Sunday, May 19, 2024

జగద్గురువు

శ్రీ ఆదిశంకరాచార్యులు… మనకు ఎన్నో ధర్మమార్గాలు… ఆధ్యాత్మిక భక్తిమార్గాలు… వెూక్ష మార్గాలు ఉపదేశించారు. దశాబ్దాలుగా ఆయన అందించిన స్తోత్రాలు, లలితాభాష్యం, సౌందర్యలహరి, శివానందలహరి వంటి గ్రంథాలు ఇప్పటికీ అనుసరించబడుతున్నాయి. వైశాఖ శుద్ధ పంచమి (నేడు) ఆ జగద్గురువు జయంతి సందర్భంగా స్మరించడం మన కర్తవ్యం.

అది కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో అగ్ర హారం. ఒక ఇంటిముందు ఒక వటువు (బ్రహ్మ చారి) ఆగి ”భవతీ భిక్షాం దేహ” అన్నారు. ఆ గృహంలో ఉన్న ఇల్లాలు మాసిన, చిరిగిన బట్టతో బయ టకు వచ్చి, వచ్చిన వటువుతో ”నాయనా! మేము కడు పేద వారము. నా పెనిమిటి గ్రామంలో యాయవారానికి వెళ్ళా రు. మీ వంటి యోగ్యులను పూజించడం ధర్మం. నా వంటి నిర్భాగ్యురాలికి మీ వంటి వారిని గౌరవించే, దానంచేసే మహాభాగ్యమెట్లు సంప్రాప్తించును?” అంటూ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న ఒకేఒక ఉసిరికాయ తెచ్చి ఆ బ్రహ్మచారి భిక్షాపాత్రలో వేసింది. ఆమె బీదరికాన్ని గమనించిన వటు వు చలించిపోయి, ఆమెకు సంపదలు కలుగ చేయాలని ”కనకధారా స్తోత్రం” స్తుతించి వెళ్ళిపోగా, ఆ ఇంట బంగా రు ఉసిరికాయల వాన కురిసింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయి, ఇదంతా ఆ వటువు వల్లే జరిగిందని తలపోసారు. వచ్చిన వటువు ఎవరో కాదు. శంకరుడే!
శంకరాచార్యులు వారు పరమాత్మ ”శ్రీ వృషాధీశ్వరు ని” అనుగ్రహం వల్ల జన్మించారు. శివగురువు ఆర్యాంబ దంపతులు సంతానం కొరకు ‘వృషభాధీశ్వరుని’ ఆరాధిం చే వారు. ఒకరోజు. రాత్రి పరమాత్మ బ్రాహ్మణ వేషంలో శివ గురువుకు కలలో కనిపించి, దుర్మార్గుడు, మూర్ఖుడు అయి దీర్ఘాయుష్‌ కలిగిన కొడుకు కావాలా? సద్గుణ సంపన్నుడు, వేదపండితుడు, మంచివాడు అల్పాయుష్కుడైన కొడుకు కావాలా? అని అడిగితే, అప్రయత్నంగానే, అల్పాయుష్కు డైనా, సద్గుణ సంపన్నుడైన పుత్రుడే కావాలని, కోరగా, వృషభాధీసుడు ‘తథాస్తు’ అని దీవించి అదృశ్యమయ్యా రు. తెల్లవారగానే, ఈ విషయాన్ని భార్యకు చెప్పి, నిష్ఠతో అనుష్టానాన్ని, తపస్సు కొనసాగిస్తుండగా, కొద్దిరోజులకు ఆర్యాంబకు శుభ గ్రహవేళ పుత్ర జననం కలిగింది. శంకరు ని ఆశీస్సుల వల్ల కలిగినందుకు, ఆయనకు శంకరాచార్యు లు అని నామకరణం చేసారు. రెండవ ఏటనుండే సంస్కృ తం నేర్చుకోవడం ఐదవ ఏట ఉపనయన సంస్కారాలు చేసి, తండ్రి వద్దే వేద వాఙ్మయం నేర్చుకొన్నాడు. అనారో గ్యంతో తండ్రి శివగురువు