Saturday, May 4, 2024

తీర్థ కాక న్యాయము

తీర్థము అంటే నది రేవు జలస్థానము, పవిత్ర స్థానము, యాత్రాస్థలము అనే అర్థాలు ఉన్నా యి. తీర్థ కాకము అంటే నీటి కాకి. కాకి ఎన్ని తీర్థములలో మునిగినా పుణ్య ఫలము పొందలేదు అనే అర్థంతో చెప్పుకోవడానికి ఈ తీర్థ కాక న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు. ఇక్కడ పేరు కాకిది అయినా అసలు ఉద్దే శించి చెప్పింది మనుషుల గురించేనని అర్థం చేసుకోవచ్చు.
పవిత్రమైన నదుల్లో మునిగి స్నానాలు చేస్తే అప్పటివరకు చేసిన పాపాలు హరించి పోతా యని భక్తుల విశ్వాసం. తెలిసీ తెలియకుండా ఏం పాపాలు చేశామో అవి పోగొట్టుకుందామని నిష్ట గా, భక్తితో తీర్థయాత్రలు చేసే వారు కొందరైతే నిత్యం అనేక తప్పులు, చెడ్డ పనులు చేస్తూ ‘దాసుని తప్పు దండంతో సరి’ అన్నట్లుగా తీర్థయాత్రలకు వెళ్ళి తీర్థ స్నానాలు చేస్తూ ఉంటారు. అలా తిరి గి పాపాలు పోగొట్టుకోవాలని ప్రయత్నించే దుష్టుల గురించి వేమన నిరసనగా ఇలా అంటాడు

”ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను

హనుడవగుణంబు మానలేడు

బొగ్గు పాల గడుగ బోవునా నైల్యంబు
విశ్వదాభిరామ వినుర వేమ! ”

- Advertisement -

ఎంత చదువు చదివినా, యె న్ని మంచి మాటలు విన్నా #హన మైన గుణం కలిగిన వ్యక్తి మారడు. ఎలాగంటే బొగ్గును పాలతో కడి గితే తెల్లగా మారదు కదా!
అలా కొందరు తప్పులు కప్పి పుచ్చుకోవడానికి చేసి తీర్థయాత్ర లు స్నానాల వల్ల వారికి ఎలాంటి పుణ్యంరాదు అనే అర్థంతో ఈ తీర్థ కాక న్యాయమును చెబుతుం టారు.
మరో కోణం చూద్దాం. కొంద రు తమ పితృదేవతలకు మోక్షప్రాప్తి, ఉత్తమ గతులు కలగాలని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పనిలో పనిగా తమ పితృదేవతలకు తర్పణాలు వదులుతూ పిండ ప్రదానం చేస్తారు. అవి కాకులు తింటే తాము చేసింది నెరవేరినట్లుగా భావిస్తారు.
కాకులను పితృదేవతల ప్రతినిధులుగా భావించడం అనేది భారతీయుల్లోని చాలా మందిలో నెలకొన్న బలమైన నమ్మకం. అందుకే మరణించిన వ్యక్తికి పన్నెండు రోజుల కర్మలు చేసేటప్పుడు పిట్టకు వేయాలని మరణించిన వ్యక్తికి బతికుండగా ఇష్టమైన వంటకాలు అన్నీ చేసి ఊరు బయట పక్షులు తిరిగే చోట పెడతారు. ఏ పక్షులు అటుగా రావు కానీ కాకులు వచ్చి తిని పోతుంటాయి. కాకి ముట్టింది అంటే చనిపోయిన వ్యక్తికి కోరికలు ఏమీ లేవనీ, సంతృప్తిగా పోయాడనీ, కాకి ముట్టకపోతే ఆ వ్యక్తి కోరికలు తీర లేదు ఆత్మ ఇంకా ఇక్కడే కొట్టుకులాడుతుంద ని అనడం వింటుంటాం.
ఏదిఏమైనా కాకికి ఆహారం వెతుక్కునే పనిలేకుండా ఉచితంగా ఆహారం దొరుకుతుంది. అలాగే అలాంటి ప్రదేశాలలో కొందరు తమకు శ్రాద్ధకర్మలు చేయించడం వచ్చని చెప్పి అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటారు. యాత్రికుల నమ్మకాన్ని తమకు అనుకూలం గా మార్చుకుని వారితో అలాంటి కార్యక్రమాలు చేయించి వారి నుం డి డబ్బు ఇతర దానాలు పొందుతూ ఉంటారు.
ఇలా తీర్థ ప్రదేశాలలో ముక్తి కోసం కొం దరు, పితృదేవతలను సంతృప్తి పరచాలని కొందరు, అక్కడ ప్రత్య క్షమై డబ్బు, దానాలను పట్టే వారు కొందరు అలాంటి వారందరినీ ఉద్దేశించి ఈ తీర్థకాక న్యాయమును ఉదాహ రణగా చెప్పు కోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement