Friday, December 6, 2024

Bharat Jodo Yatra : జోడో జోష్‌… యూపీలో రాహుల్ యాత్ర‌..

రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. ఎక్క‌డికి వెళ్లినా వేల సంఖ్య‌లో జ‌నం రాహుల్ గాంధీ యాత్ర‌లో భాగ‌స్వాములు అవుతున్నారు. ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు సైతం రాహుల్ జోడో యాత్ర‌లో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాల గుండా ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో ఘజియాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. రాహుల్‌ రాక కోసం సిద్ధమవుతున్న కార్యకర్తల సందడితో రోడ్లన్నీ నిండిపోయాయి. పట్టణంలో ఎటుచూసినా కాంగ్రెస్‌ జెండాలే దర్శనమిస్తున్నాయి. యాత్ర‌లో బీజేపీ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌ను ఎండ‌గ‌డుతున్నారు. ప్ర‌జ‌లను ఏకం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా రాహుల్ యాత్ర కొన‌సాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement