Thursday, May 9, 2024

భక్తులను ఆదుకుంటాం

తిరుమల , పభన్యూస్‌ : భారీ వర్షం కారణంగా శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన‌ భక్తులకు తిరుమల – తిరుపతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస, అన్నప్రసాదాలు తదితర ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. ఆయన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్‌రోడ్డులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో విలేకరులతో మాట్లాడుతూ కొందరు పనిగట్టుకుని ఇతర ప్రాంతాలో తీసిన వీడియోలు, ఫోటోలను తిరుమలలో తీసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి భయాందోళనలకు గురి చేస్తున్నారని, భక్తులు వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్‌రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలను తొలగించి శుక్రవారం ఉదయం రాకపోకలను పునరుద్ధరించినట్లు తెలిపారు. తిరుమల నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి తిరుమలకు ఈ మార్గంలోనే వాహనాలను అనుమతిస్తున్నట్లు వివరించారు. రెండో ఘాట్‌రోడ్డులో కొంచరియలు తొలగింపు పనులు పూర్తయ్యాయని, రోడ్డును శుభ్రం చేసిన అనంతరం భక్తులను అనుమతిస్తామని చెప్పారు.తిరుమలలో ఉన్న భక్తులు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, వర్షం తగ్గితనం వరకు గదుల్లోనే ఉండాలని, అందరికి అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement