Sunday, May 19, 2024

జ్ఞానామృతం


మానవ చిత్తాన్ని నిత్యం అనేక సమ స్యలు పట్టి పీడిస్తూ వుంటాయి. మనసు చంచలమై పనిమీద ఏకాగ్రం కాదు. సరిగ్గా అప్పుడు మనం ఆధ్యాత్మిక చింతన చేయాలి. అన్ని చింతనలను సంపూ ర్ణంగా నివారించి నిర్మూలించగలిగేది ఈ ఆధ్యాత్మిక చింతన.
ప్రవాహానికి అడ్డుకట్ట పడినట్లు ఆలోచనా ప్రవాసునికి అడ్డువేసేది ఈ ఆధ్యాత్మిక చింతన మాత్రమే.శ్రద్ధా సాధన వలన ఇది ఎవరైనా సాధించవచ్చు. అనవసర విషయాలను గూర్చి గతించిన దాని గురించి చింతిస్తూ కొందరు కాలాన్ని వృధా చేస్తారు. దీనివలన ఈ సమస్య తీరకపోగా ఇలా తీవ్రమగును. అదే కాలాన్ని అదే చింతనని భగవత్‌ నామం పైనో భగవత్‌ రూపంపైనో మరలిస్తే ఏ చింతా వుండదు. భక్తి జ్ఞాన మార్గాలు మనోవికారాలను తొలగించు ద్వారాలు. తీర్థయాత్రలు, భజనాదులు, సంకీర్తనలు మొదలగునవన్నీ మనసుని దారి తప్పకుండా దైవమార్గంలో నడిపించు సాధనాలు. మనసు చంచల మైనది. ఆ అచంచలమైన మనసుని స్థిరమైన శాశ్వతమైన నిత్యమైన సత్యమైన భగవత్‌ నామంతో విలీనం చేయాలి. మొదట మనసు ఈ విధానంలోకి రావడానికి అంగీకరించదు. కానీ నిరంతరం నియమబద్ధతతో పట్టుదలగా ప్రయత్నిస్తే మనసు మన ఆధీనమవుతుంది. మనకు అనుకూలంగా మారిన మనసుని కొంతకాలంపాటు జ్ఞాన గంగలో ముంచెత్తాలి. జ్ఞానామృతాన్ని నిత్యం ఆత్మకు మనసు ద్వారా అందివ్వాలి. మనసును నియంత్రించుటకు ఎన్నో సాధనాలున్నాయి. కానీ అన్నిటికన్న సులువైనదీ తేలికైనదీ భక్తిమార్గమే. ఆత్మలో గత జన్మల తాలూక ఆధ్యాత్మిక చింతన అనేది చింతగింజ అంత అయినా వుండి వుండాలి. అలా వున్నవారు మహా యోగులు, జ్ఞాన గురువులు. సాధన వలన సామాన్యుడు సైతం అనంత జ్ఞానాన్ని పొందవచ్చు. నేనెవరు అనే తపన రమణ మహర్షిని గొప్ప యోగిని చేసింది. మన మనసుపైనా భక్తితో ఆధ్యాత్మిక చింతన చేయాలి. మనసుని ఆత్మతో ఏకం చేయాలి. అందుకు నామస్మరణని లేక జపాన్ని లేక ధ్యానాన్ని ఆసరా చేసుకోవాలి. కళ్లలో స్తోత్రాలు పారాయణం మనసులో జపం వాక్కుతో దైవనామం. ఈ మూడింటి వలన మనసులో పేర్కొన వికారాలు తొలగిపోతాయి. భక్తిబీజాలు వికసించి జ్ఞాన పుష్పాలు వికసిస్తాయి. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో సమస్యలను, సంఘ ర్షణలను తట్టుకుని వాటిని ఎదురించే శక్తిని ప్రసాదించేది అసలైన భక్తి. అణువణువు విడిపోయి బలహీనమైన మనసులను సులువుగా చేరుటకు భగ వంతుడికి అనేక రూపాలు- అనేక నామాలు. బలమైన మనసు బలమైన ఆత్మతో యుతి చెందితే అన్నిటా అంతటా ఒకటిగా మారును. అదే భిన్నత్వంలో ఏకత్వం. అదే సత్యం. అదే నిత్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement