందుకు సాగుతుంటే, వెనకాలే వెంబడి స్తున్న సావిత్రిని చూసి పతి ప్రాణములు తప్ప ఏదైనా వరాలు కోరు కోమంటే , ముందుగా అత్తమామ లకు దృష్టికలగడం, శత్రువశమైన రాజ్యాన్ని తిరిగి కల్పించడం, అటుపిమ్మటే తన తండ్రికి పుత్ర సంతా నం కలగాలని కోరుకొంది. ఇంకా వెంటపడుతున్న సావిత్రిని ”ఇక నుండి రాలేవు. వెనక్కి వెళ్ళు అంటున్నా, సావిత్రిని ఇక వదిలించుకో వాలని భావించి, సావిత్రి! ఆఖరుగా నీకొక వరంఇస్తాను. కోరుకో” అనగానే, ఇంతకు ముందు అన్నట్టు, భర్త ప్రాణం. తప్ప అని అనలే దు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, భర్త ప్రాణాలను, సం తానాన్ని కోరుకొంటే, తన పొరపాటు గ్ర#హంచిన యమధర్మరాజు సత్యవం తుడును సజీవుడ్ని చేసాడు. ఒక ఇల్లాలుగా, ముందు తన అత్తింటి వారి క్షేమం, తదుపరి పుట్టింటి క్షేమం కోరు కొంది. అదే ధర్మం.

Advertisement

తాజా వార్తలు

Advertisement