శివాయుజ్యం పొందారు. ఆర్యాంబే శంకరుడుని పెంచి పెద్ద చేసింది. కొంత వయస్సు రాగానే వేదములు, ఉపనిషత్తులు సారాన్ని నేర్వడానికి గురువును వెదుక్కొంటూ వెళ్ళగా, నర్మదా నది ఒడ్డున ఉన్న చిన్న కొండగు#హలో జ్ఞాన సమాధిలో ఉన్న గోవింద భగవత్పాదుల వద్దకు వచ్చారు. శంకరులు. ఆయనకు నమస్కరించగా, ఆయన ”నువ్వు ఎవరవు?” అని ప్రశ్నిం చారు. అప్పుడు శంకరులు-—”నేను నింగిని కాదు. భూమి ని కాదు. నీటిని కాదు. అగ్నిని కాను. గాలిని కాదు. ఎటు వంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలులేని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారా న్ని” అన్నారు. అప్పుడు గోవింద భగవత్పాదులు జ్ఞాన సమాధి నుండి చూసి- ”సప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్‌” అన్నారు. అంటే సాక్షాత్తు భూమికి దిగివచ్చిన శంకరుడేనా? ఈ బాలుడు. అంటూ ఆశ్చర్యంతో పలుకగా, శంకరులు ఆయనకు పాద పూజ చేసారు. గోవింద భగవ త్పాదులవారు శిష్యునిగా స్వీకరించి, బ్రహ్మజ్ఞానాన్ని, ఉప నిషత్తుల సారాన్ని, ఆత్మ తత్త్వాన్ని బోధించారు.
శంకరాచార్య విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, ఇంటికి తిరిగి వచ్చాక తల్లి వివాహం చేసుకోమంటుంది. శంకరు లు తల్లికి నమస్కరించి ”తల్లిd! జీవితం క్షణభంగురం. వ్యాధులతో కూడి ఉంటుంది. పెండ్లాము దు:ఖం. సంతా నం దు:ఖం. తర్వాత సంబంధాలతో దు:ఖము. ఇలా సం సారం నానాటికి దు:ఖమయమే. ఈ విషయాలన్నీ తెలిసిన నీవు వివాహం చేసుకోమంటున్నావు.” అని నిరాకరిస్తారు.
శంకరాచార్యులు పుట్టక మునుపున్న శైవమతం, బౌద్ధమతం, వైష్ణవమతం, శాక్తా మతం, సౌరమతం, అగ్ని మతం, హరణ్యగర్భ మతాల వంటి అనేక మతాలను ఖం డించారు. వైష్ణవ, శైవ మతాల మధ్యన జరుగుతున్న ఆధి పత్యం పోరును ఖండించారు. అప్పుడే ఆయన ‘అద్వైత మత’ సిద్ధాంతమును ప్రతిపాదించారు. అద్వైతము అంటే రెండు కానిది అని అర్థం. ఆత్మ స్వరూపమే పరమాత్మ అని బోధించారు. అద్వైత మత ప్రచారం, ప్రజలలో భక్తి తత్త్వా న్ని బోధించడానికి నాలుగు చోట్ల ,పీఠాలు స్థాపించారు.
తూర్పున పూరీలో ఋగ్వేదం ప్రధాన మెన ”జగన్నా థ పీఠం, దక్షిణాన యజుర్వేద ప్రధానమైన శారదా పీఠాన్ని శృంగేరీలో, పడమరలో సామవేదం ప్రధానంగా ద్వారక లో, ఉత్తరాన బదరీలో అధర్వణవేదం ఆధారంగా పీఠాన్ని స్థాపించారు. ఆయా పీఠాలకు, తన శిష్యులనే పీఠాధిపతి గా నియమించారు.

  • అనంతాత్మకుల రంగారావు, 7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement